52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

May 11 2025 12:08 AM | Updated on May 11 2025 12:08 AM

52 బస

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

వెంకటాచలం: పాల వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వెంకటాచలం టోల్‌గేట్‌ సమీపంలో వాహనాల తనిఖీలను విజిలెన్స్‌ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో శనివారం చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల వ్యాన్‌ను తనిఖీ చేయగా, 52 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

హత్య కేసులో

నిందితుడి అరెస్ట్‌

వెంకటాచలం: కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసిన కేసులో నిందితుడు పచ్చిపాల బాబును పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ అబ్బిసాహెబ్‌కండ్రిగలో పచ్చిపాల భారతి గొంతును కత్తితో ఆమె భర్త ఈ నెల ఏడో తేదీ రాత్రి కోసి దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితుడ్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు.

గడ్డివామి దగ్ధం

తోటపల్లిగూడూరు: మండలంలోని పేడూరు కొలిదిబ్బ గిరిజన కాలనీకి చెందిన గిరిజన దంపతులకు సంబంధించిన పదెకరాల గడ్డివామి శుక్రవారం అర్ధరాత్రి దగ్ధమైంది. బాధితులు ఎంబేటి రవి, సుమతి దంపతుల వివరాల మేరకు.. పాడి గేదెల కోసం గడ్డిని కొనుగోలు చేసి వామిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆర్పేందుకు కాలనీ వాసులు యత్నించారు. ఘటనలో సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లింది. బాధితులను సీపీఎం నేతలు లక్ష్మయ్య, రాధయ్య, శేఖర్‌ తదితరులు పరామర్శించారు.

విద్యుదాఘాతంతో

యువకుడి దుర్మరణం

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఓ షోరూమ్‌లో బైక్‌ వాటర్‌ సర్వీస్‌ పాయింట్‌లో సాయితేజ (19) పనిచేస్తున్నారు. ఈ క్రమంలో షోరూమ్‌లో విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే పట్టణంలోని సీహెచ్‌సీకి సహచరులు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కండలేరులో నీటి నిల్వ

రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 44.57 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగకు 850, పిన్నేరుకు 20, లోలెవల్‌కు 60, హైలెవల్‌కు 70, మొదటి బ్రాంచ్‌ కాలువకు 70 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు.

పొదలకూరు నిమ్మ ధరలు

పెద్దవి: రూ.80 సన్నవి: రూ.40

పండ్లు: రూ.25

పౌల్ట్రీ అసోసియేషన్‌ ధరలు

బ్రాయిలర్‌ (లైవ్‌) : 130

లేయర్‌ (లైవ్‌) : 110

బ్రాయిలర్‌ చికెన్‌ : 234

బ్రాయిలర్‌ స్కిన్‌లెస్‌ : 260

లేయర్‌ చికెన్‌ : 187

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత 1
1/3

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత 2
2/3

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత 3
3/3

52 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement