
దంచికొట్టిన వర్షం
నెల్లూరు(అర్బన్): భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలను వరుణుడు పలకరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. దాదాపు 30 నిమిషాల పాటు వర్షం దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. నగరంలోని గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, ఏసీ స్టేడియం, మనుమసిద్ధినగర్, మాగుంట లేఅవుట్ తదితర ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్డుపై ప్రవహించింది. వెంకటాచలం, కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, సంగం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
రైల్వేస్టేషన్లో ప్రయాణికుల అగచాట్లు
నీటమునిగిన ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అండర్ బ్రిడ్జి
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం

దంచికొట్టిన వర్షం