
సమస్యలు పరిష్కరించాలంటూ..
నెల్లూరు రూరల్: సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జనం అధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగా భవాని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 345 అర్జీలు అందాయి. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 133, పోలీస్ శాఖవి 16, మున్సిపల్ శాఖవి 35, సర్వేవి 44, పంచాయతీరాజ్ శాఖవి 40 తదితరులున్నాయి.
మామిడి చెట్లను నరికేశారు
కొందరు అక్రమంగా మామిడి చెట్లను నరికివేసి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాపూరు మండలానికి చెందిన వృద్ధురాలు మాతంగి పెంచలమ్మ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు.
ప్రైవేట్ కళాశాలలపై
చర్యలకు డిమాండ్
సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఏఐఎస్‌ఎఫ్ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ఇప్పుడే మొదటి సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నేతలు పవన్ కిశోర్, మస్తాన్ షరీఫ్, మౌళి, సిద్ధూ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి
పొలంలో బోరు వేసేందుకు ఉపాఽధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ గుండోలు శీనయ్య అడ్డుకుంటున్నాడని ఆత్మకూరు మండలం మహిమలూరు తూర్పు దళితవాడకు చెందిన బోయల చెన్నయ్య తెలిపారు. గత సంవత్సరం బోరు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారంటూ బోరు వేయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, న్యాయం చేయాలని కోరారు.
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
345 వినతుల అందజేత

సమస్యలు పరిష్కరించాలంటూ..

సమస్యలు పరిష్కరించాలంటూ..