
సీ వాటర్ పైప్‌లైన్ లీకేజీ
● వృథాగా పోతున్న నీరు
ముత్తుకూరు (పొదలకూరు): నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం సీ వాటర్ పైప్‌లైన్ లీకయి నీరు వృథాగా పోతోంది. గత కొద్దిరోజులుగా ఇలా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైల్‌లైన్ లీకేజీని అరికట్టకుండా కాలయాపన చేస్తుండడంతో భారీగా నీరు పోతోంది. ఈ సందర్భంగా జెన్కో ఎస్‌ఈ మాట్లాడుతూ బకింగ్‌హామ్ కాలువ దిగువున ఉన్న ప్రవాహం వేగానికి పైల్‌లైన్లో చిన్నపాటి రంథ్రాలు పడి నీరు లీకవుతోందని, సంబంధిత కాంట్రాక్టర్‌ను మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. నాలుగురోజుల్లో లీకేజీని అరికడతామన్నారు.
యూటీఎఫ్ ధర్నా రేపు
నెల్లూరు (టౌన్): పాఠశాలల పునఃవ్యవస్థీకరణలో లోపాలు, పదోన్నతుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిశర్మ తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ బాలాజీరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైట్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయులను మిగులు లేని పాఠశాలలకు కేటాయించమని రాష్ట్ర విద్యాశాఖాధికారు లు సూచించినా డీఈఓ అమలు పరచలేదన్నారు. దాంతో ధర్నా చేయబోతున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ డిపోలో సమస్యల
పరిష్కారానికి కృషి
కందుకూరు: ఆర్టీసీ డిపోలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏపీఎస్‌ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. గ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి, డిపో ఆవరణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో నీరు నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసరావు, ఎంఎఫ్ రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ డిపో మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.

సీ వాటర్ పైప్‌లైన్ లీకేజీ

సీ వాటర్ పైప్‌లైన్ లీకేజీ