
వీరందరూ అనర్హులంట..
కాలు, చేయి విరిగిన వారు.. శరీరం కాలినా.. మానసిక వికలత్వం కలిగినా.. బధిరులు.. ఇతర వైకల్యం ఉన్న వారిని పింఛన్లకు అనర్హులుగా ప్రకటించారు. వీరెవర్ని కదిలించినా ఆవేదనే కనిపిస్తోంది. అనర్హుల ఏరివేత పేరిట తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చారనే వేదన వీరి నుంచి వ్యక్తమవుతోంది.
పరిశీలన వివరాలు గోప్యం
జిల్లాలో 3.16 లక్షల మంది పింఛన్లు పొందుతుండగా, వీరికి ప్రతి నెలా రూ.130 కోట్లకుపైగా అందిస్తున్నారు. ఇందులో దివ్యాంగులు 33 వేల మంది ఉండగా, వీరందరికీ నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. పరిశీలన అనంతరం వివరాలను గోప్యంగా ఉంచారు. చివరికి ప్రభుత్వం ఆదేశించడంతో అనర్హుల జాబితాను విడుదల చేశారు. పది నుంచి 20 ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న వారికి మొండిచేయి చూపారు.
● సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించి సుమారు 832 మంది దివ్యాంగులకు రీ వెరిఫికేషన్ నోటీసులను జారీ చేశారు.
● ఉదయగరి నియోజకవర్గంలో దివ్యాంగ పింఛన్లు 4672 ఉండగా, ఇందులో 996ను తొలగించారు.

వీరందరూ అనర్హులంట..