
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): రైలు దిగి నడుచుకొని వెళ్తున్న వ్యక్తిని చంపుతామని కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లిన ఘటనలో నిందితులను సంతపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్‌స్పెక్టర్ దశరథరామారావు వెల్లడించారు. సంగం మండలం మర్రిపాడుకు చెందిన వీరరాఘవయ్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తెల వద్దకు ఇటీవల వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న తెల్లవారుజామున రైల్లో నెల్లూరు చేరుకున్నారు. ఆత్మకూరు బస్టాండ్‌లో బస్సెక్కేందుకు గానూ నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను సింహపురి హోటల్ సమీపంలో గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు రెండు బైకుల్లో వచ్చి అడ్డుకున్నారు. చంపుతామని కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ వెయ్యి నగదును దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా ఓల్డ్ చెక్‌పోస్ట్‌కు చెందిన నవాజ్, నెల్లూరు రూరల్ మండలం నవలాకులతోటకు చెందిన షాహుల్, జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన అబ్దుల్ అజీస్ అలియాస్ అబ్దుల్ అజీజ్, నవాబుపేటలోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన భాస్కర్, మరో ఇద్దరు బాలలను నిందితులుగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో నిందితులను సింహపురి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో అరెస్ట్ చేశారు.