ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే యుద్ధ ప్రకటనలు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): దేఽశంలోని అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం వైపల్యం చెందిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్‌పై యుద్ధ ప్రకటనలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ప్రధాని యుద్ధ ప్రకటనలు చేస్తున్నారని, పహల్గాం ఘటన పూర్తిగా కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఇప్పటికీ పట్టుకోలేకపోయారన్నారు. ప్రధాని రాష్ట్రంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినా ఎలాంటి ప్రయెజనం ఉండదని, గతంలో కూడా చెంబుడునీళ్లు, మట్టి ఇచ్చి సరి పెట్టాడని పేర్కొన్నారు. కులగణన అంశాన్ని పార్లమెంట్‌లో మొట్టమొదటగా లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జిల్లాలో పర్యటనకు రానున్నారని, అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్నారు. అనంతరం డీసీసీ ఉపాధ్యక్షుడిగా తలారి బాలసుధాకర్‌ను తిరిగి రెండో సారి నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశా రు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉడతా వెంకట్రావ్‌యాదవ్, శ్రీనివాసులరెడ్డి, మోహన్‌రావు, ఫయాజ్, ఫజుల్లా తదితరులు పాల్గొన్నారు.
పహల్గాం ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం
13న నెల్లూరుకు పీసీసీ అధ్యక్షురాలు రాక


