10న ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు
నెల్లూరు(అర్బన్): ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలను జనవరి పదిన నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి, సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాఘవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్గామిట్టలోని అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం పదింటికి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న 17 పదవులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్జీఓ భవన్‌లో ఈ నెల 30న నిర్వహించనున్నామని తెలిపారు. సహ ఎన్నికల అధికారిగా చిత్తూరు జిల్లా కార్యదర్శి రమేష్, పర్యవేక్షకుడిగా ఎన్జీఓస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జగదీష్‌ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ నియమించారని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జీఎస్టీ రెవెన్యూ
రూ.156.99 కోట్లు
నెల్లూరు (టౌన్): నెల్లూరు డివిజన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఈ డిసెంబర్ నాటికి జీఎస్టీ రెవెన్యూ రూ.156.99 కోట్లు వచ్చిందని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024లో ఇది రూ.108.07 కోట్లుగా ఉందన్నారు. అదే విధంగా ఎస్జీఎస్టీ 2024లో 50.83 కోట్లు ఉండగా, 2025లో 60.73 కోట్లుగా నమోదైందని వివరించారు. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి వాహనాల తనిఖీ ద్వారా రూ.3.36 కోట్ల జరిమానాను వసూలు చేశామని చెప్పారు. విధుల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
జెడ్పీ ఉన్నత
పాఠశాలలో తనిఖీ
వరికుంటపాడు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ బాలాజీరావు శుక్రవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై సమీక్షించారు. 50 మంది విద్యార్థుల కోసం రూపొందిస్తున్న యాక్షన్ ప్లాన్.. ప్రణాళిక మేరకు అమలవుతోందాననే అంశమై ఎంఈఓ – 1 కొండయ్య, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణయ్యను ఆరాతీశారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో బోధించాలని సూచించారు.
నిధుల దుర్వినియోగంపై
ఎంకై ్వరీ
మనుబోలు: మండలంలోని వీరంపల్లి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గతంలో ఫిర్యాదు రావడంతో విచారణను డీఎల్పీ ఓ పుట్టా రమణయ్య శుక్రవారం చేపట్టారు. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలు రావడంతో విచారణ చేపట్టేందుకు వచ్చామని తెలిపారు. ప్రాథమికంగా విచారణను ప్రారంభించామని, పండగలు అయ్యాక పూర్తి స్థాయిలో జరుపుతామని వివరించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 72,255 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 37,154 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
10న ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు


