
కండలేరులో పడి పాడి రైతు మృతి
మనుబోలు: కాలు జారి కండలేరు వాగులో పడి పాడి రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యాచవరంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రాపూరు వీరాస్వామి (65) పశువులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మేతకెళ్లిన పశువులు శుక్రవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కండలేరు వాగులో పడి మృతి చెందారు. గేదెల కోసమని వెళ్లిన వీరాస్వామి ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల బంధువులు వెతకగా, కండలేరులో శవమై కనిపించారు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.