
ఫేక్ విద్యార్హత సర్టిఫికెట్లతో మోసం
పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో 223 మంది పారిశుద్ధ్య కార్మికులు, 137 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో పలువురికి పీఎఫ్ తమ ఖాతాల్లో జమ కావడం లేదు. ఎందుకు జమ కావడం లేదని ప్రశ్నిస్తే మీకు పుట్టిన తేదీ లేదు. ఏదైనా చదువుకున్న సర్టిఫికెట్, పాస్‌పోర్టు లాంటివి ఇస్తే.. అప్పుడు పీఎఫ్ జమ చేస్తామని ఏజెన్సీ మేనేజర్ స్పష్టం చేశాడు. అవి సరి చేసేందుకు అంటూ కొంత మంది దగ్గర రూ.13 వేలు, మరి కొంత మంది దగ్గర రూ.15.వేలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ అవసరమైన వారికి ప్రకాశం జిల్లా దొనకొండ జెడ్పీ హైస్కూల్లో చదివినట్లు అక్కడి హెడ్మాస్టర్ సంతకాలను ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి కార్మికులకు ఇచ్చారు. ఇది జరిగి ఏడాదైనాప్పటికీ ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పీఎఫ్ నగదు జమ లేదు. ఇలా తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డికి సురేఖ, కృష్ణవేణి, అమల అనే మహిళలు ఫిర్యాదు చేశారు.
కార్మికులకు ఇచ్చిన ఫేక్ విద్యా సర్టిఫికెట్లు