పశువుల అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

పశువుల అక్రమ రవాణా

May 11 2025 12:07 AM | Updated on May 11 2025 12:07 AM

పశువు

పశువుల అక్రమ రవాణా

సంతలో పశువులు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గాల్లో కొంతకాలం ఇటువంటి పశువుల సంతలు నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి వారిని తరిమేయడంతో ఇపుడు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్దకు చేరారు. ఇక్కడ ప్రతి శుక్రవారం సంతను నిర్వహిస్తున్నారు. ఇక్కడ పశువుల అమ్మకందారులు, కొనుగోలుదారుల నుంచి కమీషన్ల రూపంలో పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురయ్యే పశువులను వదిలించుకునేందుకు పాడిరైతులు సంతలో అమ్ముకునేందుకు వస్తుంటారు. వాటిని కొనుగోలు చేసిన వారు ఇక్కడి నుంచి చైన్నె, కేరళ రాష్ట్రాలలో కబేళాలకు తరలిస్తున్నారు. అక్కడ పశు మాంసానికి డిమాండ్‌ ఉండడంతో ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున ఆవులు, గేదెలు, దూడలను లారీల్లో తరలిస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అధికారులతో పాటు, రాజకీయ నాయకులు, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకుని నిరాటంకంగా తమ పని పూర్తి చేసుకుంటున్నారు.

అనుమతులు లేకుండానే..

గొలగమూడి క్రాస్‌ రోడ్డు వద్ద సంతను నిర్వహిస్తున్న నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు పొందలేదు. గతంలో కోవూరు నియోజకవర్గం పడుగుపాడు, రేగడిచెలిక గ్రామాల వద్ద సంతను నిర్వహించేవారు. సంతను అక్రమంగా నిర్వహిస్తున్న తీరుపై సాక్షిలో కథనాలు రావడంతో నియోజకవర్గ ముఖ్యనేత సంత నిర్వాహకులను తరిమేశారు. దీంతో నిర్వాహకులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యనేతను ప్రసన్నం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫలితంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతి శుక్రవారం సంతను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మూగజీవాలను కొనుగోలు చేసేవారు వాటిని కోతకు తరలిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా పశువుల సంత ఏర్పాటు చేయాలంటే సంబంధిత పంచాయతీ తీర్మానం చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివేమీ లేకుండానే సంత నిర్వాహకులు ఇష్టానుసారం తమపని కానిస్తున్నారు. సంత నిర్వహణతో వచ్చే లాభంలో కొంత మొత్తం అధికారులు, రాజకీయ నాయకులకు మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

హిందుత్వ వాదులు ఎక్కడ..?

జాతీయ రహదారులపై పశువుల లోడుతో (అవి కనిపించకుండా టార్పాలిన్‌లు కప్పుతారు) వాహనాలు తమిళనాడు, కేరళకు వెళుతూనే ఉన్నాయి. వాటిని కోతకు తరలిస్తున్నారు. ఇందులో గోమాతగా కొలిచే ఆవులు కూడా ఉంటున్నాయి. అయినా హిందుత్వవాదులు అటుకేసి చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎటువంటి అనుమతులు లేకుండానే..

గొలగమూడి వద్ద పశువుల సంత

అది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పశువుల సంత. రైతులు తమ పశువులను ఇక్కడ అమ్మకానికి తీసుకురాగా వాటిని కొనుగోలు చేసిన వారు నిర్ధాక్షిణ్యంగా వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. సంత నిర్వహణలో టీడీపీ నేతలకు భాగస్వామ్యం ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

నిర్వాహకులకు టీడీపీ నేతల అండ

క్రయవిక్రయదార్ల నుంచి

భారీగా కమీషన్లు

కొనుగోలు చేసిన మూగజీవాలు చైన్నె, కేరళలోని కబేళాలకు తరలింపు

సంతలో కొనుగోలు చేసే పశువులను కబేళాలకు తరలించాలంటే పసుసంవర్ధకశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఒట్టిపోయిన పశువులనే కబేళాలకు తరలించాలి. కానీ సాధారణ పశువులను, అనారోగ్యానికి గురైన వాటిని కూడా సంతలో విక్రయిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారు చైన్నె, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా సజావుగా వాటిని తరలించడం చూస్తే నిర్వాహకుల పలుకుబడి అర్థం అవుతుంది. హైవేపై పశువుల లారీలు వెళుతున్నా పట్టించుకునే వారు లేరు.

పశువుల అక్రమ రవాణా 
1
1/2

పశువుల అక్రమ రవాణా

పశువుల అక్రమ రవాణా 
2
2/2

పశువుల అక్రమ రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement