
టీ అంగడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
● 640 భంగ్ గోలీలు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): మత్తు ఇచ్చే భంగ్ గోలీలను విక్రయిస్తున్న ఓ టీ షాపుపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. గంజాయితో మిళితమైన 640 భంగ్ గోలీలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారుల సమాచారం మేరకు.. హోలీ వేడుకల్లో కొందరు జోష్ కోసం గంజాయితో మిళితమైన భంగ్‌ను సేవిస్తూ లోకాన్ని మరిచిపోతారు. ఇలా అధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతుంది. క్రమేపీ మన జిల్లాలోనూ విస్తరిస్తోంది. కొందరు భంగ్‌ను సేవిస్తున్నారు. నెల్లూరు ఇందిరాభవన్ రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జయకిషన్ భంగ్ విక్రయాలకు తెరలేపాడు. ఆ రాష్ట్రంలో భంగ్ గోలీలను కొనుగోలు చేసి జిల్లాలోని కొందరు రాజస్థానీలకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. దీనిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.దయాసాగర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్లు వై.వెంకటేశ్వర్లు, పి.అనితలు తమ సిబ్బందితో కలిసి టీ దుకాణంపై దాడులు చేశారు. 640 భంగ్ గోలీలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న గోలీలు, నిందితుడిని ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్‌లో అప్పగించారు. ఎకై ్సజ్ అఽధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఎస్సై సీహెచ్ పూర్ణకుమార్, హెచ్‌సీలు రమేష్‌కుమార్, కిరణ్‌సింగ్, కానిస్టేబుల్స్ మునిరాజ్‌కుమార్, రమణయ్య పాల్గొన్నారు.