
కరోనాపై అప్రమత్తం
నెల్లూరు(అర్బన్): దక్షిణాసియాతో పాటు దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి, ఒమిక్రాన్‌కు చెందిన ఉప వేరియంట్ జేఎన్ – 1 వైరస్ క్రమేపీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రతో పాటు కేరళలో కేసులు పెరగడంతో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా వైద్యశాఖ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఏమైనా లక్షణాలున్నాయా లేదా పరిశీలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు పెద్దగా ప్రమాదం లేదని, రాష్ట్రంలో కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌ఓ సుజాత తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.