ఉపాధి మస్టర్లపై ఏపీడీ విచారణ
కొండాపురం: మండలంలోని ఆరు పంచాయతీల్లో బయటి వ్యక్తులకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ మస్టర్లను నమోదు చేసే లాగిన్‌ను ఇచ్చి వేయించారంటూ రాష్ట్ర నీటి యాజమాన్య సంస్థ కమిషనర్‌కు మర్రిగుంట సర్పంచ్ దార్ల గోపీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గోపీ, ఏపీఓ మురళితో విచారణను కందుకూరు డివిజన్ ఏపీడి శ్రీనివాసరావు శుక్రవారం నిర్వహించారు. పూర్తి స్థాయిలో విచా రణ కాలేదని, మరోసారి జరిపి వివరాలను వెల్లడిస్తామని ఏపీడీ చెప్పారు. ఈ సందర్భంగా గోపీ మాట్లాడారు. మండలంలోని ఆరు పంచాయతీల్లో కొత్త వ్యక్తులకు మస్టర్ల లాగిన్‌ను స్థానిక ఎంపీడీఓ ఆదినారాయణ, ఏపీఓ మురళిలు ఇచ్చి వేయించారని ఆరోపించారు. దీనిపై గతంలో ఉదయగిరి ఏపీడీ విచారణ నిర్వహించినా, న్యాయం లభించకపోవడంతో కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. డిప్యూటీ ఎంపీడిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


