
ఇంటర్ కళాశాలలకు పీడీ పోస్టుల భర్తీ లేనట్లేనా
కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కళాశాలలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. ఆ పోస్టులను అదే కళాశాల లేదా, పక్క మండలాల్లోనే కళాశాలల్లో సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్షన్ చేసి పోస్టులను అక్కడ భర్తీ చేస్తున్నారు. కందుకూరు టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న పీడీ గత నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. ఆ పోస్టును తాళ్లూరులో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్ట్ చేశారు. దీంతో టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీ పోస్టుకు మంగళం పలికారు. విశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పటికీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి పోస్టులను తగ్గించుకునేందుకు కూట మి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 15, ప్రకాశం జిల్లాలో 18 పీడీ పోస్టులు సబ్జెక్ట్ అధ్యాపకులుగా కన్వర్ట్ చేశారు. తిరిగి ఆయా కళాశాలలకు పీడీ పోస్టులు మంజూరు చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. ఉన్న పోస్టుల ను పక్కదారి మళ్లించి జీతాల ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది.దీంతో జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులు వ్యాయామ విద్యకు మంగళం పలకనున్నారు.
మధ్యలో ఇంటర్‌ల్లోనే..
ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డిగ్రీ కళాశాలల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. కానీ మధ్యలో ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులు లేనందు వల్ల విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడా మైదానాలు ఉన్న జూనియర్ కళాశాలల్లోనే పీడీ పోస్టులు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షాగా మారనుంది.
పోస్టు
కన్వర్షన్
ఇలా..