
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
మనుబోలు: కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడ నుంచి ఓ కుటుంబం కారులో చైన్నె బయల్దేరారు. కాగితాలపూరు క్రాస్ దాటాక డ్రైవర్ ఏమరుపాటుగా ఉండటంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లో ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఘటనలో శిరీష గాయపడ్డారు. ఆమెను 108లో నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో నీటి నిల్వ
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 42.71 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగకు 2250, పిన్నేరుకు 20, లోలెవల్‌కు 60, హైలెవల్‌కు 60, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
వెంకటాచలం: బైక్ అదుపుతప్పడంతో వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని కసుమూరు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మున్వర్ పని నిమిత్తం బైక్‌పై కసుమూరు వచ్చారు. తిరిగెళ్తుండగా, కసుమూరు మలుపు రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పింది. గాయపడిన మున్వర్‌ను చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు.