కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

Aug 22 2025 6:38 AM | Updated on Aug 22 2025 6:38 AM

కమిషన

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

టేస్ట్‌ అదుర్స్‌

కూల్‌డ్రింక్స్‌కు డిమాండ్‌ ఎక్కువ. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ బ్రాండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు సెంట్రల్‌ జైల్‌ రహదారి సమీపంలో జనం పడేసిన బాటిళ్లను వానరాలు తీసుకుని ఆఖరిబొట్లు ఆస్వాదిస్తుండగా తీసిన చిత్రాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

కందుకూరు: కందుకూరు మున్సిపాలిటీలో కమిషనర్‌ కె.అనూష, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కొండయ్యల మధ్య విభేదాలు బజారుకెక్కాయి. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. దళితుడినని కమిషనర్‌ కక్ష కట్టి వేధిస్తున్నారని, నాలుగు నెలల నుంచి విధుల్లో ఉన్నా.. లేనట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు కొండయ్య ఆరోపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే.. ‘రోజూ పారిశుధ్య కార్మికుల హాజరు కూడా తీసుకుంటున్నా. ఇంకా పట్టణంలో పారిశుధ్య పనులు కూడా చేయిస్తున్నాను. అయితే కమిషనర్‌ చెప్పినట్లు తలాడించడం లేదనే కారణంతో ఇబ్బందులు పెడుతున్నారు. మేనేజర్‌ చంద్రమౌళి రోజువారి హాజరుపట్టీలో నేను సంతకాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. రిజిస్టర్‌ ఇచ్చే ప్రసక్తే లేదని, దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారు. విధుల్లో లేకపోతే రోజూ కార్మికుల వద్ద హాజరు ఎలా తీసుకుంటున్నా?. నా వద్ద ఉండే రిజిస్టర్‌లో సంతకాలు ఎలా చేస్తా’ అని కొండయ్య ప్రశ్నిస్తున్నారు.

ఇదీ వివాదం

మున్సిపాలిటీలో గతేడాది సెప్టెంబర్‌ నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా దారా కొండయ్య పనిచేస్తున్నారు. మే నెలలో ఆయన్ను గుడూరు మున్సిపాలిటీకి డిప్యుటేషన్‌ వేశారు. ఉత్తర్వులను తీసుకునేందుకు కొండయ్య నిరాకరించడంతో తన గదికి అంటించారు. అయితే డిప్యుటేషన్‌ తనకు తెలియకుండా వేశారని, కమిషనర్‌ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని భావించిన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు డిప్యుటేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయన తిరిగి కందుకూరు మున్సిపాలిటీలోనే కొనసాగించే విధంగా మున్సిపల్‌ శాఖ డీఎంఏ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కమిషనర్‌ కూడా రీ జాయిన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. కానీ ఆయన్ను శాఖాపరమైన వాట్సప్‌ గ్రూపుల నుంచి తొలగించారు. అలా చేయడంతో రోజూ ఫొటోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం లేదని కొండయ్య చెబుతున్నారు.

ఉన్నతాధికారుల వద్ద తేల్చుకుంటా..

కమిషనర్‌, మేనేజర్‌ తీరు వల్ల ఏప్రిల్‌ నెల నుంచి జీతాలు రావడం లేదని, దీనిపై ఇప్పటికే మున్సిపల్‌ శాఖ డీఎంఏకి, ఆర్‌డీకి ఫిర్యాదు చేశానని కొండయ్య చెబుతున్నారు. వారు ప్రశ్నించడంతో విధుల్లో లేనట్లు రెండు రోజుల క్రితం తన చేతిలో కాగితం పెట్టారంటున్నారు. వాస్తవాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. పారిశుధ్య పనులకు సంబంధించిన వస్తువులు వంటి తాను ఇవ్వాల్సి ఉందని, కానీ సంబంధం లేకుండా అనధికారికంగా ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో అడ్మిన్‌ సెక్రటరీగా పనిచేసే బాలాజీ అనే ఉద్యోగితో చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి పనులు చేయనందుకే తనను వేధిస్తున్నారని చెప్పారు.

తీవ్ర ఇబ్బందులు

నాలుగు నెలలుగా జీతం రాకపోవడంతో కుటుంబ పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె చికిత్స కూడా డబ్బుల్లేని పరిస్థితి ఉందన్నారు. కందుకూరులో ఉంటున్న గదికి అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం కార్మికుల హాజరు తీసుకుని భవనంలోని ఓ గదిలో ఉంటున్నట్లు వాపోయారు.

మున్సిపల్‌ కార్యాలయం

మున్సిపాలిటీలో అంతర్గత పోరు

ఇన్‌స్పెక్టర్‌ కొండయ్యపై కక్ష

సాధింపునకు దిగిన కమిషనర్‌

నాలుగు నెలలుగా

జీతం రాకుండా కొర్రీలు

ఉన్నతాధికారులకు ఫిర్యాదు

దళితుడైనందునే ఇలా చేస్తున్నారని బాధితుడి ఆరోపణ

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ 1
1/4

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ 2
2/4

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ 3
3/4

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ 4
4/4

కమిషనర్‌ x శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement