
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి అంటే ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. రోగులను తమ మంచి మాటలతో ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తున్నాను. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలి. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ విధానంలోనే పోస్టులు భర్తీ చేయాలి.
– వరలక్ష్మి, హెడ్‌నర్సు, జీజీహెచ్,
నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు