బావతో సహజీవనం చేస్తోందంటూ.. | Woman Living Relationship Bava In SPSR Nellore | Sakshi
Sakshi News home page

బావతో సహజీవనం చేస్తోందంటూ..

May 10 2025 11:09 AM | Updated on May 10 2025 11:11 AM

Woman Living Relationship Bava In SPSR Nellore

మహిళపై కొడవలితో దాడి చేసిన బావమరిది

తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స

నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ కేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. 

అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement