‘అల్ట్రా మెగా’ భూములపై కన్ను
● ఆక్వా సాగుకు యత్నం
ముత్తుకూరు(పొదలకూరు): దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణపట్నం కేంద్రంగా సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ కేంద్ర నిర్మాణానికి భూములను సేకరించారు. దీనికి గానూ 2700 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అందజేయగా, పరిహారాన్నీ చెల్లించారు. అయితే నేటికీ థర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపన జరగలేదు. భూములు అన్యాక్రాంతం కాకుండా చుట్టూ కౌంపౌండ్ వాల్‌ను నిర్మించారు. అయితే గోడ సమీపంలో థర్మల్ కేంద్రానికి కేటాయించిన భూములు బీడుగా ఉండడంతో వాటిపై కొందరి కన్ను పడింది. దీంతో అక్కడ ఆక్వా సాగు కోసం సుమారు 25 ఎకరాల్లో కంపకర్రను జేసీబీతో తొలగించారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహించి అక్కడికి చేరుకోవడంతో ఆక్రమణకు యత్నంచిన వారు పలాయనం చిత్తగించారు. ఈ భూములకు సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్ ఉండటంతో ఆక్వాసాగుకు అనుకూలంగా మారడంతో ఖాళీగా ఉన్న భూములపై కొందరు కన్నేసి గుంతలు తీసేందుకు యత్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భూముల వద్ద జంగిల్ క్లియరెన్స్


