కనీస వేతనం నిర్ణయించాలంటూ..
పెరిగిన నిత్యావసర ధరలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.35 వేలుగా నిర్ణయించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలను తక్షణమే ప్రకటించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 12 నెలలకు పైగా వేతనాలు బకాయి పెట్టారని, వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.


