
70 డ్రమ్ముల కోళ్ల వ్యర్థాల పట్టివేత
సంగం: మండల కేంద్రమైన సంగంలోని కావలి కాలువ సమీపంలోని ధాబా వద్ద చికెన్ వ్యర్థాల వాహనాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి నిత్యం ఐదు నుంచి పది వాహనాల్లో సంగం మండలంలోని పడమటిపాళెం, వంగల్లు, కోలగట్ల, వెంగారెడ్డిపాళెం, సిద్దీపురం, జెండాదిబ్బ, దువ్వూరు తదితర ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. వేల ఎకరాల్లో సాగవుతున్న చేపలకు వాటిని వేస్తున్నారు. గురువారం రెండు లారీలను పట్టుకోగా శుక్రవారం సాయంత్రం మరో పెద్ద వాహనంలో 70 డ్రమ్ముల్లో ఉన్న వ్యర్థాలను పట్టుకున్నారు. వాటిని సంగం కొండమలుపులో భారీ గుంత తీసి పూడ్చివేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. లారీ యజమాని, డ్రైవర్, కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.