
గుర్తింపును రద్దు చేయాలి
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్న ఇంటర్ కళాశాలల యాజమాన్యాల గుర్తింపును రద్దు చేయాలి. ఎన్నడూ లేని విధంగా వేసవి సెలవులివ్వకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారిపై బలవంతంగా చదువులను రద్దుతున్నారు. కలెక్టర్ దృష్టి సారించాలి.
– ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ
పట్టించుకోవడం లేదు
ర్యాంక్‌లు, మార్కుల పేరుతో విద్యార్థులను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలి. తరగతుల నిర్వహణపై ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇంటర్ విద్యార్థులకు సెలవులిచ్చేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలి.
– లీలామోహన్, రాష్ట్ర కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ
తనిఖీలు నిర్వహిస్తాం
ఇంటర్ తరగతుల నిర్వహణపై రోజూ తనిఖీలు నిర్వహిస్తాం. తరగతులు నిర్వహిస్తున్న కళాశాలను గుర్తించి ఆయా యాజమాన్యాలపై ఇంటర్ బోర్టు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కాలేజీల ప్రిన్సిపల్స్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశాం. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.
– వరప్రసాద్‌రావు, ఆర్‌ఐఓ
●

గుర్తింపును రద్దు చేయాలి

గుర్తింపును రద్దు చేయాలి

గుర్తింపును రద్దు చేయాలి