మహిళా కబడ్డీ జట్టు ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర సీనియర్స్ మహిళా కబడ్డీ జట్టును నగరంలోని సెయింట్ పీటర్స్ స్కూల్ మైదానంలో శుక్రవారం ఎంపిక చేశారు. ముఖ్యఅతిథులుగా రైల్వే ఎస్సై హరిచందన, ట్రాఫిక్ ఆర్‌ఎస్సై నాగరాజు, డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కాంక్షించారు. 20 మందిని ఎంపిక చేశామని, వీరికి ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి జిల్లా జట్టు క్రీడాకారులను ప్రకటించనున్నామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరీష్, కార్యదర్శి గంటా సతీష్ తెలిపారు. ఉదయ్, మోజెస్, రామచంద్రయ్య, సునీల్, రామకృష్ణ, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.


