
మార్కెటింగ్‌పై శిక్షణ
నెల్లూరు (పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి కాంక్షించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై సీసీలు, ఏపీఎంలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కుటీర, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించి స్వయం సహాయక గ్రూపు మహిళలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని వివరించారు. వినియోగదారులను ఆకర్షించేలా ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
సీహెచ్‌ఓల మానవహారం
నెల్లూరు(అర్బన్): తమను ప్రభుత్వం, అధికారులు ఎంత ఇబ్బంది పెట్టినా, సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఆపేదిలేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ స్పష్టం చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌లు చేపట్టిన నిరసన దీక్షలు గురువారంతో 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గుప్తా పార్కు రోడ్డులో ప్లకార్డులను ప్రదర్శిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. సంఘ ప్రధాన కార్యదర్శి రుబికా, జిల్లా కో ఆర్డినేటర్ ఆదిల్, ఈసీ మెంబర్ మాబ్జాన్, విజయ్, ప్రశాంతి, స్వాతి, చంద్రకళ పాల్గొన్నారు.
చిన్నారులకు ఎమ్మార్ వ్యాక్సిన్ తప్పనిసరి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఎమ్మార్ వ్యాక్సిన్‌ను తప్పక వేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఎమ్మార్ వ్యాక్సినేషన్‌పై కలెక్టరేట్లోని తన చాంబర్‌లో గురువారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తట్టు, పొంగు వ్యాధుల నివారణకు టీకాలను వేయాలని కోరారు. ఎమ్మార్ వ్యాక్సినేషన్‌పై జిల్లాలో మూడు విడతల్లో ప్రచారం చేయాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లోని మురికివాడలు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాల్లో చిన్నారులకు టీకాలను వేయాలని చెప్పారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, డీఎంహెచ్‌ఓ సుజాత, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీసీహెచ్‌ఎస్ పరిమళ, మెప్మా పీడీ లీలారాణి, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
అనధికార
నిర్మాణాలకు నోటీసులు
నెల్లూరు(బారకాసు): నగరంలో అనధికార నిర్మాణాలకు సంబంధించి చార్జిషీట్లను దాఖలు చేసి యజమానులకు నోటీసులను అందజేయాలని కమిషనర్ నందన్ ఆదేశించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన కోర్టు కేసుల దాఖలు తదితర అంశాలపై కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి భవన నిర్మాణ అనుమతులు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని సూచించారు. సిటీ ప్లానర్ హిమబిందు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మార్కెటింగ్‌పై శిక్షణ

మార్కెటింగ్‌పై శిక్షణ