
జెడ్పీలో కారుణ్య నియామకాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాల కింద పలువురికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో 76 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. 107 మందికి పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, 4వ తరగతి ఉద్యోగులు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కె.భీమ్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మాబాషా, అధికారులు పాల్గొన్నారు.