కార్మికులకు శిక్షణ
నెల్లూరు(బృందావనం): అమ్మోనియా గ్యాస్ లీకైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలోని బుంగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీహెచ్ శైలేంద్ర కుమార్ నెల్లూరలో మాట్లాడుతూ బీఎంఆర్, వాటర్‌బేస్, సాయి మైరెన్, బుంగే, ఇమామీ, జెమినీ, సౌత్ ఇండియా, త్రీఎఫ్, ఆంజనేయ, గ్రీన్‌హౌస్, అల్ఫా మైరెన్, శరత్ తదితర కర్మాగారాల నుంచి 42 మంది పాల్గొన్నారని, సేఫ్టీ ఆఫీసర్లు విన్సెంట్‌పాల్, మహేంద్ర, పి.శ్రీను శిక్షణ ఇచ్చారన్నారు.


