
సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ విజేత వీఎస్‌యూ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఐదురోజులపాటు జరిగిన జాతీయ స్థాయి పురుషుల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ ముగిసింది. వీఎస్‌యూ జట్టు విజేతగా నిలిచింది. చివరి రోజైన గురువారం నాలుగు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్‌లు జరిగాయి. విక్రమ సింహపురి యూనివర్సిటీ అత్యుత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచింది. మహారాజా సూరజ్‌మాల్ బ్రిజ్ యూనివర్సిటీ (జైపూర్) ద్వితీయ స్థానంలో, కాలికట్ యూనివర్సిటీ (కేరళ) తృతీయ స్థానంలో, సంత్ గాడ్గే బాబా అమరావతి యూనివర్సిటీ (మహారాష్ట్ర) నాలుగో స్థానంలో వచ్చాయి. వారికి వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ టోర్నమెంట్‌ను సమష్టి కృషితో విజయంతం చేశామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు.