ఇద్దరికి తీవ్రగాయాలు
కోవూరు: ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కోవూరు బైపాస్‌రోడ్డులోని సాయిబాబా మందిరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు కొడవలూరు మండలం నాయుడుపాళెంకు చెందిన మదన్, కిశోర్ బైక్‌పై నెల్లూరుకు వస్తున్నారు.
అదే సమయంలో ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రంగనాథ్‌గౌడ్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.