రోడ్డు భద్రత మాసోత్సవాల బ్యానర్ల ఆవిష్కరణ
నెల్లూరు (టౌన్): రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని బ్యానర్లు, కరపత్రాలను సంతపేటలోని తన నివాసంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 31 వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డీటీసీ చందర్, ఆర్టీఓ మదానీ, ఎమ్వీఐలు బాలమురళి, రఫీ, రాములు, ఏఎమ్వీఐలు పూర్ణచంద్రరావు, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గుడ్డు ధర చూసి
గుడ్లు తేలేస్తూ..!
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి గుడ్డు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో గుడ్లు తేలేయడం వినియోగదారుల వంతవుతోంది. హోల్‌సేల్ మార్కెట్లో ఒక గుడ్డు ధర రూ.7.10 ఉండగా, రిటైల్‌లో రూ.7.5 నుంచి రూ.ఎనిమిది వరకు పలుకుతోంది. 30 కోడిగుడ్ల షీట్ రూ.213గా నమోదైంది. గుడ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతవ్వడంతో పాటు రెండు నెలల క్రితం వచ్చిన భారీ వర్షాలు, తుఫాన్లు, వరదల తాకిడికి తెలుగు రాష్ట్రాల్లో ఏడు లక్షలకుపైగా కోళ్లు, బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ధరల పెరుగుదలకు ఇదీ ఓ కారణమని తెలుస్తోంది. మరోవైపు చికెన్ ధరలూ పెరిగాయి. కిలో చికెన్ రూ.280.. స్కిన్‌లెస్ రూ.300గా ఉంది. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
రోడ్డు భద్రత మాసోత్సవాల బ్యానర్ల ఆవిష్కరణ


