వడ్డీతో సహా చెల్లిస్తాం
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో ప్రజాపాలన గాలికి వదిలేసి, అక్రమార్జన కోసం గ్రావెల్, ఇసుక, రేషన్ బియ్యం మాఫియాలను నడిపిస్తున్న ఎమ్మెల్యే అరాచకపాలన మీద ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, మీకు వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు పలువురు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశామని, మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డామంటూ నాతోపాటు మా నాయకులపై, ఏ పాపం ఎరుగని మీడియా ప్రతినిధుల మీద అక్రమ కేసులు పెట్టి కావలి ఎమ్మెల్యే రాక్షసానందం పొందుతున్నాడన్నారు. కట్టు కథ సూపర్‌గా ఉందన్నారు. పోలీసులను ఇలా కూడా వాడుకోవచ్చని పదేళ్లు అధికారంలో ఉన్న మాకు చేతకాలేదన్నారు. ఇప్పుడు అవన్నీ మాకు బాగా నేర్పిస్తున్నారని, బాగా నేర్చుకుంటామని చెప్పారు. మా అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.. ఒక చెంపపె కొట్టండి.. దాన్ని మేము తిరిగి ఇస్తామని చెప్పారు. కొట్టండి.. కేసులు పెట్టండి.. అక్రమ అరెస్ట్‌లు చేయించండి.. అవి కూడా చాలకపోతే ఇంకా నాలుగు కేసులు కూడా పెట్టుకోండి.. భయపడేది లేదన్నారు. కావలిలో ఇటువంటి సంస్కృతి ఇంత వరకు లేదన్నారు. గతంలో కావలి నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచి సేవలు అందించారన్నారు. కలికి యానాదిరెడ్డి నుంచి మాగుంట పార్వతమ్మ, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, నాతో సహా అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కక్షపూరితంగా కేసులు పెట్టి వేధించుకున్న చరిత్ర లేదన్నారు. జలదంకి మండల సంస్కృతిని కావలికి అప్పు తెచ్చుకుంటున్నామని, అవకాశం వచ్చినప్పుడు వాటిని అప్పును వడ్డీ సహా తప్పకుండా తీరుస్తామన్నారు. మా మీద కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, కేసులు పెట్టారు కాబ ట్టి ఎదుర్కొనేందుకు న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. లేదంటే కచ్చితంగా అరెస్ట్ చేయాలంటే ఎస్పీ కానీ, డీఎస్పీ కానీ చెప్పండి చాలు. నేనే వచ్చి మీ ఎదుట లొంగిపోతానన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది అవినీతి, అక్రమాలు చేయమని కాదని, మంచి పరిపాలన అందించమని, అలా కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ జలదంకి మండలంలో చేసిన విష సంస్కృతిని కావలిలో చేస్తే ఊరుకునేది లేదన్నారు. మీడియా ప్రతినిధులకు అండగా నిలబడింది తామేనని, ఇప్పుడు స్వార్థంతో కొందరు ఎమ్మెల్యే వద్దకు చేరి వారు గతంలో ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. మీడియా అనేది నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు.
అక్రమ కేసులు పెడితే భయపడేది లేదు
కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి


