
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి
నెల్లూరు (అర్బన్): నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి.రాజేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై నెల్లూరు ప్రిన్సిపల్‌గా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఆమెను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందు, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్‌బాషా, పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ కళారాణితోపాటు పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు బొకేలు అందజేసి అభినందించారు.
వెబ్‌సైట్‌లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా
నెల్లూరు (టౌన్): జిల్లాలోని సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల సీనియార్టీ తుది జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9వ తేదీలోపు తగిన ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
ఎర్రచందనం
దుంగల పట్టివేత
ఆత్మకూరు: ఆత్మకూరు అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సోమశిల ఉత్తరకాలువ సమీపంలో గుడిగుంట బీట్ వద్ద బుధవారం 11 ఎర్రచందనం దుంగలు అటవీ శాఖ సిబ్బంది స్వాధీ నం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 300 కేజీలు ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 గంటల సమయంలో స్వాధీనం చేసుకున్న సిబ్బంది ఆటోలో వేసుకుని ఆత్మకూరుకు 11.30 గంటల సమయంలో చేరారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొందరు ఆ దుంగలను ఫొటోలు తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సంబంధిత అధికారులు చెప్పకపోవడంతో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్‌కే మహబూబ్‌బాషాను సంప్రదించగా తనకు సమాచారం తెలియలేదని చెప్పడం గమనార్హం.

ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి