
ప్రభుత్వ భూమిలో కలప నరికివేత
దుత్తలూరు: మండల పరిధిలోని భైరవరం గ్రామంలో ప్రభుత్వ భూమిలో రెండు రోజులుగా అక్రమంగా కలప నరికి అమ్ముకుంటున్నారు. గ్రామస్తులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం తహసీల్దార్ యనమల నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల అండతో ఓ వ్యక్తి సర్వే నంబర్ 168 – 1ఏలో కలపను నరికించి ఇతరులకు అమ్ముతున్నట్లు ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీఆర్వో మాల్యాద్రిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలప నరికివేతను ఆపేస్తామని, రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.