
సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కేసులు
నెల్లూరు (పొగతోట): నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించేవారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్‌ఓ విజయ్‌కుమార్ హెచ్చరించారు. అధికారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపార సంస్థల్లో అందుబాటులోఉన్న నిల్వలు ధరల వివరాలను ప్రతిరోజూ బోర్డులో నమోదు చేయాలని సూచించారు. నిత్యావసర సరుకులు అధిక మొత్తంలో నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఓ అంకయ్య, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.