
నీటిని పొదుపుగా వాడుకోండి
సోమశిల: సోమశిల జలాశయం నుంచి రెండో పంటకు విడుదల చేస్తున్న సాగునీటిని పొదుపుగా వాడు కునే మరింత అత్యధిక విస్తీర్ణంలో పంటలు పండించుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రైతులు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు, గంగమ్మ తల్లికి చీరసారే, జలహారతి సమర్పించి పెన్నాడెల్టాకు నీటిని విడుదల చేశారు. మంత్రి ఆనం మాట్లాడుతూ జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం కింద 3.60 లక్షల ఎకరాలకు 42 టీఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్ట్‌ల కింద ఉమ్మడి జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు 16 టీఎంసీల నీటిని రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తామని చెప్పారు. సోమశిలలో నిల్వ ఉన్న 52 టీఎంసీంల్లో తాగునీరు, ఇతర అవసరాలకు 12 టీఎంసీలను నిల్వ ఉంచి మిగిలిన 40 టీఎంసీలను రెండో పంటకు రైతాంగానికి అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పెన్నా డెల్టా కింద 2 లక్షల ఎకరాలకు 22.219 టీఎంసీలు, కనుపూరు ప్రధాన కాలువ కింద 20 వేల ఎకరాలకు 2.223 టీఎంసీలు, నార్త్ ఫీడర్ చానల్ 35 వేల ఎకరాలకు 3.889 టీఎంసీలు మొత్తం 3.64 లక్షల ఎకరాలకు 40.442 టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవచౌదరి, రాజగోపాల్, ఎస్‌ఈలు వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణ, ఆర్డీఓ పావని, ఈఈలు, జెఈలు తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్‌కు 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు
సోమశిల జలాశయం నుంచి రెండో
పంటకు నీటిని విడుదల చేసిన మంత్రి
రెండో పంటకు సోమశిల జలాల విడుదల