
తీర గ్రామాల్లో సోలార్ కాంతులు
చిల్లకూరు: అదానీ కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అదానీ ఫౌండేషన్ మండలంలోని తీర ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. బుధవారం తమ్మినపట్నం పంచాయతీలో ఆ ఫౌండేషన్ హెడ్ రాజేష్‌రంజన్ మాట్లాడుతూ తమ్మినపట్నంలో సుమారు 150 సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల గ్రామాల్లోని మత్స్యకార యువత కోరిన మేరకు క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. అలాగే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. స్థానిక నాయకులు కోట సతీష్‌యాదవ్, మత్స్యకార నాయకులు బక్తాని రామయ్య, మేకల వెంకయ్య, నాగూరు, సుబ్బయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.