
కూటమి సర్కారులో మహిళా ఉద్యోగులకు అన్యాయం
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక భద్రత ఉంటుందని... అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కూటమి ప్రభుత్వం తమను ఇబ్బందికి గురిచేయడం దారుణమని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్ అన్నారు. సీహెచ్‌ఓలు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. సమ్మె సందర్భంగా ప్రతి రోజూ డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఏ అధికారి కూడా తమ సమస్యలపై విచారించకపోవడం, చర్చించకపోవడం బాధాకరమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం చేయమని చెప్పిన కూటమి ప్రభుత్వంలో సీహెచ్‌ఓలుగా పనిచేసేది 90 శాతానికి పైగా ఆడపిల్లలే అనే సంగతి మరిచిపోయారని విమర్శించారు. తమకు వేతనాల్లో అన్యాయాన్ని సరిదిద్దాలని, పీఎఫ్‌ను పునరుద్ధరించాలని, వర్క్ చార్ట్ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, నాయ కులు గాయత్రి, రుబికా పాల్గొన్నారు.
18 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా
నిరసన కార్యక్రమంలో సీహెచ్‌ఓలు