
రోగులను కాపాడడంలోనే సంతృప్తి
రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మాట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్నిస్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. నర్సింగ్ వృత్తిలోకి వచ్చేవారందరూ తమకు మదర్ ఆఫ్ నర్సింగ్ అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.
– సత్యవతి, సీనియర్ హెడ్ నర్సు,
నర్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు