
ట్రూఅప్ చార్జీలు రద్దుచేయండి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై మోపిన అదనపు భారాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విరమించాలంటూ సీపీఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు 30 శాతం తగ్గిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారని విమర్శించారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పినా.. నేడు కొనసాగిస్తోందని అన్నారు. స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లకు అయిన రూ.96 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెంచల నరసయ్య, అబ్దుల్ అజీజ్, సతీష్, రఫీఅహ్మద్, సంపత్, సుధాకర్, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ మీటర్లౄ ఏర్పాటును విరమించాలి
విద్యుత్ భవన్ వద్ద సీపీఎం ధర్నా