
కేన్సర్ నివారణపై వర్క్‌షాప్
నెల్లూరు(అర్బన్): నగరంలోని నారాయణ మెడికల్ కళాశాలలో కేన్సర్ నివారణపై రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది. నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొని మాట్లాడారు. కాలుష్యం లేని, కలుషితం కాని పోషకాహారం తీసుకోవడం ద్వారా పలు రకాల కేన్సర్‌లను నివారించవచ్చన్నారు. ఐసీఎంఆర్ నిధులు పొందిన నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆంధ్రప్రదేశ్‌లో రెండోది కావడం గర్వకారణమన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ వనజకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తేజోవతి, మెడికల్ కళాశాల కో–ఆర్డినేటర్ బిజూ రవీంద్రన్, ఆపరేషన్స్ హెడ్ రామారావు, అంకాలజిస్ట్ ఉషారాణి పాల్గొన్నారు.