
కొనసాగుతున్న సీహెచ్‌ఓల ఆందోళన
నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపేదిలేదని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ జిల్లాలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి సీహెచ్‌ఓలు సమ్మె చేస్తున్నారు. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట వారు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారంతో 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరసన దీక్షలను తాము చేపట్టినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సంఘ జిల్లా కో ఆర్డినేటర్ ఆదిల్, స్వాతి, అనూష తదితరులు పాల్గొన్నారు.