
షూటింగ్ బాల్ క్రీడాకారుల ఎంపిక నేడు
సంగం: జూనియర్స్ బాలబాలికల షూటింగ్ బాల్ క్రీడాకారులను సంగంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ఎంపిక చేయనున్నామని షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2006, మే ఒకటి తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆధార్‌కార్డు, పదో తరగతి మార్క్ లిస్ట్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 94903 20435, 85558 18911 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
26 వరకు డిగ్రీ అడ్మిషన్లు
నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్లను ఈ నెల 26 వరకు నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ గిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బీఎస్సీ సైన్స్‌లో 12.. బీఏలో ఐదు.. బీకాంలో నాలుగు కోర్సులున్నాయని చెప్పారు. కళాశాలలో హాస్టల్ సౌకర్యం ఉందని, అడ్మిషన్ల కోసం 86397 34668 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సబ్ జూనియర్స్ అండర్ – 15 రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలను నగరంలో ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం ప్రారంభించారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను తొలి రోజు నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన 283 జట్లు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తలపడనున్నాయని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు.
బాల్య వివాహాలను అరికట్టాలి
కావలి (జలదంకి): బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కావలి ఆర్డీఓ సన్నీ వంశీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కావలి డివిజన్ పరిఽధిలోని వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా అధికారులకు వెంటనే సమాచారమివ్వాలని కోరారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారి సురేష్, కావలి డీఎస్పీ శ్రీధర్, కమిషనర్ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన రేపు
నెల్లూరు(క్రైమ్): కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న జిల్లా అఽభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను శనివారం నిర్వహించనున్నామని ఎస్పీ కృష్ణకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన పు రుష, మహిళా అభ్యర్థులు నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌కు హాజరుకావాలని కోరారు. దరఖాస్తు సమయంలో జతపర్చిన ధ్రువీకరణ పత్రాలు, గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్‌తో కూడిన ఒరిజినల్స్‌ను తీసుకురావాలని సూచించారు. ఇటీవల తీయించుకున్న ఆరు పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, హాజరైన అభ్యర్థి అటెస్టేషన్ ఫారంలో పూర్తి వివరాలను పొందుపర్చి, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకోవాలని కోరారు.
ఉద్యాన పంటల
సాగుపై దృష్టి
కోవూరు: ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. కోవూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ – క్రాప్ బుకింగ్‌లో కోవూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ముందంజలో ఉందని తెలిపారు. అగ్రిస్టార్ట్ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో 1400 హెక్టార్లలో ఆయిల్ ఫామ్స్ చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ అధికారి అనూరాధ, వ్యవసాయ సహాయ సంచాలకులు అనిత, ఉద్యానాధికారి ప్రసన్న, మండల వ్యవసాయాధికారులు రజని, విజయలక్ష్మి, శ్రీహరి, శశిధర్, మేరీ కమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.