
అశ్విన్ బాబు లీడ్ రోల్ నటిస్తోన్న తాజా చిత్రం 'వచ్చినవాడు గౌతమ్'. ఈ చిత్రంలో రియా సుమన్, అయేషాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీకి మామిడాల ఎం ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.












