
సుస్థిరాభివృద్ధే ధ్యేయం
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అవసరమైన చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ సూచించారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎమ్సీఓలు, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా సీడీజీఎస్‌ను విభజించారని, దీనికి తగిన విధంగా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారని వెల్లడించారు. పంచాయతీల పనితీరును కేంద్ర ప్రభుత్వం అంచనా వేసేందుకు వీలుగా ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించారని, సమాచారాన్ని ఇందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని ఆధారంగా పంచాయతీలను అవార్డులకు ఎంపిక చేయనున్నారని తెలిపారు. జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.