బాబుది జేబులు నింపుకొనే స్కీం | - | Sakshi
Sakshi News home page

బాబుది జేబులు నింపుకొనే స్కీం

May 11 2025 12:07 AM | Updated on May 11 2025 12:07 AM

బాబుది జేబులు నింపుకొనే స్కీం

బాబుది జేబులు నింపుకొనే స్కీం

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీం ప్లాన్‌ చేసినా దానివెనుక స్కాం తప్పకుండా ఉంటుందని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సునంద ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలహీనవర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకొంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీసిందన్నారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకొంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు. చివరికి మహిళలకు కుట్టుమెషీన్లు పంపిణీ చేస్తాడు. కుట్టుమెషీన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తాడో అర్థంకాదని సునంద అన్నారు. కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారన్నారు.

ఒక్కో లబ్ధిదారు పేరుతో

రూ.16 వేలు దోపిడీ

రూ.221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమెషీన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టుమెషీన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనులు ప్రారంభించకుండా దోపి డీకి మాత్రం డోర్లు బార్లా తీశారన్నా రు. ఈ పథకానికి రూ.221 కోట్లు అంచనా వేస్తే రూ. 75.06 కోట్లకే లెక్క లున్నాయన్నారు. మిగిలిన రూ.154 కోట్లకు లె క్కలే లేవన్నారు. ఈ దామాషాలో ఒక్కో లబ్ధిదారుని పేరుమీద రూ.16వేల వరకు దోపిడీ జరుగుతుందని స్పష్టమవుతోందని తెలిపారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సు పేరుతో బీసీ, ఈడబ్ల్యుఎస్‌, కాపు మహిళలకు టైలరింగ్‌ శిక్షణ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా రూ.25 కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు రంగం సిద్ధమైందని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్రాల్లో పేరున్న శిక్షణా సంస్థలు ఉన్నప్పటికి వాటిని కాదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సహకార సంస్థ ద్వారా ఈ పథకాన్ని చేపట్టి భారీ స్కాంకు తెరతీశారన్నారు. టెండర్లలోనూ మాయా జాలంతో ఈ పథకాన్ని తమవారికే చెందేలా పావులు కదుపుతున్నారన్నారు. శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో మహిళలు తలెత్తుకుని జీవించేలా పథకాలను రూపొందించారన్నారు. ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి పాల్పడుతోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అంగన్వాడీ వింగ్‌ అధ్యక్షురాలు పాల లావణ్య, నెల్లూరు రూరల్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రమాదేవి, మహిళా నాయకులు బషీర, హైమావతి, నర్మద తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో మోసం

రూ.154 కోట్లు దండుకోవడానికి కుట్ర

వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా

అధ్యక్షురాలు సునంద ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement