
గిరిజన కాలనీలో అగ్నిప్రమాదం
● పూర్తిగా కాలిపోయిన నాలుగు పూరిళ్లు
చేజర్ల(ఆత్మకూరు): మండలంలోని ఆదూరుపల్లి గిరిజన కాలనీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు, ఇతర సామ గ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు స్పందించి మంటలు అదుపు చేసినా అప్పటికే భారీ నష్టం సంభవించిందని గిరిజన కుటుంబాల వారు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వం కోల్పోయామని వాపోయారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న చేజర్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి సమీపంలోనే విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. అయితే మధ్యా హ్నం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.