
భూములు తిరిగివ్వండి
● లేదా ఉపాధి కల్పించండి
నెల్లూరు రూరల్: ‘1979లో మాకు కొంత అటవీ భూమి కేటాయించారు. మేము సాగు చేసుకుంటుంటే 2017లో పరిశ్రమల కోసం సేకరించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. భూములు తిరిగివ్వండి. లేదా ఉపాధి కల్పించండి’ అని నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామానికి చెందిన ఎస్సీ రైతు కూలీలు కోరారు. మంగళవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాట్లాడుతూ 2017లో అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్వోలు కలిసి పరిశ్రమలు కట్టి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పారన్నారు. కొంత నష్ట పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, ఉపాధి కూడా కల్పించలేదన్నారు. తమ మా జీవనాధారం ఎలాగని ప్రశ్నించారు. గ్రీవెన్స్‌లో ఎన్నోసార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదన్నారు. న్యాయం చేసి ఉపాఽధి కల్పించాలని, లేనిపక్షంలో భూమి తిరిగివ్వాలని కోరారు.