Peddapalli
-
ఆపద్బాంధవులకు అద్భుత శిక్షణ
గోదావరిఖని: ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనుసరించాల్సిన విధానంపై స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలకు సింగరేణి శిక్షణ ఇస్తోంది. జల, వాయు, అగ్ని ప్రమాదాలతోపాటు.. బహుళ అంతస్తుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన సహాయక చర్యలపై సింగరేణి సంస్థ.. 36 రోజుల పాటు 1,200 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించింది. వంద మందికి ఒక బృందం చొప్పున, మూడురోజులపాటు పలు అంశాలపై శిక్షణతోపాటు ప్రాక్టికల్స్ కూడా నిర్వహిస్తోంది. ఇలా 36 రోజుల పాటు 12 బృందాలకు శిక్షణ ఇవ్వనుంది. నాలుగు నెలల క్రితమే రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వ్ పోలీసు విభాగం నుంచి ఆసక్తి ఉన్న 1,200 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని 12 క్యాంప్‌ల్లో ఉన్నవారికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్పందించాల్సిన తీరు, ఆపత్కాలంలో తాము సురక్షితంగా ఉండి, ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం లక్ష్యంగా శిక్షణ కొనసాగుతోంది. ముందుగా ఇతర రాష్ట్రాల్లో కొన్ని బృందాలకు శిక్షణ ఇస్తున్నారు. కోయంబత్తూర్, విజయవాడ, పుణె, వడోధర, ఒడిశా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ ద్వారా పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కొక్క బృందానికి రెండు నెలల పాటు శిక్షణ కొనసాగుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో పలు అంశాలపై స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికి శిక్షణ ప్రారంభమైంది. ముందుగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోట్లపై వెళ్లి.. నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత సింగరేణి రెస్క్యూ విభాగంతో శిక్షణ ఇస్తున్నారు. ఎస్ఎల్బీసీతో సింగరేణి రెస్క్యూపై నజర్ ఎస్ఎల్బీసీ ప్రమాదంతో.. సింగరేణి రెస్క్యూ ప్రాధాన్యం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచి్చంది. సుమారు 40 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసే పనుల్లో సహాయ బృందాలు అందించిన సేవలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ విభాగానికి.. విపత్తుల సమయంలో స్పందించాల్సిన తీరుపై కఠోర శిక్షణ ఇస్తున్నారు. మొదటి బ్యాచ్‌లో డిచ్పల్లిలోని 7వ బెటాలియన్‌కు చెందిన వంద మందికి శిక్షణ కొనసాగుతోంది. మూడు రోజుల ప్రత్యేక శిక్షణ ప్రకృతికి విరుద్ధంగా భూగర్భ గనుల్లోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే విధానం, అగ్ని ప్రమాదాలు, విషవాయువులు ఏర్పడినప్పుడు ఎలాంటి పరికరాలు వినియోగించి.. ఎలా అదుపులోకి తీసుకురావాలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్ర త్యక్షంగా చూపించారు. భవనం కూలిపోయినప్పుడు, అ గ్ని ప్రమాదాలకు గురైనప్పుడు సహాయక సిబ్బంది సురక్షితంగా ఉంటూ.. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సు రక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నారు. బుధవారంతో మొదటిబ్యాచ్ శిక్షణ పూర్తయింది. సింగరేణి అందించిన శిక్షణ భవిష్యత్‌లో చాలా ఉపయోగపడుతుందని విపత్తుల విభాగం సిబ్బంది పేర్కొన్నారు.సంతోషంగా ఉంది అంతర్జాతీయ స్థాయి సామగ్రి సింగరేణి వద్ద ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. – కె.రవీందర్, ఆర్ఎస్ఐ, డిచ్పల్లి 7వ బెటాలియన్ఎలా రక్షించాలో తెలుసుకున్నాం.. క్లిష్ట సమయాల్లో ప్రకృతి వైపరీత్యాల సహాయక బృందం ఎలా వ్యవహరించాలనే విషయాలను తెలుసుకున్నాం. సకాలంలో స్పందించడంతో పాటు సురక్షితంగా ఉండి ఆపదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా అందించిన శిక్షణ భవిష్యత్‌లో ఉపయోగ పడుతుంది. – బదావత్ రంజిత్‌కుమార్,హెడ్కానిస్టేబుల్కళ్లకు కట్టినట్టు..ఎత్తయిన భవనా ల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే తీరుపై కూలంకషంగా వివరించారు. ప్రమాదాల్లో చిక్కువారిని రక్షించడంతో పాటు.. మనం కూడా సురక్షితంగా బయటకు వచ్చే విధానం, మంటలను అదుపులోకి తెచ్చే తీరుతో పాటు పలు అంశాలపై కళ్లకు కట్టినట్లు వివరించారు. – కె.రవి, ఏఎస్ఐ, ఎస్డీఆర్ఎఫ్ అంతర్జాతీయ ప్రమాణాలతో.. ప్రకృతి వైపరీత్యాలతో పాటు భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన తీరుపై అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కేంద్రంగా నిలుపుతాం. ఇప్పటికే కోలిండియాలోని అనేక సంస్థలకు సహాయ చర్యలపై శిక్షణ ఇచ్చాం. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చి.. సింగరేణి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతాం. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి 4 నెలల క్రితమే చేరా.. నాలుగు నెలల క్రితం ఎస్డీఆర్ఎఫ్లో చేరాను. ముందుగా హుస్సేన్‌సాగర్‌లో నీటిలో పడిపోయిన వారిని రక్షించే అంశంపై శిక్షణ ఇచ్చారు. సింగరేణి రెస్క్యూ ద్వారా అందించిన శిక్షణ చాలా బాగుంది. – బీర్ల ఆనంద్, కానిస్టేబుల్, ఎస్డీఆర్ఎఫ్ -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో ‘రామగుండం’ ప్రతిభ
గోదావరిఖని/రామగుండం: క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో రామగుండం పోలీస్‌కమిషనరేట్ రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ప్రజలు, బాధితులు, ఫిర్యాదు దారులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్స్టేషన్లలోని సి బ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు? పోలీస్స్టేషన్లలో సరైన ఆదరణ, సేవలు లభిస్తున్నాయా? ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నా రు? తదితర విషయాలు తెలుసుకోవడం కోసం క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. క్యూఆర్‌కోడ్ అండ్ సీఎఫ్సీద్వారా పోలీసు సేవలపై ప్రజల నుంచి వచ్చిన మొత్తం అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనిట్లను ఎంపిక చేశారు. దీనిలో రామగుండం పోలీస్‌కమిషనరేట్ మూడోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కమిషనరేట్ తరఫున మంచిర్యాల డీసీపీ భాస్కర్, అంతర్గాం ఠాణా ఎస్సై బోయ వెంకటస్వామి బుధవారం డీజీపీ జితేందర్ నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసులను అభినందించారు. పోలీసుల పనితీరుపై క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఎప్పటికప్పుడు అందజేయాలని సీపీ కోరారు. -
‘కరోనా’ వైరస్ కట్టడి ఎలా?
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్ పెద్దపల్లిరూరల్: కరోనా వైరస్ మళ్లీ పొరుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తోందనే సమాచారంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ను కట్టడి చేసేలా పాటించాల్సిన పద్ధతులు తెలుసుకునేందుకు వీలుగా ‘సాక్షి’ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారితో గురువారం ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. సంప్రదించాల్సిన ఫోన్‌నంబరు : 99635 85515 తేదీ: 22–05–2025 (గురువారం) సమయం : ఉదయం 10.00 గంటల నుంచి ఉదయం : 11గంటల వరకు -
టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్‌దే
● ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్/పెద్దపల్లిరూరల్(పెద్దపల్లి): టెక్నాలజీ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకే దక్కిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు బి.సురేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమంలో నాయకులు బొంకూరి అవినాష్, ఈర్ల స్వరూప, మల్లయ్య, సంపత్, శ్రీకాంత్, అమ్రేశ్, సుభాష్‌రావు, అక్బర్అలీ, మస్రత్, శ్రీనివాస్, శ్యాంసుందర్, దేవరాజ్ పాల్గొన్నారు. ప్రజల సౌకర్యం కోసమే మార్కెట్ పెద్దపల్లిరూరల్/జూలపల్లి: పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను రూ.4కోట్ల 20లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జెండా కూడలిలోని కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అదేవిధంగా జూలపల్లి హుస్సేన్‌మియావాగుపై చేపట్టిన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. -
మురుగునీటి కాలువలు శుభ్రం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ 19వ డివిజన్ న్యూమారేడుపాకలో డ్రెయి నేజీల్లోని పూడికను బుధవా రం బల్దియా సిబ్బంది తొలగించారు. సైడ్ డ్రెయినేజీలు లేక, బురద, వర్షపు, మురుగునీరు నిలిచి దు ర్వాసన వస్తోందనే స్థానికుల ఆవేదనపై ‘కంపుకొడుతున్న కాలువలు’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో బల్దియా అధికారులు స్పందించారు. సూపర్వైజర్ సార య్య ఆధ్వర్యంలో సిబ్బంది కాలువలు శుభ్రం చేశారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాట్నపల్లి గ్రామంలో సర్వే సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): జాతీయ గు ణాంక కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) ఆధ్వ ర్యంలోని కరీంనగర్ సర్వే బృందం కాట్నపల్లిలో బుధవారం సర్వే చేసింది. ఆరోగ్యం, అక్షరాస్యత, సాంఘిక, ఆర్థిక అంశాలపై సభ్యులు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించారు. గ్రా మాలు, పట్టణాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య సా మజిక, ఆర్థిక పరిస్థితులను తెలుకోవడమే సర్వే ముఖ్య ఉద్దేశమని సభ్యులు తెలిపారు. బృందంలోని సభ్యులు బ్రిజేందరసింగ్, శ్రీని వాసరావు, సుధాకర్, శ్రీనాథ్ పాల్గొన్నారు. బడుల బలోపేతానికి కృషి జ్యోతినగర్(రామగుండం): ప్రభుత్వ పాఠశాల ల బలోపేతానికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి మాధవి సూచించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో జిల్లాలోని 14 మండలాల ఉన్న త పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేకాధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపా ల్స్తో ‘పాఠశాలల నిర్వహణ, నాయకత్వ లక్ష ణాలు’ అంశంపై చేపట్టిన శిక్షణకు బుధవారం ఆమె హాజరై మాట్లాడారు. పాఠశాలల నిర్వహణ, నైపుణ్యాలను అలవార్చుకోవాలని సూ చించారు. విద్యార్థులు సబ్జెక్టుల్లో అభ్యాసన ఫ లితాలు సాధించేలా, విద్యావ్యవస్థలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా బోధన జరిగేలా ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. కోర్సు డైరెక్టర్ జి.జయరాజు, రిసోర్స్ పర్సన్లు ఆగయ్య, రాగమయి, భవాని, పురుషోత్తం, టెక్నికల్ పర్సన్ దినేశ్, సీఆర్పీ వెంకటేశ్, రామ్‌కుమార్, హెచ్ఎంలు పాల్గొన్నారు. బొడ్రాయి వార్షికోత్సవం కమాన్‌పూర్: భూదేవి, శ్రీదేవి సహిత బోడ్రా యి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యక పూజలు చేశారు. 23న తిరంగా యాత్ర సుల్తానాబాద్(పెద్దపల్లి): బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 23న జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి కడారి అశోక్‌రావు తెలిపారు. హిందువులనే టార్గెట్‌గా చేసి ఉగ్రవాదులు కిరాతక చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. వసతులు మెరుగుపర్చాలి పెద్దపల్లిరూర ల్: ప్రభుత్వ పా ఠశాలల్లో వసతులు మె రుగు పర్చే లా చర్యలు తీసుకోవాలని జార్జిరెడ్డి పీడీఎస్‌యూ జిల్లా అ ధ్యక్షుడు నరేశ్ కోరారు. బుధవారం డీఈవో ఆ ఫీసులో వినతిపత్రం అందజేశారు. శివ, రాకేశ్, సాయికుమార్, విష్ణు, సంజయ్ పాల్గొన్నారు. -
ఉపాధిహామీని సద్వినియోగం చేసుకోండి
● అర్హులకే రాజీవ్ యువవికాసం యూనిట్లు ● కాలువలో పూడికతీత పనులు చేపట్టాలి ● అధికారులకు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఉపాధిహామీ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో బుధ వారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. జాబ్‌కార్డులు పొందిన కూలీలకు పనులు కల్పించాలన్నారు. జిల్లాలో ని సాగునీటి కాలువలు, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని అన్నారు. చెత్త, పిచ్చిమొక్కలను తొలగించాలని పేర్కొన్నారు. రాజీవ్ యువవికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్లను జూన్ 2 నాటికి అందిస్తామని ఆయన తెలిపారు. అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో తుదిజాబితా సిద్ధం చేయాలని అన్నారు. డీఆర్డీవో కాళిందిని, సీఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యులకు కలెక్టర్ అభినందన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తున్న వైద్యబృందంతోపాటు సూపరింటెండెంట్ శ్రీధర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. గర్భసంచిలోని గడ్డను శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ఇటీవల తొలగించారు. ఇలా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కష్టతరమైన వైద్యసేవలను అందించడంతోపాటు శస్త్రచికిత్సలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
మావోళ్లు ఎలా ఉన్నరో?
● దండకారణ్యంలో జిల్లావాసులే కీలకం ● పెరిగిన నిర్బంధం.. జోరందుకున్న ‘కగార్’ ఆపరేషన్ ● వరుస ఎన్కౌంటర్లతో నక్సల్స్ ఉక్కిరిబిక్కిరి ● తమవారి క్షేమ సమాచారంపై కుటుంబసభ్యుల్లో ఆందోళనసాక్షి, పెద్దపల్లి: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వారికి కంచుకోట అయి న ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో నెత్తురోడుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఎదురుకాల్పుల్లో సుమారు 300మందికి పైగా మా వోయిస్టులు మృతిచెందారు. ప్రభుత్వ దూకుడు, పె రుగుతున్న నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లతో ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని అజ్ఞాత మావోయి స్టు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తాజా గా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతిచెందడంతో జిల్లా నేతల క్షేమసమాచారంపై బంధువుల్లో ఆందోళన నెలకొంది. భయపెడుతున్న ఘటనలు మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో దూ సుకుపోతున్న భద్రతాదళాలకు మనజిల్లాకు చెంది న నేతలు కొరకరాని కొయ్యలా మారారు. కేంద్ర కమిటీతోపాటు వివిధ కీలక స్థానాల్లో మన జిల్లావా సులు దండాకారణ్యంలో కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా జనతన స ర్కార్ను స్థాపించారు. అయితే, మావోయిస్టుల విస్తరణకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో 2009తో ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా ముమ్మరంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ సాగిస్తోంది. తాజాగా ప్రభు త్వం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, సీ–60, ఎస్‌వోజీ, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పేరుతో అడవులను జల్లెడ పడుతున్నా యి. దీంతో ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతిచెందా రు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగినా త్రుటిలో తప్పించుకుంటున్నారు. ఇటీవల జూలపల్లికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న మృతిచెందారని ప్రచారం జరిగినా ఇంకా నిర్ధారణ కాలేదు. జిల్లావాసులే కీలకం పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి, జాలపల్లి మండలం వడ్కా పూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు ఉరఫ్ చంద్రన్న, పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాలరావు ఉరఫ్ భూపతి, జూలపల్లి మండలం వెంకట్రాపుపల్లికి చెందిన దీకొండ శంకర్, పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన గంకిడి సత్యనారాయణరెడ్డి ఉరఫ్ విజయ్, పాలితం గ్రానికి చెందిన అలేటి రామలచ్చులు, రామగుండం మండలానికి చెందిన అప్పాసి నారాయణ ఉరఫ్ రమేశ్, గోపయ్యపల్లికి చెందిన దళ కమాండర్ దాతు ఐలయ్య, సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్రావు, మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి ఉరఫ్ మీసాల రాజన్న తదితరులు ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంటోంది. -
పెద్దపల్లి
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 20257‘కొత్తపల్లికి చెందిన ఓ విద్యార్థికి ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదువలేక ఫెయిలయ్యాడు.’ ‘లింగన్నపేటకు చెందిన మరో విద్యార్థికి సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీర్‌గా చూడాలనుకున్నారు. బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను పాస్‌మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ చదువుతున్నాడు.నా కొడుకును ఇంజినీర్‌గా చూడాలి.. డాక్టర్‌ను చేయాలి.. సీఏ చదివించి బాగా సంపాదించాలి... ఇలా తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారే తప్ప.. పిల్లల ఇష్టాలు.. అభీష్టాలు ఏంటి.. అని ఆలోచించే వారు కరువయ్యారు. సాఫ్ట్‌వేర్‌గా.. డాక్టర్‌గా బోలెడంతా డబ్బు సంపాదించాలనే ధ్యాసతోనే పదోతరగతి పాసైన తమ పిల్లలను ఎంపీసీ, బైపీసీలో చేర్పిస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. అసలు వారికి ఏ సబ్జెక్టుపై మక్కువ ఉందో తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి.. సబ్జెక్టులు అర్థంకాక.. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు వెలువడడంతో ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలకు ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏ గ్రూప్‌లో చేరాలో నిర్ణయం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఇస్తేనే వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన సబ్జెక్టులను బలవంతంగా రుద్దడం కాకుండా.. వారికి ఇష్టమున్న సబ్జెక్టులను చదివేలా చూడాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. – వివరాలు 8లోuన్యూస్‌రీల్ -
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు. ఇద్దరికీ 64 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది. ఒకే ఊరిలో ఉంటున్నా చిన్నచిన్న అభిప్రాయ భేదాలతో దశాబ్ద కాలంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. వృద్ధాప్యానికి చేరువైనా రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు మాట్లాడుకోక పోవడం నాగయ్య కుమారుడు శ్రీనివాస్‌ను కలచివేసింది.ఎలాగైనా ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. ఇదిలా ఉండగా నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ నెల 18న మూడో రోజు కార్యక్రమం (పిట్టకు పెట్టుడు) నిర్వహించగా, అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఈక్రమంలో ఇద్దరినీ కలపాలని శ్రీనివాస్ భావించాడు. సోదరులు మామిండ్ల అంజయ్య, శ్రీనివాస్, రాజు, తిరుపతి, ఇతర బంధువులకు చెప్పడంతో వారు సహకారం అందించారు. నాగయ్య, రామయ్యకు బంధాల ప్రాధాన్యత వివరించారు. దీంతో ఇద్దరూ చెమర్చిన కళ్లతో ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ ఘటన కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.సావుదలకు పట్టింపులెందుకు..మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. కాటికి కాలుజాపిన మాకు పట్టింపులు ఎందుకు. గతంలో చిన్నచిన్న కారణాలతో దూరమయ్యాం. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం.– మామిండ్ల నాగయ్యపొరపాట్లను వదిలిపెట్టాంమేము ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు ఇదివరకే చనిపోయారు. మేమిద్దరం ఉన్నాం. ఉన్న ఇద్దరం కలిసుంటే బాగుంటుందని అనిపించింది. పదేళ్లుగా దూరంగా ఉంటున్న మేము చనిపోయేవరకు కలిసే ఉంటాం.– మామిండ్ల రామయ్య -
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
రామగుండం(కరీంనగర్): స్థానిక తబితా ఆశ్రమంలో ఉంటున్న నక్క మానస ఆశ్రమం నుంచి అత్తారింటికి వెళ్లే సమయం సమీపిస్తోంది. పెళ్లి కూతురు ముఖంలో ఓ వైపు చిరునవ్వు, మరోవైపు ఆశ్రమ సంరక్షకులను, తోబుట్టువును విడిచి వెళ్తున్నాననే బాధ.. పెద్దపల్లి కలెక్టరేట్లోని దేవాలయంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ వేడుక జరిపిస్తున్నారు. కాగా, 2021 మార్చి 15వ తేదీన ఆశ్రమంలో ఆశ్రయం పొందిన గుంజ విజయలక్ష్మి అనే యువతికి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారితో వీరేందర్‌నాయక్ వివాహం జరిపించగా, నక్క మానస వివాహం రెండోది. 16ఏళ్ల క్రితమే ఆశ్రమంలో చేరిన అక్కాచెల్లెలు.. సుమారు 16ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు నక్క మానస, నక్క లక్ష్మి సంరక్షణ కోసం ఇంటగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సరీ్వస్(ఐసీపీఎస్) అధికారులు స్పందించి రామగుండంలోని తబితా ఆశ్రమంలో చేరి్పంచారు. ఆనాటి నుంచి ఆశ్రమ నిర్వాహకుడు వీరేందర్‌నాయక్–విమల దంపతులు వారికి తల్లిదండ్రులుగా మారారు. నక్క మానస డిగ్రీ పూర్తి చేయగా, నక్క లక్ష్మి ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర.. ఆశ్రమంలో చేరిన సమయం నుంచి చదువులో, ఇంటిపనిలో చురుగా ఉంటోంది. ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం తదితర గుణగణాలు కలిగిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మానస. ఐదో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసించగా ఆరు నుంచి పదో తరగతి వరకు మేడారం గురుకుల విద్యాలయంలో చదివి టెన్త్9.8 జీపీఏ, ఎల్లంపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదివి ఎంపీసీ గ్రూపులో 895 మార్కులు, కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఎంత చెప్పినా తక్కువే చిన్నప్పటి నుంచి అమ్మానాన్న విమల, వీరేందర్‌నాయక్ అని తెలుసు. కానీ ఓ ఆశ్రమంలో సంరక్షకులుగా మాత్రం నాకు తెలియదు. చిన్నప్పటికీ నా బాధ్యతలు, కష్ట సుఖాలు అన్నీ వారితోనే పంచుకునే దాన్ని. ఇప్పుడు నాకు ఓ వ్యాపారితో వివాహం చేస్తుండడంతో నేను ఇల్లాలిగా మారుతున్నా. అప్పుడు నా చెల్లి నక్క లక్ష్మి, నాతోటి మిత్రులు, నా అమ్మనాన్నలు (సంరక్షకులు)విడిచి వెళ్లలేక పోతున్నా. నా వివాహం కలెక్టర్ జరిపిస్తుండడం మరీ విశేషం. – నక్క మానస, పెళ్లి కూతురు ఆనందమో.. బాధో తెలియడం లేదు పెళ్లీడుకొచ్చిన యువతికి వివాహం జరిపించడం నా కర్తవ్యం. అందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ఊహకందని విషయం. బాల్యం నుంచే మమ్మల్నే తల్లిదండ్రులుగా భావిస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసి కన్యాదానం చేయడం ద్వారా గుండెలు బరువెక్కుతున్నాయి. పెళ్లి కూతురు చెల్లి లక్ష్మి మరింత ఆవేదనకు లోనవుతుంది. ఆశ్రమంలో పెద్ద మనిగా వ్యవహరిస్తూ అన్ని విషయాల్లో ఎంతో చురుకుగా వ్యవహరించే కూతురు నక్క మానస. భవిష్యత్తులో ఆమె కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – వీరేందర్‌నాయక్, తబితా ఆశ్రమ నిర్వాహకుడుఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు -
రెక్కలు?
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లా ల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపించింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దా న్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువు శాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. కమిటీలు ఇలా.. భూముల ధరల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్‌బాడీస్) చైర్మన్‌గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్‌చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్‌గా సబ్‌రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్‌గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్ రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్‌గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తాయి. ఈనెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు తమ పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.న్యూస్రీల్ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వ ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదిక పంపేందుకు మే నెలాఖరు వరకు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
క్రికెట్ జిల్లా జట్టుకు ఎంపిక
గోదావరిఖనిటౌన్: అండర్–25 క్రికెట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా ఇన్చార్జి డి.కిరణ్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం(కేడీసీఏ) ఆధ్వర్యంలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులతో ఈనెల 17న స్థానిక జీఎంకాలనీ గ్రౌండ్లో అండర్ –25 క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లాకు ఒక జట్టుగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. కోచ్ ఎం. సుదేశ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులు జి.సత్యతేజ, ఎండీ జునైద్, డి.శరత్చంద్ర, ఆర్.నిఖిలేంద్ర, అఫ్ఫాన్, జి.సాయివినయ్, ఎండీ ఫైజాన్, ఆర్.నితిన్, ఖాజా ముఖారుద్దీన్, జి.మనిరత్నమ్, లోధ్ నిఖిల్, రాహుల్, వేణు, శివ గణేశ్, శరణ్‌ను జిల్లా జట్టుకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. కరాటే విద్యార్థులకు అభినందన పెద్దపల్లిరూరల్: జిల్లాలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. కరాటే పో టీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్లో మంగళవారం అభినందించా రు. అండర్ –14 కట్ఆఫ్ కుమితి విభాగంలో పలువురు కరాటే విద్యార్థులు 2 బంగారు పతకాలు, 3 వెండి, 3 కాంస్య పతకాలు సాధించారు. విద్యార్థు లు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని కలె క్టర్ ఆకాక్షించారు. మాస్టర్ వెంకటేశ్, ప్రిన్సిపాల్ మణిదీప్తి, ఇన్స్స్ట్రక్టర్ అలేఖ్య పాల్గొన్నారు. -
‘డిజిటల్’ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టరేట్లో మంగళవారం డీఈఈటీ పనితీరుపై పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. నిరుద్యోగుల కు వారథిగా పనిచేసేందుకే ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటిరకు 1,810 మంది యువత ఉపాధిఅవకాశాల కో సం తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పే ర్కొన్నారు. ఆసక్తిగల నిరుద్యోగులు తమ పేర్ల ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. దీనిద్వారా యువతకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వారి నైపుణ్యాల ఆధారంగా అర్హతగల ఉద్యోగాలను పొందవచ్చన్నారు. సమావేశంలో పరిశ్రమల జిల్లా అధికారి కీర్తికాంత్, డీఆర్డీవో కాళిందిని తదితరులు పాల్గొన్నారు.క్రీడలతో మానసికోల్లాసం జ్యోతినగర్(రామగుండం): క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఎన్టీపీసీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండువారాల పాటు నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. చదువుతో విజ్ఞానం, క్రీడలతో ఆరోగ్యం చేకూరుతాయన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో చిన్నారులు ప్రావీణ్యం సాధించా లని ఆయన సూచించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అలొక్ కుమార్ త్రిపాఠి, జీఎంలు ముఖుల్ రాయ్, కేసీ సింఘరాయ్, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారుల సంఘం అధ్యక్షుడు మహేంద్రకుమార్, ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య, ప్రధానకార్యదర్శి ఆరెపల్లి రాజేశ్వర్, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి గణేశ్వర్ జడ్డీ, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లకార్డులతో నిరసన రామగుండం: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్థానిక రైల్వే ఆర్వోహెచ్ షెడ్డు ప్రాంగణంలో రైల్వేకాంట్రాక్టు కార్మికులు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. సమ్మెహక్కు హరిస్తూ, పని గంటలు పెంచుతూ, కనీస వేతనాలు, చట్టాలు అమలు చేయకపోవడం శోచనీయమని కార్మికులు అన్నారు. సర్కారు విధానాలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నారు. కనీస వేతనం రూ.26వేలు, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.రామాచారి, నాయకులు భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, రైల్వే కాంట్రాక్టు కార్మికులు కలవేణి తిరుపతి, మురళి, రాజమౌళి, సతీశ్, శివనాయక్, రాజు, ఇఫ్తాకార్, లాలూనాయక్ తదితరులు ఉన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీని విస్తరిద్దాం పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు మండలాల వారీగా సభ్యుల సంఖ్య పెంచుదామని రెడ్‌క్రా స్ సొసైటీ జిల్లా కన్వీనర్ కావేటి రాజ్‌గోపాల్ అన్నారు. పెద్దపల్లిలో మంగళవారం జరిగిన జి ల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడా రు. రత్నాపూర్లో పేదకుటుం చేపట్టిన ఇంటి పనులకు సభ్యులు సాయం అందించాలని సూ చించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశు ధ్య అవసరాల కోసం ఫినాయిల్ మాప్స్, డస్ట్‌బిన్, చీపుర్లు, గ్లౌసెస్ను సూపరింటెండెంట్ శ్రీధర్‌కు అందించారు. ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్ ఉన్నారు. -
పేదల చుట్టం భూ భారతి
పెద్దల చట్టం ధరణి.. ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● ముప్పిరితోటలో భూ భారతి చట్టంపై సదస్సు సాక్షి, పెద్దపల్లి: పెద్దల చట్టం ధరణి అయితే.. పేదల చుట్టంగా భూ భారతి పోర్టల్‌ను తీసుకోచ్చామని, కోర్టులో లేనిప్రతీ భూసమస్యను పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట లో మంగళవారం భూ భారతి చట్టం – 2025పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోని పెద్దలు నాలుగు గోడల మధ్య ధరణి చట్టం తయారు చేశారన్నారు. తమ ప్రభుత్వం 18 రాష్ట్రాల్లోని 20 చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వేలమంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని భూ భారతి తయారు చేసిందన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ, వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థలను కుప్పకూల్చిందని, ప్రజాప్రభుత్వంలో గ్రామానికో రెవెన్యూ అధికా రిని జూన్ 2వ తేదీ నాటికి నియమిస్తామన్నారు. కర్ణాటక విధానాలను అనుసరిస్తూ మండల కేంద్రాల్లో 6వేల లైసెన్స్డ్ ప్రైవేటు సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణిలో సమస్య వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం ఆ అవసరం లేకుండా తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీఎల్ఏ స్థాయిలో న్యాయం జరగకపోతే ప్రజలు కొత్తగా ఏర్పడిన ట్రిబ్యునల్‌ను సంప్రదించ వచ్చని, రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. భారతదేశ సరిహద్దుల అంశంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అమెరికా నాయకత్వాన్ని ఎదిరించి పాకిస్థాన్‌ను యుద్ధంలో చిత్తుచేసి ప్రత్యేకంగా బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేశారని, నేడు అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి మోదీ రాజీపడటం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నాం ఎలిగేడు(పెద్దపల్లి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమ లు చేస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ముప్పిరితోటలో ఆయన మాట్లాడు తూ, కోతల్లేకుండా, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా అసత్యప్రచారం చేస్తూ ప్రజల ను తప్పుదోవపట్టిస్తున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాటికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిచారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ అంత ర్గాం కాందీశీకుల భూసమస్యలను పరిష్కరించా లని మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబుకు వి న్నవించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలిబిల్లు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, ఆర్డీవో గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్పర్సన్లు ప్రకాశ్‌రావు, గండు సంజీవ్, స్వరూప, సింగిల్‌విండో చైర్మన్లు వేణుగోపాల్‌రావు, విజయభాస్కర్‌రెడ్డి, తహసీల్దార్ బషీరొద్దీన్, ఎంపీడీవో భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఊరట
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాస్త ఊరట లభించింది. బిల్లులు విడుదలకాక ఇబ్బంది పడుతున్న వారికి అధికారులు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ప్రభుత్వం సూచించిన 600 చదరపు అడుగులకు మించి ఇల్లు నిర్మించబోమని అంగీకారపత్రం అందజేస్తే బిల్లు మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. తొలివిడతలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికోసం ప్రభుత్వం రూ.5లక్షల వరకు సాయం చేస్తామని ప్రకటించింది. ఈక్రమంలో 400 చ.అ. నుంచి 600 చ.అ. విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు అందరికీ తొలివిడతలో రూ.లక్ష చొప్పున వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో అధికారులు ఇటీవల జమచేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం ఆకృతిని తమకు నచ్చిన విధంగా మార్పు చేసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది. అయితే, విస్తీర్ణం మాత్రం పెంచకూడదనే నిబంధన విధించింది. లబ్ధిదారురుకు ఐదు విడతల్లో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు సాయం చేస్తుంది. ఇంటి విస్తీర్ణం పెంచితే ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా ప్రకటిస్తామని సర్కారు హెచ్చరించింది. జిల్లాలో మరో 38 మంది లబ్ధిదారులు జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అధికారులు.. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 138 ఇళ్లు పూర్తికాగా.. బేస్మెంట్స్థాయి వరకు నిర్మించిన మ రో 100 ఇళ్లకు రూ.లక్ష చొప్పున విడుదల చేశారు. మరో 38 మంది 600 చదరపు అడుగులు దాటి బే స్మెంట్ కట్టారు. వీరి కోసం బిల్లులు మంజూరు చే యాలంటూ గతనెల 24న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. హౌసింగ్ పీడీ రాజేశ్వర్ ద్వారా నివేదిక తెప్పించుకొని రాష్ట్రప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం వారికి రూ.38 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇకనుంచి లబ్ధిదారులు 400 చ.అ. నుంచి 600 చ.అ. విస్తీర్ణం లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. -
కూడళ్ల విస్తరణే పరిష్కారం
● కలెక్టర్ ఆదేశాలతో అధికారుల్లో కదలిక ● పనులు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులుజిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలి. ట్రాఫిక్, పోలీసు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి. – కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలుపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరుగుతోంది. ప్రధానంగా కలెక్టరేట్, రంగంపల్లి, చీకురాయిక్రాస్ రోడ్డు, కమాన్, కూనారం క్రాస్‌రోడ్డు, ప్రగతినగర్, బస్టాండ్ జంక్షన్ల వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కమాన్ వద్ద వాహనాల రాకపోకలకు చాలాఇబ్బందిగా మారడంతో వీలైనంత వరకు రోడ్డును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెట్లు, స్తంభాలను తొలగించి వాహనాల రాకపోకలు సులువుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాల బస్టాండ్ కూడలి.. బస్టాండ్ కూడలి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నా.. వాహనదారుల్లో అవగాహన లేక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బస్టాండ్ క్రాస్‌రోడ్డు వద్ద రహదారిని దాటేందుకు యత్నించిన పట్టణానికి చెందిన వ్యాపారి యాద రమణయ్య, కాంట్రాక్టర్ గంట నర్సయ్య తమ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఇంకొందరు త్రుటిలో ప్రమాదాల నుంచి సురక్షితంగా బయ టపడ్డ సంఘటనలు అనేకంగా ఉన్నాయి. కష్టాల కూడలి ‘కమాన్’ పట్టణంలోని ప్రధాన కూడలి కమాన్. దీనివద్ద అవసరమైనంత స్థలం లేదు. వాహనదారులు, పాదచారులు రోడ్డు దాటేందుకు నానాకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నా.. వాహనాలను కట్టడి చేసేందుకు నానాతంటాలు పడాల్సి వస్తోంది. తాత్కాలిక డివైడర్లను ఏర్పాటు చేసి ఇబ్బందులు దూరం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన యత్నాలు సత్పలితాలు ఇవ్వడంలేదు. కొద్దిరోజుల క్రితం ఓ లారీ వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతేకాకుండా కమాన్ నుంచి వచ్చే వారు, యూటర్న్ తీసుకునే వాహనదారులు, నేరుగా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనదారుల మధ్య సమన్వయం కుదరక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నియంత్రించేందుకు పోలీసులు వీలైనంత వరకు విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అఽధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచిచూడాల్సిందే. -
ఓటమిని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం
● రాచరిక పాలనకు అలవాటుపడిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● పోలీసులతో భయభ్రాంతులకు చేసింది నిజం కాదా? ● 15 నెలల కాంగ్రెస్ పాలనపై అక్కసు ఎందుకు? ● నిలదీసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మారం(ధర్మపురి): ఎమ్మెల్యేగా, మంత్రిగా సు మారు రెండు దశాబ్దాల పాటు రాచరిక, రాక్షస పా లన సాగించిన కొప్పుల ఈశ్వర్.. ఇప్పుడు ఓటమి ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా కొనసాగిన సమయంలో ఈశ్వర్ తనకు నచ్చని, ఎదురుతిరిగిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తనపై ఈశ్వర్ అనేక కేసులు పెట్టించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసి, కేసులు నమోదు చేయించిన ఘనత ఉన్న ఈశ్వర్ నీతులు మాట్లాడడం విడ్డూరమన్నారు. 2003 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగి ఏం అభివృద్ధి చేశావో బహిరంగ చర్చకు రావాలని లక్ష్మణ్‌కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రమంత్రిగా కొనసాగిన హరీశ్‌రావు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ధర్మపురి నియోజకవర్గంలో మంత్రిగా కొనసాగిన ఈశ్వర్ చేసిన అభివృద్ధి పనుల్లో తేడాను చూసేందుకు ముందుకు వస్తే ఇరుపార్టీల వారిని తీసుకెళ్తానని, ఇందుకు కోసం తానే స్వయంగా బస్సులు సమకూర్చుతానని అన్నారు. నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీటిని సిద్దిపేట, గజ్వేల్ తరలిస్తుంటే కనీసం ప్రశ్నించలేని ఈశ్వర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అప్పటి మంత్రులుగా హరీశ్‌రావు, కేటీఆర్ వారి ప్రాంతాల అభివృద్ధికి పాటుపడితే ఈశ్వర్ అభివృద్ధిని విస్మరించి జల్సాల కోసం సమయాన్ని కేటాయించారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన రూ.వేల కోట్ల డీఎంఎఫ్టీ నిధులు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు కేటాయిస్తే ఏ ప్రయోజనం కోసం మౌనంగా ఉన్నారని ఈశ్వర్‌ను నిలదీ శారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, అసోద అజయ్, సోగాల తిరుపతి, కొడారి అంజన్న, కొత్త నర్సింహులు, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, అష్ష్యు, కాంసాని ఎల్లయ్య పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
దారి ఆక్రమించారు సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువుకట్ట నుంచి పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించారు. కనీసం కాలినడకన వెళ్లకుండా అడ్డుగా బండరాళ్లు పెట్టారు. ఆ దారిని ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయమై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – కొదురుపాక గ్రామ రైతులు ఉపాధి చూపండి కుటుంబపోషణ కష్టంగా మారింది. ఇద్దరు పిల్లలను పెంచేందుకు ఆర్థికంగా కష్టాలు పడాల్సి వస్తోంది. టెన్త్ చదివిన నాకు ఏదైనా ఉపాధి మార్గం చూపించి ఆదుకోవాలి. – షహీదాబేగం, పెద్దపల్లి విచారణ జరిపించండి మా గ్రామంలోని సర్వే నంబరు 48లోగల 27 గుంటల భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. – ప్రతాప్, గుండారం, కమాన్‌పూర్ మండలం ● అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి ● అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు ప్రజావాణి ద్వారా అందించిన అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించి సత్వర పరిష్కార మార్గాన్ని చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి అభాగ్యుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి వివిధ విభాగాల అధికారులకు సిఫారసు చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. -
కంపుకొడుతున్న కాలువలు
● డ్రెయినేజీల్లోనే పూడిక ● తొలగించడంలో నిర్లక్ష్యం ● మురుగునీటి పారకానికి ఆటంకం ● దుర్గంధం వెదజల్లుతున్న కాలనీలు యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పూడిక నిండిపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దోమలు, ఈగలు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని స్థానికులపై దాడులు చేస్తున్నాయి. ఫలితంగా కాలనీవాసులు వ్యాధులకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్తంగా డ్రైనేజీలు.. రామగుండం కార్పొరేషన్ 19వ డివిజన్ న్యూమారేడుపాక గ్రామంలో సీసీ రోడ్లకు ఇరువైపులా నిర్మించిన సైడ్ డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. శ్రీనాగుల మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఆయా నివాసాల్లోంచి వెలువడే మురుగునీరు ఇళ్లోకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించిన బల్దియా అధికారులు.. వాటికి సైడ్ డ్రెయినేజీలు నిర్మించడం విస్మరించారు. న్యూమారేడుపాక బీసీకాలనీలో రోడ్లు నిర్మించినా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించలేదు. దీంతో ప్రతీ వర్షకాలంలో వర్షపు నీరు, బురదనీరు, మురుగునీరు సమీప ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ఆ దుర్గంధం కాలనీ వాసులు భరించలేకపోతున్నారు. పందులకు ఆవాసాలు.. రోడ్లు, నివాసాల మధ్య వర్షపునీరు, మురుగునీరు నిలవడంతో పెద్దగుంతలుగా తయారవుతున్నాయి. వాటిని పందులు తమ ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. ఇళ్లలోకి దుర్వాస వస్తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పటికై నా ఆర్జీ–2సింగరేణి అధికారులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వర్షకాలం రాకముందే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీతోపాటు రహదారులకు ఇరువైపులా సైడ్ డ్రెయినేజీలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.అధికారుల దృష్టికి తీసుకెళ్తా న్యూమారేడుపాక గ్రామంలోని కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీల నిర్మాణం విషయాన్ని ఆర్జీ–2ఏరియా సీంగరేణి యజ మాన్యం దృష్టికి తీసుకెళ్తాం. అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. – తాళ్ల అమృత, 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ -
పరిహారంపై పేచీ
● ఆర్బిట్రేషన్ చెల్లింపులకు నిర్వాసితుల ఎదురుచూపులు ● పెండింగ్ సమస్యలకు పరిష్కారమెప్పుడో? ● జాతీయ రహదారి భూసేకరణలో కొనసాగుతున్న వివాదంమంథని: నాగ్‌పూర్ –విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల – వరంగల్ మద్య ప్యాకేజీ–1లో చేపట్టిన జాతీయ రహదారి పనులు ప్రారంభమై ఆరు నెలలు కావిస్తున్నా నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం అందలేదు. 2021 మార్చిలో కేంద్రప్రభుత్వం గెజిట్(3) విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ గతేడాది జూలైలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో పనులకు శంకుస్థాపన చేశారు. అయినా రహదారి నిర్మాణంలో నెలకొన్న చిక్కులు పరిష్కారం కావడంలేదు. పరిహారంపై తెగని పంచాయితీ ప్యాకేజీ–7 కింద మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల నుంచి ప్రారంభమయ్యే నాలుగు లేన్ల జాతీయ రహదారి.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గోదావరి సమీపం నుంచి పోతారం, విలోచవరం, నాగారం, కన్నాల, పందుపపల్లి, పుట్టపాక, రామగిరి మండలం ఆదివారంపేట, బేగంపేట, నవాబ్‌పేట, ముత్తారం మండలం లక్కారం, కేశనపల్లి, ముత్తారం, అడవి శ్రీరాంపూర్, ఓడేడు మీదుగా వరంగల్ వెళ్తుంది. మూడు మండలాల మీదుగా వెళ్లే 16 గ్రామాలు 40 కి.మీ. పొడవైన రోడ్డు కోసం 199.7358 హెక్టార్ల(సుమారు 500 ఎకరాలు) భూమి అవసరమవుతుందని హైవే అథారిటీ సూచించింది. జాతీయ రహదారిలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మార్కెట్ ధర పలుకుతోంది. కానీ, అధికారులు రూ.4.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకే పరిహారం చెల్లించారు. జిల్లా పరిధిలో 1,400 మంది రైతులకు పరిహారం కింద రూ.25 కోట్లు మంజూరయ్యాయి. అదనపు పరిహారం కోసం అర్బిట్రేషన్ ద్వారా రూ.20 లక్షల వరకు చెల్లింపులకు నిర్ణయం జరిగింది. కానీ, కొందరు నిర్వాసితులకే డబ్బులు వారి బ్యాంకుల్లో జమయ్యాయి. ఇంకా పరిహారం పొందాల్సిన రైతులు ఉన్నారు. భూములతోపాటు బోరుబావులు, పైపులైన్లు, ఇతర వాటికి పరిహారం చెల్లించాల్సి ఉంది. అధికారులు కేవలం భూములకే పరిహారం చెల్లించి మిగతా వాటిని విస్మరించారు. అంతేగాకుండా భూసేకరణలో అనేక తప్పులు దొర్లినట్లు రైతులు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. సర్వే నంబర్లలో పొరపాట్లు, ఒకరికి బదులు మరొకరు, ఆయకట్టు తక్కువ.. ఇలా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్యాకేజీ–1లో నార్వ నుంచి పుట్టపాక వరకు.. గ్రీన్‌ఫీల్డ్ హైవే తరహాలో పట్టణాలు, జనవాసాలకు దూరంగా మైదాన ప్రాంతాల గుండా సాగే జాతీయ రహదారి నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మిస్తారు. ప్యాకేజీ–7 కింద చేపట్టే ఎక్స్‌ప్రెస్ రోడ్డును మూడు ప్యాకేజీల్లో భాగంగా మంచిర్యాల సమీపంలోని జైపూర్ మండలం నార్వ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక వరకు 31.466 కి.మీ. తొలివిడతలో తీసుకున్నారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణాన్ని 2027 వరకు పూర్తి చేసేలా డీపీఆర్‌లో పొందుపరిచారు. కలెక్టర్‌పై భరోసా జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి అర్హతల ఆధారంగా పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్శ ఆదేశించారు. ఈనెల 10న పుట్టపాకలో నిర్వాసితులతో సమావేశమైన ఆయన.. వారి సమస్యలను విన్నారు. భూముల్లోని బావులు, మోటార్లు, పైపులైన్లు, పండ్లు, అటవీచెట్లు, ఇతర నిర్మాణాలకు పరిహారం అందలేదని నిర్వాసితులు కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. ప్రతీదరఖాస్తును పరిశీలించి, అర్హత ఆధారంగా నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేసి అందజేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో నిర్వాసితుకు భరోసా కలిగింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి పరిహారం అందుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు. -
విపత్తుల సమయంలో రెస్క్యూ సేవలు
● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడి ● ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రెస్క్యూ శిక్షణగోదావరిఖని: విపత్తుల సమయంలో రెస్క్యూ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి మెయిన్ రెస్క్యూస్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని డైరెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 36 రోజుల్లో 1,200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కి శిక్షణ ఇస్తామన్నారు. విపత్తుల నిర్వహణ తీరు పై శిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సి న తీరుపై ప్రాక్టికల్‌గా వివరించనున్నామని తెలిపారు. వంద మంది చొప్పున ఒక్కొక్క బ్యాచ్‌కి 3 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. అధునాతన రెస్క్యూ పద్ధతుల తీరు, రెస్క్యూ, రికవరీ విధానాలు, అత్యవసర గాయాల చికిత్స పద్ధతులను వివరించారు. అగ్నిప్రమాదం, భవ నం కూలిపోవడం, గని విపత్తు రక్షణ, ప్రథమ చికిత్స విధానాలను కవర్ చేస్తూ శిక్షణ కొనసాగుతుందని ఆయన వివరించారు. తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గుడిపేట 13వ బెటాలియ న్ కమాండెంట్ వెంకట్రాములు, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, క్వాలిటీ జీఎం భైద్యా, రెస్క్యూ సూ పరింటెండెంట్ మాధవరావు, సెక్యూరిటీ అధికా రి షరీఫ్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలపై విచారణ జరపాలి
పెద్దపల్లి కమాన్‌చౌరస్తాలో ఇల్లు లేకున్నా మున్సిపల్ అధికారులు ఇంటి నంబరు కేటాయించారు. దానికి ఆస్తిపన్ను వసూలు చేస్తున్నట్లు రసీదులు ఇస్తున్నారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బొంకూరి సుభాష్, కమాన్‌రోడ్డు పెద్దపల్లిఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి పెద్దపల్లిలోని ఉదయ్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న. ఆలయాల వద్ద భిక్షాటన చేస్తూ దాతలు ఇచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తున్న. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పిన సార్లు .. ఇప్పుడే కాదు.. తర్వాత ఇస్తమంటున్నరు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కర్రెవుల నర్సమ్మ, దివ్యాంగురాలు, పెద్దపల్లి -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ధర్మారం(ధర్మపురి): ప్రజా సంక్షేమమే ధ్వే యమని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నా రు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 106 మందికి రూ.36 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడే వారికి చికిత్స కోసం ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ అమలు చేస్తోందని అన్నారు. అనంతరం ఇటీవల మృత్యువాతపడిన గొర్రెలకు పరిహారం మంజూరు చేయాలని ప్రతిపాదించిన లేఖను బొమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొర్రెలపెంపకందారులకు విప్ లక్ష్మణ్‌కుమార్ అందించారు. ఆ లేఖను కలెక్టర్‌కు అందించాలని ఆయన సూచించారు. వారంరోజుల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకుడు కాంపెల్లి రాజేశం, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో రమేశ్ పాల్గొన్నారు. నాగలింగేశ్వరస్వామికి ప్రత్యేకపూజలు పెద్దపల్లిరూరల్: రాగినేడు గ్రామంలోని స్వ యంభూ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రెండో వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చులాపురం ప్రాంతానికి చెందిన అవధాని దుద్దిళ్ల మనోహరశర్మ ఆధ్యర్వంలో ప్రధాన అర్చకుడు రాజేశ్వరశర్మ తదితరులు గణపతిహోమం, రుద్రహోమం, నవగ్రహపూజాకార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, ఆలయక మిటీ చైర్మన్ భూమయ్య, అవినాష్, కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపిక కోసం దరఖాస్తులు పెద్దపల్లిరూరల్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూ ల్(రెసిడెన్షియల్, నాన్‌రెసిడెన్షియల్) ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ అధికారి వినోద్‌కుమార్ తెలిపా రు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ రెసిడెన్షియల్ప థకం కింద విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వ సతి, భోజనంతోపాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాల కోసం రూ.42 వేలు, నాన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు (హాస్టల్ భోజన వసతి మినహాయింపు) ప్రతీ విద్యార్థికి రూ.28 వేల చొప్పున చెల్లిస్తారని పే ర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 24లోగా త మ కార్యాలయంలో అందించాలని, ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.13 పరీక్ష కేంద్రాలు .. 4,230మంది విద్యార్థులు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అ డ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం ఇంటర్ నోడల్ అధికారి కల్పన, డీ ఈవో మాధవితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించా రు. ఈ సంద్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ, జిల్లావ్యాప్తంగా 4,230 మంది విద్యార్థు లు (2,538 మంది ఫస్టియర్, 1,692 మంది సెకండియర్) విద్యార్థుల కోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా జిల్లా పరీక్షల కమిటీ ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో పరీక్షలు జరపాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాఫిక్ ఏసీపీగా శ్రీనివాస్
గోదావరిఖని: రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా సీహెచ్ శ్రీనివాస్‌ను నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జానీ నర్సింహులును డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను రామగుండం బదిలీ చేశారు. కాగా గతంలో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, ట్రాఫిక్ ఏసీపీ మధ్య ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఈక్రమంలో ఏసీపీ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. త్వరలోనే ఏసీపీ బదిలీ ఉంటుందని ప్రచారం జరిగినా ఎట్టకేలకు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్బీ ఏసీపీ ఎస్వీ రాఘవేంద్రరావును హైదరాబాద్ ఎస్ఆర్నగర్ ఏసీపీగా బదిలీ చేశారు. సీసీఎస్ ఏసీపీ ఎన్.వెంకటస్వామిని ఎస్డీగా జగిత్యాలకు బదిలీ చేశారు. -
మధు.. స్థాయి దిగజార్చుకోవద్దు
పెద్దపల్లిరూరల్: ‘ఎమ్మెల్యేగా.. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా సేవలు అందించినవ్.. ఇప్పుడు అధికారం పోయిందన్న బాధతో అడ్డగోలు విమర్శలు చేసి నీ స్థాయి దిగజార్చుకోవద్దు’ అని డీసీసీ అధ్యక్షుడు ఠాకూర్ మక్కాన్‌సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దగాపడ్డదే దళితులు అనే సంగతిని ప్రజలు గుర్తుంచుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతూ మాట్లాడడం బురద చల్లే ప్రయత్నమేనన్నారు. తెలంగాణకు తొలి సీఎంగా దళితుడేనని ప్రకటించి మోసం చేసింది మొదలు.. అనేక హామీలు ఇచ్చి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వంశీకృష్ణను తాము గెలి పించుకుంటే తమ పార్టీ అంతర్గత వ్యవహరంలో నీ జోక్యం ఎందుకుని వారు ప్రశ్నించారు. ఘనంగా పుష్కర ఏర్పాట్లు మంథని సెగ్మెంట్ పరిధిలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తుంటే ఓర్వలేక పుట్ట మధు నిందారోపణలకు దిగుతున్నారని ఠాకూర్, విజయరమణరావు అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారందరికీ ఆహ్వానాలు అందిస్తారని, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కూడా సమాచారం ఉందని అన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మంత్రిశ్రీధర్‌బాబు సతీమణి శైలజారామయ్యర్పై పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, నాయకులు బండారి రామ్మూర్తి, అవినాష్, మల్లయ్య, సుభాష్‌రావు, సంపత్, శ్రీనివాస్, మస్రత్ పాల్గొన్నారు. దళితులపై మొసలికన్నీరు కార్చితే ఎవరూ నమ్మరు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దగా పడ్డదే దళితులు డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్, ఎమ్మెల్యే విజయరమణారావు -
ఉద్యోగులపై కొనసాగుతున్న దాడుల పరంపర
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ ఆర్జీ–3 డివిజన్లో కొద్దిరోజులుగా అధికారులు, ఉద్యోగులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల చేప ట్టిన కాలువ మళ్లింపు పనుల్లో చోటుచేసుకున్న బ్లా స్టింగ్ల్లో నాగెపల్లిలోని నివాసాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమైన విషయం విదితమే. అయితే, ని వాసాలు మరమ్మత్తు చేస్తున్న క్రమంలో గ్రామస్తు లు, సింగరేణి ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం సింగరేణి సివిల్ ట్రైనీ ఉద్యోగి శ్రీనివాస్‌పై కొందరు దాడి చేశారు. సివిల్ సూపర్వైజర్ సాయికృష్ణ బైక్ లాక్కున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు.. అధి కారులు తమతో దురుసుగా ప్రవర్తించారని గ్రామ స్తులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇరువర్గాలు పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సింగరేణి ఉద్యోగులు, గ్రామస్తుల మధ్య రాజీకి నాయకులు అధికారులతో చర్చలు జరుపుతున్నారని, మళ్లీ దాడిలు జరగనివ్వబోమని హామీ ఇచ్చా రని తెలిసింది. ఇప్పటికే రాజాపూర్‌లో ఓసీపీ–2 భూ సేకరణకు వెళ్లిన అడిషనల్ మేనేజర్ శ్రీనివాస్‌పై దాడి జరగ్గా.. పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్జీ–3లో సింగరేణి ఉద్యోగం చేయలాంటే భయం భయంగా బతకాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆహ్లాదం.. ఆరోగ్యం
● సిమ్మింగ్పై ఆసక్తి ● అందుబాటులో ఈతకొలనులు యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి కార్మిక, ఉద్యోగుల పిల్లలతోపాటు ప్రభావిత గ్రామాల విద్యార్థులు, ప్రజల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన స్విమ్మింగ్పూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్జీ–2 ఏరియా సింగరేణి యాజమాన్యం సుమారు పదేళ్లక్రితం వీటికి రూపకల్పన చేసింది. స్థానిక సీఈఆర్ క్లబ్ ఆవరణలో నిర్మించిన రెండు ఈతకొలనులకు స్విమ్మర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బేబీ ఈతకొలను ఐదేళ్ల నుంచి పనిచేస్తోంది. ఇది 10ఏళ్ల వయసు లోపు చిన్నారుల కోసం, రెండోది 10 ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసు వారికోసం కేటాయించారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈతకొలనుల దారిపట్టారు. రోజూ స్విమ్మింగ్ చేస్తున్నవారు కొందరైతే.. ఈత నేర్చుకుంటున్నవారు మరికొందరు. వీరిరాకతో స్విమ్మింగ్‌పూల్స్ సందడిగా మారాయి. సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా స్విమ్మింగ్ కోచ్‌ను నియమించి ఈత నేర్పిస్తోంది. ఇక్కడ మెలకువలు నేర్చుకున్న చాలామంది స్విమ్మర్లు వివిధ విభాగాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ప్రతిభ చూపారు. మెడల్స్ సాధించారు. సంతోషంగా ఉంది నాకు ఈత అంటే ఇష్టం. ఈత నేర్చుకునేందుకు సీఈఆర్ క్లబ్లో ఈతకొలను అందుబాటులో ఉంది. కోచ్ సురేశ్ ఈతలో మెలకువలు నేర్పిస్తున్నారు. నేను ఇప్పటికే రాష్ట్రస్థాయి బ్యాక్ స్ట్రాక్ విభాగంలో మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. – ఎం.రవితేజ, బీటెక్, యైటింక్లయిన్‌కాలనీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న సింగరేణి ఆర్జీ–2ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈతకొలనులో నేను సుమారు ఐదేళ్ల నుంచి ఈత ప్రాక్టీస్ చేస్తున్న. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో పాల్గొన్న బటర్‌ఫ్లై విభాగంలో మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. – సుప్రతీక్, తొమ్మిదో తరగతి, యైటింక్లయిన్‌కాలనీ సీఈఆర్ క్లబ్‌లోని ఈతకొలను -
ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన రూ.50.50 లక్షల వ్యంతో చేపట్టిన పార్క్‌ల అభి వృద్ధి పనులకు బల్దియా కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే శనివారం రాత్రి 26వ డివిజన్ దు ర్గానగర్లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ, రామగుండాన్ని తెలంగాణలో ముఖ్యనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నా రు. ఏడాదిలోనే సుమారు రూ.59 కోట్ల అభివృద్ధి పనులు పూర్తికాగా, మరో రూ.100 కోట్ల పనులు వివిధ దశల్లో కొనసాగతున్నాయని తెలిపారు. ని ర్లక్ష్యానికి గురైన నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఏ ఒక్క నగరవాసి ఈ ప్రాంతం విడిచి వలస వెళ్లిపోకూడదనే లక్ష్యంతో పునర్నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ మాట్లాడుతూ, ప్రజల మానసికోల్లాసం, ఆహ్లాదం కోసం దుర్గానగర్తోపాటు ఏడు పార్క్‌ల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈ షాబాజ్, ఏ ఈ తేజస్విని, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వా మి, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, దాసరి ఉమాదేవి, దుర్గానగర్కా లనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్వర్‌రావు, నారా యణ, కాలనీవాసులు బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, దామోదరాచార్యులు, పి.శ్రీనివా స్, స్వామిగౌడ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో పూజలు రామగుండం: శ్రీరామునిగుండాల కొండపై స్వ యంభూ వెలిసిన శ్రీధనుర్భానాంజనేయస్వామి దేవాలయంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. పూజారి శ్రీరాంపల్లి మురళీధర్‌శర్మ వేదమంత్రోచ్ఛారణాల మధ్య పూజలు చేయించారు. ఎమ్మెల్యే ము ఖ్య అనుచరులు దీటి బాలరాజు, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, కోల లక్ష్మణ్‌గౌడ్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ -
మేము ‘ఆగం’
● జరిమానా చెల్లిస్తాం.. కానీ నిబంధనలు పాటించం ● ఇద్దరికి మించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణం ● మైనర్ల చేతిలో బండి.. రయ్ రయ్ మంటూ డ్రైవింగ్ ● అతివేగం, అజాగ్రత్తలతో పట్టు తప్పి ప్రమాదాలుబైక్పై రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్తున్న మైనర్లు వీరు. జిల్లా కేంద్రంలో గత మంగళవారం పాలిసెట్ రాసి ఇళ్లకు వెళ్తున్నారు. అసలే వేసవి సెలవులు.. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌చేసే సమయం.. ఇంట్లో ఉండలేని మైనర్లు పరిమితికి మించి ఇలా బైక్‌లపై రైడింగ్ చేస్తున్నారు. రోడ్లపై దూసుకుపోతున్నారు. వాహనాలు ఇచ్చినవారిపై చర్యలు మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం. వారికి వాహనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తరచూ వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం. నంబరు ప్లేట్లు, నంబర్లు తొలగించినా క్రిమినల్ కేసులు తప్పవు. – జానీ నర్సింహులు, ట్రాఫిక్ ఏసీపీ సాక్షి, పెద్దపల్లి: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. కేసులు నమోదైనా సరే.. అవసరమైతే ఫైన్ చెల్లిస్తామని, రూల్స్ మాత్రం పాటించేదిలేదన్నట్లు చాలామంది యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తమతోపాటు ఎదుటివారికి ప్రమాదమని తెలిసినా రయ్..రయ్‌మంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు. అప్పుడు తనిఖీలు.. గతంలో పోలీసులు ప్రధాన కూడళ్లతోపాటు రహదారులపై నిత్యం తనిఖీలు చేసి జరిమానా విధించేవారు. ఈ చలానా పద్ధతి అందుబాటులోకి వచ్చాక ఉల్లంఘనలను కెమెరాలతో క్లిక్‌మనిపిస్తున్నారు. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అయినా, కొందరు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంనేందుకు అడ్డదారిలో వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఏడాది 101 ప్రమాదాలు.. జిల్లాలో ఈఏడాది 101 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని రికార్డులు చెబుతున్నాయి. అందు లో 39మంది మృతిచెందారు. 108మంది గాయాలపాలయ్యారు. జిల్లాలో ప్రధానంగా 26 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ చలానా, నేరుగా జరిమానా విధిస్తున్నారు గత జనవరి నుంచి ఇప్పటివరకు 1.45లక్షల కేసులు నమోదుకాగా, రూ.4.12కోట్ల వరకు జరిమానా విధించినా.. వాహనదారుల్లో మార్పు కానరావడం లేదు. తప్పించుకునేలా ఎత్తులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిని పోలీసులు కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారు. దీంతో కొందరు నంబరు ప్లేట్లో అంకెలు కనిపించకుండా చేస్తున్నారు. కొన్నింటిపై రంగులు పూస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ఇలాంటివారే అధికంగా ఉంటున్నారు. ప్రమాదమని తెలిసినా.. ముందుకు వెళ్లి వాహనం వెనక్కి తిప్పుకొచ్చే అవకాశం ఉన్నా.. పట్టించుకోవడం లేదు. దర్జాగా వాహనాలకు ఎదురుగా వెళ్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు. జైలు శిక్షలు ఉన్నా.. 18 ఏళ్ల వయసు నిండిన తర్వాతే గేర్ వాహనాలు నడిపేందుకు అర్హులని అధికారులు చెబుతున్నారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 199ఏ ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేనివ్యక్తికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనలేని తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్‌లు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారు.జిల్లాలో ఈఏడాది ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ 1,931 అతివేగం 6,731 ట్రిపుల్ రైడింగ్ 2,473 డ్రైవింగ్ లైసెన్స్ లేనివి 5,266 డ్రంక్ అండ్ డ్రైవ్ 3,813 సీట్‌బెల్ట్ ధరించనివి 138 మైనర్ రైడింగ్ 10 మొత్తం ట్రాఫిక్ కేసులు 1,45,673 జరిమానాలు(రూ.లలో) 4,12,99,615 జరిమానా చెల్లించినవారు 17,518 చెల్లించిన సొమ్ము(రూ.లలో) 50,00,035 -
పీఆర్పీ సాధనకు ఆందోళనలు
గోదావరిఖని: ఫెర్ఫార్మెన్స్ రి లేటెడ్ పేమెంట్(పీఆర్పీ) చే యాలని కోరుతూ సింగరేణి వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు తీర్మానించినట్లు కోల్‌మైన్స్ ఆ ఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవా రం రాత్రి స్థానిక బీ గెస్ట్‌హౌస్‌లోని సీఎంవోఏఐ కా ర్యాలయంలో రీజియన్‌స్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాల్లో భాగమైన 2022–23 పీఆర్పీ, 2017–2014 బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఇందుకోసం రోజుకో ఏరియాలో నల్లబ్యాడ్జీలతో ని రసన తెలపాలని నిర్ణయించారు. అలాగే వర్క్టూరూల్స్ కొనసాగించాలి, జీఎం కార్యాలయాల్లో ప్రతీరోజు సాయంత్రం నిరసన తెలపాలని తీర్మానించారు. సెంట్రల్ కమిటీకి ఈ ప్రతిపాదనలు చేసి వెంటనే కార్యాచరణ ప్రకటించాలని రామగుండం రీజియన్ కోరింది. సమావేశంలో నాయకులు కోల మల్లేశ్, విష్ణు, పెరుమాళ్ల శ్రీనివాస్, దామోదర్, కట్ట శ్రీధర్, మధు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న..
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025అమ్మా..కన్నా..పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ జంటకు పదేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తొలుత ఇప్పుడే పిల్లల ఆలోచన వద్దని నిర్ణయించుకున్నారు. ఐదేళ్లు గడిచిపోయాయి. ఇద్దరి వయసు ముప్పై ఏళ్లు దాటిపోయింది. జీవితంలో స్థిరపడ్డాం కదా అని.. తీరా సంతానం కోసం వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు, మూడేళ్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఎవరైనా పిల్లలను దత్తత తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు.న్యూస్‌రీల్ -
నేడు సింగరేణి మెగా జాబ్‌మేళా
గోదావరిఖని: స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం నిర్వహించే మెగా జాబ్ మేళాకు సింగరేణి యాజమాన్యం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. సుమారు వందకుపైగా కంపెనీలు హాజరై అర్హతలను బట్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. సింగరేణి యాజమాన్యం, నోబెల్ ఎన్ఫర్మెంట్ సొసైటీ ఫౌండర్ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 8గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తారు. విద్యార్హతలు, అనుభవం తదితర అంశాల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సుమారు 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఎండదెబ్బకు గురికాకుండా కూలర్లు, మంచినీరు, మజ్జిగ, భోజన వసతులు కల్పించారు. -
కోతలు లేకుండానే కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులను కోతల పేరిట రైస్‌మిల్లు యజమానులు ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నామని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం పనులు సాఫీగా సాగుతున్నాయన్నారు. ధాన్యం డ బ్బులు రైతు బ్యాంకు ఖాతాల్లో 48గంటల్లో జమ చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 319 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 35వేల మంది రైతుల నుంచి రూ.592కోట్ల 78 లక్షల విలువైన 2లక్షల 56 వేల 810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో డీఎస్వో రాజేందర్, డీఎం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మారుపేర్ల డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలి
గోదావరిఖని: సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ వి చారణ పేరుతో పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలివ్వాలని మారుపేర్ల బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ఇందిరా పార్క్‌వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడు తూ వెయ్యి మంది నిరుద్యోగులను మారుపేర్లు, వి జిలెన్స్ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు. మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్క శ్రావణ్‌గౌడ్, ప్రతినిధులు తిరుమల శ్రీనివా స్, ఈర్ల రాజయ్య, డిష్బాబు, రంజిత్, సందీప్, సత్యం, సంతోష్, రాజేందర్, శ్రావణ్, ఓంప్రకాశ్, సుధాకర్, నరేశ్, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆన్లైన్ నమోదులో వేగం పెంచండి
కోల్‌సిటీ(రామగుండం): ఇందిరమ్మ ఇళ్లు పీఎంఏ వై, రేషన్‌కార్డు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని రా మగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులతో ఆయా ద రఖాస్తుల పరిశీలన ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. దారిద్య్రరేఖకు దిగువనవున్న వారికే పథకా ల లబ్ధిచేకూరేలా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నా రు. వచ్చే వర్షాకాలం దృష్ట్యా పూడికతో నిండిన కా లువల వివరాలు, మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హన్మంతరావు నాయక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. -
సీపీని కలిసిన ఎమ్మెల్యే ఠాకూర్
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుస్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ నాయకులను సీపీకి పరిచయం చేశారు. నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు పెద్దపల్లిరూరల్: పశువులను కబేళాకు తరలించాలని, నాణ్యమైన మాంసం విక్రయించేందుకు పశువైద్యాధికారి అనుమతి పొందాలని ఏసీపీ కృష్ణ సూచించారు. బక్రీద్ నేపథ్యంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావుతో కలిసి శుక్రవారం కబేళా నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనుమతి మేరకే వాహనాల్లో పశువులను తరలించాలన్నారు. పరిసర ప్రాంతవాసులకు ఇబ్బంది కలిగించేలా పశుమాంస విక్రయాలు చేయవద్దని అన్నారు. స్వచ్ఛత అందరి బాధ్యత జ్యోతినగర్(రామగుండం): స్వచ్ఛత అందరి బాధ్యతని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. పర్మినెంట్ టౌన్షిప్ ప్రధాన దుకాణ సముదాయంలో శుక్రవారం స్వచ్ఛత పక్షోత్సవాలు నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాలుపంచుకోవాలని ఆయన కోరారు. తెలుగు, హిందీ భాషల్లో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఉన్నతాధికారి సింఘారాయ్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు కుటుంబసభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. దుకాణాల్లో తనిఖీలు సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య దుకాణాలను తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు షాపుల్లో షాంపిళ్లు సేకరించారు. తక్కువ పరిమాణంలో సరుకులు లభించిన 8 దుకాణ యజమానులపై కేసులు నమోదు చేశారు. రూ.24వేల జరిమానా విధించారు. తూకంలో వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దోమల నియంత్రణతోనే డెంగీ దూరం పెద్దపల్లిరూరల్: దోమల నియంత్రణతోనే డెంగీ నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం డెంగీ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ప్రగతినగర్ కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. వచ్చే వానాకాలంలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, ఈనేపథ్యంలో ఇళ్లలోని వ్యర్థాలు తొలగించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీరాములు, రాజమౌళి, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్, రాజేశం, రవీందర్, అంజయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తతల మధ్య వైన్స్ భవనం కూల్చివేత
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని వైన్స్‌షాప్ భవనాన్ని పోలీస్ బందోబస్తు మధ్య రామగుండం బల్దియా అధికారు లు శుక్రవారం కూల్చివేత ప్రారంభించారు. ఫోర్లే న్ సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇటీవల సు మారు 25 దుకాణాలను కూల్చివేసిన అధికారులు.. చివరగా రోడ్డు సమీపంలోని మద్యం దుకాణ భవనాన్ని కూడా కూల్చివేతకు చర్యలు తీసుకున్నారు. రాజీవ్ రహదారి పక్కనే భవనం ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్‌టౌన్, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కూల్చివేతను అడ్డుకున్న భవన యజమాని గాజుల రాజమల్లుతోపాటు ఆయన కుమారుడిని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 21వ తేదీ వరకు స్టేటస్కో ఉండగా ఎలా కూల్చివేస్తున్నారని ఆయన బల్దియా అధికారులను ప్రశ్నించారు. -
పారదర్శకంగా ‘ఉపాధి’
● ఈజీఎస్ పనులపై నిఘా ● అన్ని గ్రామాల్లోనూ ఏర్పాట్లు రామగిరి(మంథని): గ్రామీణ కూలీలకు చేతినిండా పనులు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పనుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా ప్రణా ళిక రూపొందించాయి. పథకాన్ని పకడ్బందీగా అ మలు చేసేందుకు గ్రామస్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభు త్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉండగా తొలిసారి గ్రామ కమిటీల ఏర్పాటు కు కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. తరచూ తనిఖీలు.. సామాజిక తనిఖీ నివేదికలపై తరచూ సమీక్షించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు గ్రామ కమిటీలు ఉపాధి పనులు పర్యవేక్షిస్తాయి. అంతేకాదు.. ఏటా జరిగే సామాజిక తనిఖీ సభల్లో అవినీతిని గుర్తిస్తాయి. అవినీతి సొమ్మును రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. జిల్లాలో మొత్తం జాబ్ కార్డులు 1,18,945 ఉండగా, ఇందులో 70,797 కారులు యాక్టివ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు సభ్యులతో కమిటీ.. ప్రతీ గ్రామ పంచాయతీలో ఐదుగురు సభ్యులతో కూడిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘం సభ్యులు, యూత్ సభ్యులు, ఆశ వర్కర్లు ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాధించి జిల్లా అధికారులకు నివేదిస్తారు. వారానికోసారి పరిశీలన కమిటీలు వారానికోకసారి ఉపాధి పనులు పరిశీలిస్తాయి. పనుల తీరు, మంజూరు, కూలీల హాజరు, చెల్లింపులు తదితర వివరాలు సేకరించి మండల పరిషత్ అధికారులకు నివేదిస్తాయి. వారు జిల్లా అధికారులకు అందజేస్తారు. ఇకనుంచి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతీనెల మొదటివారంలో తనిఖీలు చేయాలని, ఆ తర్వాత వివరాలను అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. తనిఖీల్లో వెల్లడైన రికవరీ నిధులను తాత్సారం చేయకుండా రాబట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జాబ్‌కార్డుల వివరాలు మండలం మొత్తం యాక్టివ్లోనివి పెద్దపల్లి 14,561 9,804 మంథని 12,545 8,121 సుల్తానాబాద్ 11,648 6,580 కాల్వశ్రీరాంపూర్ 8,536 5,586 ఓదెల 11,511 7,045 ముత్తారం 7,452 4,803 జూలపల్లి 7,486 3451 ఎలిగేడు 4,587 2,297 ధర్మారం 12,278 7,179 కమాన్‌పూర్ 5,920 2,951 అంతర్గాం 5,878 3,751 పాలకుర్తి 9,201 5,311 రామగిరి 7,342 3,918 జవాబుదారీగా ఉంటుంది ఉపాధిహామీ పథకంలో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా సత్ఫలితాలు వస్తాయి. ఉపాధి పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ఆదిలోనే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. త్వరలోనే అన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశాం. – కాళిందిని, డీఆర్డీవో -
నైపుణ్యం పెంచుకుంటేనే మెరుగైన బోధన
● ఉపాధ్యాయ శిక్షణకు పటిష్ట కార్యాచరణ ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధన నైపుణ్యం పెంపొందించుకుంటూ నాణ్యమైన విద్యాబోధన చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర, బాలికల హైస్కూళ్లలో ఉపాధ్యాయుల వేసవి శిక్షణ శిబిరాలను డీఈవో మాధవితో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవ మైనదని, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం వారికే ఉందన్నారు. ఈనెలాఖరు వరకు డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ, స్కిల్స్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ లాంటి అంశాల తో పాటు గణిత, సోషల్, మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఐఆర్పీలకు శిక్షణ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెంపు జీలుగ, జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియ దున్నడం ద్వారా భూసారం పెంపొందించుకోవచ్చని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక డీసీఎంఎస్ పాయింట్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి రైతులకు 50శాతం రాయితీపై విత్త నాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 51 కేంద్రాల ద్వారా రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 6వేల క్వింటాళ్ల జీలుగ, 600 క్వింటాళ్ల జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, డీఏవో ఆదిరెడ్డి, శ్రీనాథ్, అలివేణి, మల్లారెడ్డి, సురేశ్‌గౌడ్ పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ద.మ.రై. నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి– మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్కరీంనగర్క్రైం: వివాహితలపై వేధింపులు పెరగడం ప్రస్తుత సమాజాన్ని కలవరపెడుతోంది. గృహహింస, ఆత్మహత్యలు, హత్యలు, మిస్సింగ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు పెరిగాయని అధికారక గణాంకాలు చెబుతున్నాయి. ఇల్లాలిపై భర్త, అత్తింటివారి వేధింపులు పెరుగుతుండడం, భర్తల రాక్షసత్వానికి వివాహితలు బలికావడం జరుగుతోంది. కాగా, మద్యానికి బానిసవడం, వివాహేతర సంబంధాలు, తదితర కారణాలు ఇల్లాలిపై దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంటికి దీపం ఇల్లాలు.. అలాంటి ఆమైపె పెరుగుతున్న దాడులు ఆరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభా గాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ.. దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడడం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుగాపై నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరికొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరా బాద్ (151 కి.మీ.) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కి.మీ.) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మ ధ్య లైన్‌పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు స వాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్‌పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. మెయిన్‌లైన్‌కు ● నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు ● పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కి.మీ.) ను బల్హార్షా – కాజీపేట మెయిన్ లైన్‌కోసం రూ.36.99 కోట్లు కేటాయించింది. రైల్వేస్టేషన్ల కోసం.. ● నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్‌ను బ్లాక్ స్టేషన్‌గా మార్చేందుకు రూ.15.85 కోట్లు. ● కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు. ● నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు. ● మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లిలో ప్లాట్‌ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు ● పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు. ● పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు. ● సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్‌గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు ● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్‌కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. రైలు వంతెనల కోసం.. ● కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీకిరూ.29.33కోట్లు ● పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు. ● కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు కేటాయించారు.– 8లోu -
రూ.58.43 కోట్లతో అభివృద్ధి పనులు
● రామగుండం బల్దియా ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్షకోల్సిటీ(రామగుండం): నగరంలో రూ.58.43 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.9 కోట్ల 64 లక్షలు, ఎల్ఆర్ఎస్ ఇంట్రెస్ట్ ఫండ్స్ కింద రూ.84 లక్షలు, 14వ ఆర్థిక సంఘం కింద రూ.50 లక్షలు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.45 కోట్లతోపాటు ప్ర త్యేక అభివృద్ధి కింద రూ.కోటి 84 లక్షలు, వరద స హాయ నిధుల కింద రూ.65 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన వివరించారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగుపడాలి పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ, ఆయుర్వేద, హోమియో, మాతాశిశు ఆస్పత్రుల్లో వైద్యసేవలు మరింత మెరుగుపడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు దాని ఆవరణలోని పలు విభాగాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు వైద్య సేవలు అందించడంతోపాటు వారి సహాయకులకు సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేసి టెలివిజన్లను అమర్చాలని సూచించారు. డయగ్నొస్టిక్ కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ఎంవో విజయ్ తదితరులు ఉన్నారు. ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి జిల్లాలో ఆయిల్‌పాం సాగు వైపు రైతులను మళ్లించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించా రు. కలెక్టరేట్లో సాగు ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఆయిల్‌పాంకు కోతులబెడద ఉండదని, నాలుగేళ్ల దాకా అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. ఆ తర్వాత అధికంగా ఆదాయం సమకూరుతుందనే విషయాలను రైతులకు వివరించాలని సూచించారు. సెప్టెంబర్ వరకు 1,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, సీఈవో శేషు తదితరులు ఉన్నారు. -
యువత కోసమే జాబ్‌మేళా
గోదావరిఖని: యువత భవిష్యత్ బలోపేతమే లక్ష్యంగా మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని నిరుద్యోగుల కోసం ఈనెల 18న స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు. నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయిమెంట్ అసోసియేషన్, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాలో వందకుపైగా ప్రఖ్యాత సంస్థలు పా ల్గొంటాయన్నారు. వివరాల కోసం 94911 44252, 99483 77353లో సంప్రదించాలని సూచించారు. ఏసీపీ రమేశ్, జీఎంలు లలిత్‌కుమార్, వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాబ్‌మేళా ఏర్పాట్ల ను ఏసీపీ రమేశ్, జీఎం లలిత్‌కుమార్ పరిశీలించారు. వన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, పర్సనల్ డీజీఎం కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం పెద్దపల్లిరూరల్: ప్రజాసంక్షేమం, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, మినీట్యాంక్ బండ్ వద్ద పబ్లిక్టాయిలెట్లు, ప్రభుత్వ ఐటీఐలో ప్రహరీ తదితర పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించి మాట్లాడా రు. వాకర్స్ అసోసియేషన్ వినతిమేరకు ట్రాక్ చుట్టూ విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సిటిజన్హాల్ సందర్శన రామగుండం: కార్పొరేషన్ 22వ డివిజన్ ఇందిరమ్మకాలనీలోని సీనియర్ సిటిజన్హాల్ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ గు రువారం సందర్శించారు. ప్రభుత్వ అవసరాల కోసం భవనం వినియోగించాలని అన్నారు. భవనంలో మహిళలకు కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని మాజీ కార్పొరేటర్ నస్రీన్‌బేగం విన్నవించారు. మహిళా కాంగ్రెస్ అంత ర్గాం మండల అధ్యక్షురాలు నాజియాసుల్తానా, నాయకులు మహ్మద్ ఉస్మాన్ షరీఫ్, ఇంజినీర్ రామన్ తదితరులు పాల్గొన్నారు.మెకానిక్ కార్మికుల ‘టూల్ డౌన్’ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఆర్ఎఫ్సీఎల్ క ర్మాగారంలో మెకానిక్ కార్మికులు గురువారం టూల్‌డౌన్ సమ్మె చేశారు. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఒక్కరోజు టూల్ డౌన్ నిర్వహించారు. ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ మాట్లాడుతూ, మెకానిక్ కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. యాజమా న్యం స్పందించకుంటే ఆర్ఎఫ్సీఎల్ గేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ ఉన్న త పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.40కోట్లను కలెక్టర్ కోయ శ్రీహర్ష మంజూరు చేశారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని హైస్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చిస్తారని ఆయన పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విదార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
సాక్షి,పెద్దపల్లి: బాజాభజంత్రీలు.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పో యి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్‌తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ యువతికి పెళ్లిపెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్‌రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
నిర్మాణం పూర్తయ్యాకే కూల్చివేత
● ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్(పెద్దపల్లి): కొత్త షాపింగ్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం పూర్తయ్యాకే పాత కాంప్లెక్స్ భవనాల కూల్చివేతలు ఉంటాయని, అప్పటివరకు వ్యాపారం కొనసాగించవచ్చని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రూ.42లక్షల అంచ నా వ్యయంతో స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ఎదుట చేపట్టిన కాంప్లెక్స్ పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుల్తానాబాద్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ఇందుకోసం అందరూ సహకరించాలని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, నాయకులు గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, అబ్బయ్య, చిలుక సతీశ్, బిరుదు కృష్ణ, రఫీ పాల్గొన్నారు. -
దుకాణాల కూల్చివేత
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఆర్టీసీ బ స్టాండ్ సమీపంలోని సుమారు 25 దుకాణాలను బల్దియా అధికారులు బుధవారం కూల్చివేశారు. సర్వీస్ రోడ్డు విస్తరణలో భాగంగా 25 నుంచి 30 షాపులను తొలగించాలని అధికారులు ఇటీవల షాపుల నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో షాపుల నిర్వాహకులు ఆందోళనకు గుయ్యారు. జేసీబీ సాయంతో అధికారులు దుకాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్వయంగా కూల్చివేతల తీరును పరిశీలించారు. వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేసి, దుకాణాలను కూల్చివేయడం సరికాదని ఆయన అన్నారు. అయితే కూల్చివేసిన దుకాణాల వెనుక సర్వీస్ రోడ్డుకు ఆటంకం లేకుండా తిరిగి దుకాణాలు కట్టుకోవడానికి సింగరేణి సంస్థ అంగీకారం తెలిపిందని సమాచారం. -
రైతుకంట క‘న్నీళ్లు’
ఇతడు కౌలురైతు అల్లెపు సారయ్య. పెద్దపల్లిలోని జ్యోతినగర్ స్వస్థలం. పదెకరాల్లో వరి పండించాడు. ఇటీవల వరి కోసి వ్యవసాయ మార్కెట్‌కు వడ్లు తీసుకొచ్చాడు. తూకం వేయడంలో జాప్యమైంది. నాలుగు రోజు వ్యవధిలో రెండుసార్లు కురిసిన అకాలవర్షంలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం తడవకుండా కప్పిన కవర్‌పై వర్షపునీరు ఎత్తిపోస్తున్న పెద్దపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన తూముల కై లాసం ఇతడు. 15 రోజులుగా మార్కెట్లో ధాన్యం కుప్పగా పోసి బార్దాన్ కోసం నిరీక్షిస్తున్నాడు. అకాల వానకు ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. -
వారం కింద తెచ్చిన
వారం క్రితం ధాన్యం మార్కెట్‌కు తెచ్చా. నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు వానలు పడ్డాయి. రెండుసార్లు వడ్లు తడిసినయి. కొంత నీటిలో కొట్టుకు పోయింది. జాప్యం లేకుండా ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి. – సొల్లూరి మణికంఠ, రైతు, పెద్దపల్లి పరిహారం చెల్లిస్తాం అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. తడిసిన ప్రతీతిధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. రైతులు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వానిదే. – శ్రీధర్‌బాబు, రాష్ట్రమంత్రి ఎక్కువ కొనుగోలు చేశాం ధాన్యం తూకంలో జాప్యమేమీలేదు. గతేడాది మే 13నాటికి 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం వేస్తే, ప్రస్తుతం 2,18,392 మెట్రిక్ టన్నులు తూకం వేశాం. 82శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశాం. – శ్రీహర్ష, కలెక్టర్ ఆందోళన వద్దు ధాన్యం పండించిన రైతులు ఆందోళన పడొద్దు. అనుకోకుండా కురిసిన వానలకు తడిసిన ధాన్యంపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లండి. రంగు మారకుండా ఉంటుంది. చివరిగింజ వరకూ కొనేలా బాధ్యత తీసుకుంటాం. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి -
పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘పారిశుధ్య కార్మికుల భద్రత.. రక్షణ.. గౌరవం’ అంశంపై కలెక్టరేట్లో బుధవారం ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. పల్లెప్రజల ఆరోగ్యం కోసం వీధులను పరిశుభ్రంగా ఉంచేలా శ్రమిస్తున్న కార్మికులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పంచాయతీ నిధుల నుంచి ప్రతీ కార్మికుడికి ప్రమాద బీమా ప్రీమియం చెల్లించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను డిసెంబర్ వరకు నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను కలెక్టర్ సన్మానించారు. యూనిసెప్ ట్రెయినర్ కిషన్‌స్వామి, ఫణీంద్ర, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని, జెడ్పీ సీఈవో నరేందర్, స్వచ్చభారత్ మేనేజర్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. సాగునీటి కాలువలకు మరమ్మతు చేయాలి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేసే కాలువలకు మరమ్మతు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇందుకోసం ఉపాధిహామీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారిని ఎంపిక చేయాలని అన్నారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు ఉన్నారు. -
స్కూళ్లను అభివృద్ధి చేయాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలని డీఈవో మాధవి సూచించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్ లో ఆంగ్లం పాఠ్యాంశం ఉపాధ్యాయులకు ‘కెపాసి టీ బిల్డింగ్’ అంశంపై శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నా రు. డీఈవో బుధవారం తనిఖీ చేశారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా బోధనలో మెలకువలు నేర్చుకుని అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా వి ద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఆంగ్లంలో వెనుకబడిన వారిని గ్రూపులుగా విభజించి భాషపై పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కరీంనగర్ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ మొండయ్య, సెంటర్ అబ్జర్వర్ ప్రద్యుమ్నకుమార్, ఎంఈవో రాజ య్య, ప్రిన్సిపాల్ బల్బీర్‌కౌర్, రిసోర్స్ పర్సన్లు జగదీశ్వర్, శ్రీనివాస్, నాగరాజు, కిరణ్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణ రామగుండం: స్థానిక బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా దాసరి శంకరయ్య బు ధవారం ఉద్యోగ బా ధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఈగా కొనసాగిన విజేందర్ వైటీపీపీకి బదిలీపై వెళ్లారు. 11 నె లల క్రితమే రామగుండం బీ– థర్మల్ కేంద్రం మూ తపడింది. సాంకేతిక అవసరాల కోసం విద్యుత్సౌ ధ కొందరు ఇంజినీర్లను ఇక్కడే కొనసాగిస్తోంది. కాగా, శంకరయ్యను ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శేఖర్, కరణ్‌కుమార్, అరుణ్, దుర్గయ్య, పి.శంకర్శాలువాతో సత్కరించారు. -
జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి
గోదావరిఖని: సింగరేణి చేపట్టిన మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కోరారు. తన కార్యాలయంలో బుధవారం ఆ ర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి జాబ్‌మేళా ప్రచార వాల్‌పోస్టర్ విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగ యువతీయువకుల కోసం మేళా చేట్టారన్నారు. దాదాపుగా 100పైగా కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. సుమారు 3వేలకు పైచిలుకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఈనెల 18న ఉదయం 8గంటలకు ప్రారంభమైయ్యే మేళా గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఏసీపీ రమేశ్, అడ్మిన్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైభవంగా రథోత్సవం ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతర బుధవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు రామిడి వెంకటరాంరెడ్డి. శ్రీనివాసరెడ్డి, కొండల్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అర్చకులు కొండపాక రామాచార్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా పెద్దపల్లిరూరల్: మున్సిపల్ పరిధిలో రోడ్లను ఆక్రమించి సామగ్రిని నిల్వ చేసినా, చెత్తాచెదారం పడేసినా జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ హెచ్చరించారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలోని స్క్రాప్ దుకాణం ఎదుట ఇనుప సామగ్రి నిల్వ ఉంచగా రూ.20వేల జరిమానా విధించి బుధవారం ఆ సొమ్ము వసూలు చేశారు. స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 6303127484కు సమాచారం అందిస్తే పరిష్కరిస్తామని అన్నారు. వార్డు ఆఫీసర్లు అనిల్, ప్రదీప్, సాగర్, సురేశ్‌నాయక్ పాల్గొన్నారు. పడిపోతున్న నీటిమట్టం రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. నీటిపారుదలశాఖ అధికారులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో లేదు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. మెరిసిన ‘కరాటే’ హాసిని మంథని: మలేషియాలోని హైపోసిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ హాల్లో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పట్టణానికి చెంది న జపాన్ షిటోరియా కరా టే అకాడమీ విద్యార్థిని మె ట్టు హాసిని పతకాలు సాధించినట్లు ఇన్స్ట్రక్టర్ కావేటి సమ్మయ్య తెలిపారు. 66 కేజీల విభాగాల్లో బంగారు, వెండి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. బాలికను కరాటే జాతీయ ఉపాధ్యక్షుడు పాపయ్య, రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు సమ్మయ్య అభినందించారు. -
మావోయిస్టు పార్టీతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
కరీంనగర్‌క్రైం: మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభలు అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల విధ్వంసానికి, ఇటుక బట్టీలలో ఒరిస్సా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ పోరాటాలు నిర్వహించిందన్నారు. సంఘం నాయకులు కామ్రేడ్ గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, అజాం ఆలీ, డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్ అక్రమ హత్యలు మొదలు జగిత్యాల జిల్లా రేచపల్లికి చెందిన పోగుల రాజేశంను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అతడి కూతురును అల్లుడు హత్య చేస్తే కూతురు చివరి చూపునకు నోచుకోకుండా హింసించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, కగార్ పేరుతో ఆదివాసీలను, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని, ఛత్తీస్‌గఢ్‌లో సైనిక క్యాంపులను ఎత్తివేయాలని తదితర అంవాలపై తీర్మాణాలు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్చందర్, ప్రధాన కార్యదర్శి పాణి, ముడిమడుగుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంకూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పుల్ల సుచరిత, నారా వినోద్, కార్యదర్శిగా బొడ్డుపల్లి రవి, సహాయ కార్యదర్శులుగా గడ్డం సంజీవ్, రెడ్డిరాజుల సంపత్, కోశాధికారిగా మాదవనేని పర్వతాలును ఎన్నుకున్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క నారాయణరావు -
నిద్ర.. గురుక.. గుండెపోటు!
నగరవాసుల్లో ఎక్కువగా.. నగరవాసుల్లో చాలామందిని గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఊబకాయం, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (వోఎస్ఏ) అనేది గురకకు కారణమవుతోంది. కండరాలతో నిర్మాణం అయిన ఊపిరి గొట్టంలో నిద్రపోయే సమయంలో కలిగే ఆటంకంతో ఆ శబ్దం వస్తుంది. ఇలా వచ్చే శబ్దాన్నే గురక అంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి గురక రాదు. గురక ఉన్నవారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో తరచూ నిద్రలోంచి మేల్కొంటారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి.. నిద్రలోనే హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలిసొమ్నోగ్రఫీతో పరీక్ష స్లీప్ అప్నీయాతో బాధపడే వారికి స్లీప్ స్టడీస్ (పాలిసొమ్నోగ్రఫీ) పరీక్ష అవసరమవుతుంది. గురకతో బాధపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని శరీర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. ఇందులో మెదడు పనితీరు తెలుసుకునేందుకు ఎలక్ట్రోఎన్సెపలోగ్రఫీ (ఈఈజీ), గుండె పనితీరు కోసం ఎలక్ట్రోకార్డియోగ్రఫీ (ఈసీజీ) కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్ తదితర పరికరాలను శరీరానికి అనుసంధానించి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో లేదో అని పరీక్షిస్తారు. జనాభాలో 10 శాతం మందికి గురక సమస్యతో ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతీరోజు 150మందికి పైగా అంటే నెలకు సుమారు 5,000 మంది గురక సమస్యతో ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇందులో 200 మందికి పైగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పరీక్ష చేయించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యగా బాధపడే వారు 2,000 మంది వరకు ఉంటారని వైద్యుల అంచనా.కరీంనగర్‌టౌన్: పొద్దంతా కష్టపడి పనిచేసి, రాత్రిపూట కడుపు నిండా భుజించి ప్రశాంతంగా నిద్రపోతే.. అర్ధరాత్రి ఎక్కడో గుర్ర్..గుర్ర్మంటూ వస్తోన్న శబ్దం చికాకు తెప్పిస్తుంది. గాఢనిద్రలో ఉన్నవారిని ఉలిక్కి పడేలా చేస్తుంది. పక్కన పడుకుంటే చెవుల్లో సప్తస్వరాలు మోగినట్లు వినిపించే గురక శబ్దం మంచి నిద్రను దూరం చేస్తుంది. గురకపెట్టేవారి పక్కన పడుకునే వారి కష్టాలు ఇవైతే.. గుర్ర్.. గుర్ర్మంటూ సోయిలేకుండా పడుకునేవారు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. అకస్మాత్తుగా హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది రాత్రిపూట గురక పెట్టేవారు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.లక్షణాలు ఇవీ నిద్రలో ఐదుకన్నా ఎక్కువసార్లు శ్వాస ఆగిపోయినట్లు అనిపించి మెలకువ రావడం నిద్రపోయినా ఉదయం లేవగానే నిద్రలేమి ఉన్నట్లు అనిపించడం రాత్రి పూట ఛాతీలో నొప్పి.. నిద్రలేవగానే గొంతులో నొప్పి నిద్రలేవగానే తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారిని గురక బాధితులుగా గుర్తిస్తారు. జాగ్రత్తలు ఊబకాయంతో బాధపడుతుండే వారి బరువును తగ్గించుకోవడం ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లను మానుకోవడం బీపీ, షుగర్, థైరాయిండ్ నార్మల్‌గా ఉంచుకోవడం ప్రతీరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి.జీవనశైలిలో మార్పులతో.. గురకను తగ్గించుకోవాలంటే చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మద్య, ధూమపానాల వాడకాన్ని తగ్గించుకోవడం. షుగర్, బీపీ, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల గురక సమస్యకు మెరుగైన ఫలితం ఉంటుంది. నిద్రతో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలో వచ్చే చిన్నచిన్న సమస్యలకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యం చేయించుకోవాలి. – వినయ్‌కుమార్, పల్మనాలజిస్టు -
ఓసీపీ–1.. సింగరేణిలో నంబర్–1
గోదావరిఖని: అత్యుత్తమ పనితీరు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రమాదాల నియంత్రణ.. పర్యావరణ పరిరక్షణ.. వెరసి రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించింది సింగరేణి ఓసీపీ–1 గని. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. అన్నింటా అగ్రగామిగా నిలిచి రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈమేరకు కోల్మినిస్ట్రీ నుంచి బుధవారం సమాచారం అందింది. స్వీయ మూల్యాకనం.. బొగ్గు, లిగ్నైట్ గనుల పనితీరును స్వీయ మూల్యాంకనం చేయడం, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ద్వారా స్టార్ రేటింగ్ విధానం 2019 ఏప్రిల్ 1 నుంచి కొనసాగుతోంది. అత్యుత్తమ విధివిధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉత్తమ రక్షణ తీరు అవలంబిస్తున్న ఓసీపీ–1కు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈఫైవ్స్టార్ రేటింగ్ ఇస్తోంది. ప్రాజెక్టు ఆర్ధిక పనితీరు, ఉద్యోగి సంక్షేమం, రక్షణ, ఉద్యోగ భద్రత వంటి ప్రమాణాల్లో ప్రాజెక్టు రెండోసారి ఉత్తమ పనితీరు కనబరిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కోల్కంట్రోలర్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్, కోల్మినిస్ట్రీ కార్యాలయం ప్రకటించిన జాబితాలో ప్రాజెక్టుకు చోటు లభించింది. సింగరేణిలోని అన్ని గనులు, ఓసీపీల్లో ఓసీపీ–వన్ 92పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కూడా 91పాయింట్లు సాధించి ఫైవ్‌స్టార్ రేటింగ్ పొందింది. త్వరలో కేంద్ర బొగ్గుగనుల శాఖ ద్వారా ఈ అవార్డు అందుకోనుంది. ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధనలో కృషి చేసిన ఓసీపీ–1 ఉద్యోగులు, అధికారులను ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావు అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానంలో భేష్ ఉపరితల గనికి వరుసగా రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇదేస్ఫూర్తి ప్రదర్శించాలి సింగరేణిలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ రావడం సంతోషంగా ఉంది. సమష్టి కృషి ఫలితంగానే బహుమతి అందుకోబోతున్నాం. భవిష్యత్‌లోనూ ఇదేస్ఫూర్తితో ముందుకు సాగాలి. కంపెనీకి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో ప్రతీఒక్కరు కృషి చేయాలి. – రాజశేఖర్, ప్రాజెక్టు అధికారి -
తాత ఉన్నాడా.. అంటూ బంగారం చోరీ
జమ్మికుంట: తాత ఉన్నాడా అంటూ మాటలు కలిపిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన ఇంజమూరి వెంకటలక్ష్మి ఇంటిముందుకు బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి తాతా ఉన్నాడా అంటూ ఆమె మెడలోని తులం బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కొడుకు వెంకటసత్యనారాయణస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. వివాహిత ఆత్మహత్యకోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళ్లపల్లికి చెందిన సాసాల లక్ష్మి(50)కి ఇటీవల రెండు సార్లు కిడ్నీలో రాళ్ల కోసం ఆపరేషన్లు జరిగాయి. బుధవారం చిన్న కోడలు సీమంతం గంభీరావుపేటలో జరుగగా కుటుంబసభ్యులు వెళ్లారు. లక్ష్మి మల్లారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి భర్త అంజయ్య, కుమారులు మహేశ్, బ్రహ్మానందం, కూతురు జ్యోతి ఉన్నారు. వేములవాడ ఎస్సై మారుతి కేసు విచారణ చేపడుతున్నారు. పుష్కరాల్లో ఆర్టీసీ సిబ్బంది కోసం వైద్య శిబిరంవిద్యానగర్(కరీంనగర్): సరస్వతీ పుష్కరాల విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈవైద్య శిబిరం ఈనెల 15 నుంచి 26 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆర్థికసాయం శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వేముల చంద్రబాగ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆమె కుమారుడు శ్రీనివాస్‌కు 2004–05 ఎస్సెస్సీ స్నేహితులు వెంకటేశ్, సద్దాం, సంతోష్ రూ.11వేలు అందించారు. -
అటు పుష్కరాలు.. ఇటు పనులు
మంథని: పన్నెండేళ్లకోసా నిర్వహించే సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరివస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారికి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది కానీ.. అఽధికారుల ముందుచూపు లేమి, కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భక్తులకు అవస్థలు తప్పేలాలేవు. ఇప్పుడే వంతెన మరమ్మతులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మంథని మండలం) అడవిసోమన్‌పల్లి వంతెన అప్పటిసీఎం పీవీ నరసంహారావు హయాంలో నిర్మించారు. దాని సామర్థ్యాన్ని మించి వాహనాలు రాకపోకలు సాగించడం, పురాత వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. దాని మరమ్మతులకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. సుమారు నెలరోజులుగా మరమ్మతులు కొనసా..గుతున్నాయి. దానిపై పగుళ్లు చూపాయి. పెద్దగుంతలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంతోపాటు పాత నిర్మాణాన్ని తొలగించి సిమెంట్, కాంక్రీట్‌తో పనులు చేస్తున్నారు. ఒకవైపు వాహనాలకు అనుమతి ఇచ్చి మరోవైపు పనులు చేస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వంతెన మీదుగా వాహనాలు నడుస్తున్నాయి. అంతేగాకుండా బొగ్గు లారీలు, ఇతర భారీ వాహనాలు సైతం పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం ఏర్పడుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరువైపులా ఉన్న మానేరుతో ప్రమాదం ఏర్పడుతుంది. వాహనాలకు అంతరాయం ఒకేవైపు వాహనాల రాకపోకలతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాధారణ రోజుల్లో ఈపరిస్థితి ఉంటే.. పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు విస్తరణ.. అభివృద్ధి మల్హర్ మండలం కొయ్యూర్ నుంచి కాటారం మండలం దన్వాడ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. సరస్వతీ పుష్కరాల తేదీలు ఏడాది ముందుగానే ప్రకటించారు. మంథని– కాటారం మధ్య విస్తరణ, అభివృద్ధి, సరిహద్దు వంతెన మరమ్మతులు ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా నత్తనడకన సాగుతుండడంతో పుష్కరాల వేళ భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సరస్వతీ పుష్కరాల వేళ.. అధికారుల ముందుచూపు లేమి మంథని–కాటారం మధ్య సాగుతున్న అభివృద్ధి పనులు రెండు జిల్లాల సరిహద్దు వంతెనకు మరమ్మతులు ట్రాఫిక్‌కు అంతరాయం.. అసౌకర్యానికి గురవుతున్న వాహనదారులు అసౌకర్యం కలగకుండా చర్యలు మంథని మండలం అడవిసోమన్‌పల్లి వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులతో వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. పనులను పర్యవేక్షిస్తూ వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనదారులు సహకరించాలి. –జఫార్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని -
రాజన్న హుండీ ఆదాయం రూ.1.65 కోట్లు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామికి హుండీలలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.1,65,84,607 నగదు సమకూరింది. దాదాపు 20 రోజుల తర్వాత హుండీలను లెక్కించగా రూ.1.65 కోట్లతోపాటు 204 గ్రాముల బంగారం, 13.200 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య బుధవారం హుండీని లెక్కించారు. కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి సత్యనారాయణ, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
నిరంతరం తాగునీరు
● రామగుండం నగరంలో ప్రతీరోజు తాగునీరు అందిస్తున్నాం ● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రోజువిడిచి రోజు సరఫరా చేస్తున్నాం ● మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అరుణశ్రీ తెలిపారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా లీకేజీలు, నీటివనరుల లభ్యత, సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. -
ప్రశాంతంగా పాలిసెట్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మంగళవారం చేపట్టిన పాలిసెట్ ప్రశాంతంగా జరిగింది. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని కో ఆర్డినేటర్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. మొత్తం 2,488 మంది(1,336 మంది బాలురు, 1,152మంది బాలికలు) పరీక్షల కు హాజరుకావాల్సి ఉండగా 2,366 మంది (1,275మంది బాలురు, 1,091మంది బాలికలు) హాజరయ్యారన్నారు. పెద్దపల్లిలో ఏ ర్పాటు చేసిన ఆరు పరీక్ష కేంద్రాల వద్ద పో లీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు ప్రత్యేక బస్సులుపెద్దపల్లిరూరల్: కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పు ష్కరాలకు కరీంనగర్ రీజియన్‌లోని కరీంనగర్, గోదావరిఖని, మంథని నుంచి 50 ప్ర త్యేక బస్సులను నడపనున్నట్లు రీజినల్ మే నేజర్ రాజు తెలిపారు. కరీంనగర్ నుంచి 30 బస్సులు, గోదావరిఖని, మంథని నుంచి 10 బస్సుల చొప్పున నడుపుతున్నట్లు పే ర్కొన్నారు. గోదావరిఖని నుంచి పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.80 చార్జీ వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంథని నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.70, కరీంనగర్ నుంచి పెద్దలకు రూ.280, పిల్లలకు రూ.140 వసూలు చేయనున్నట్లు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ‘కేంద్రీయ’లో ప్రవేశాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శోభన్‌బాబు తెలిపారు. ఈనెల 16 నుంచి స్వీకరిస్తామన్నారు. సైన్స్, కామ ర్స్ గ్రూపుల కోసం ఈనెల 24వ తేదీలోగా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. -
ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్‌వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మణిదీప్‌పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్ఐ మోహన్, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. వడదెబ్బతో ఒకరి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
మధుకర్‌ను స్వదేశానికి రప్పించండి
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇతరులకు బ్యాంక్ ఖాతా ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన మల్లాపూర్ మధుకర్‌ను స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు మధుకర్ (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. దీంతో అజ్మాన్‌లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. విషయం తెలుసుకున్న మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
పారమిత విద్యార్థుల ప్రతిభ
ఎన్టీపీసీ కేవీలో వందశాతం ఉత్తీర్ణత ‘సీబీఎస్ఈ’ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనంమానేరు విజయకేతనం జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(సీబీఎస్ఈ)లో ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు విజయదుందుబి మోగించారు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పదో తరగతి, 12వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. పదో తరగతిలో 67 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. ఓం సాహూ(484/500), 12వ తరగతిలో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యా రు. సైన్స్ విభాగంలో పెండ్యాల ఆగస్త్యశర్మ (398/500), కుడితేటి ప్రద్యుమ్నరావు (396/ 500), కామర్స్ విభాగంలో హ్రిశికేశ్ (44 1/500) మార్కులు సాధించారు. దీంతో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు, ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, నామిని చైర్మన్ బిజయ్‌కుమార్ సిగ్దర్, ప్రిన్సిపాల్ ఓరుగంటి శోభన్‌బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. చొప్పదండి నవోదయ ప్రభంజనం చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయం 2024–25 పదోతరగతి, పన్నెండో తరగతి సీబీ ఎస్ఈ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. పన్నెండో తరగతిలో 500మార్కులకు 483మార్కులు సాధించి పి.రుత్విక్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. పదోతరగతిలో వి.వశిష్ట యాదవ్ 500 మార్కులకు 480 మార్కులు సాధించారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మంగతాయారు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్‌లోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించినట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. పదో తరగతిలో 500మార్కులకు గాను మహమ్మద్ షాజ్నీన్ తబాసుమ్ జాతీయస్థాయిలో 99.4శాతంతో 497మార్కులతో జిల్లాస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఎం.సుచీత్రెడ్డి 493 మార్కులు, జె.సుప్రభ 492, ఆర్.వేదిక, టి.హర్షిణి 491, డి.హర్షిత్489, బి.ఆకృతి, సీహెచ్.అనీశ్‌కుమార్, రయానుద్దీన్ 488, ఏ.నక్షత్ర, పి.శ్రీవర్షిత, కె.నక్షత్రరెడ్డి 486మార్కులు సాధించారని పేర్కొన్నారు. 12వ తరగతిలో 500 మార్కులకు గాను వి.సంజీతరెడ్డి 482మార్కులు, ఎన్.అనిరుద్ సాయి 482, వి.శశాంక్‌రెడ్డి 478, జె.వమీకా 473 మార్కులు సాధించారని తెలిపారు. 10వ తరగతిలో అత్యధికసంఖ్యలో విద్యార్థులు 90శాతం మార్కులు సాధించారని, 12వ తరగతిలో 13మంది 90శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో పారమిత హెరిటే జ్, వరల్డ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీకర్, పి.గోపికృష్ణ తెలిపారు. 500మార్కులకు గాను ఆకుల శ్రీరామచంద్ర 488 మార్కులు, రూపనిగమ, మనోజ్ఞలు 487, స్ఫూర్తి 481, బి.వర్షిణి480మార్కులు సాధించినట్లు తెలిపా రు. పాఠశాలకు చెందిన 62మంది 90శాతం పైన మార్కులు సాధించగా 80 నుంచి 100శా తం సాధించిన విద్యార్థులు 160మంది ఉన్నారని అన్నారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత ఈ.ప్రసాద్‌రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్‌రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, వినోద్‌రావు, వీయూఎం.ప్రసాద్, టీఎస్వీ.రమణ, హన్మంతరావు, రవీంద్ర పాత్రో, నాగరాజు అభినందించారు.సప్తగిరికాలనీ(కరీంనగర్): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాల నుంచి మొత్తం 98మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. పలువురు విద్యార్థులు తెలుగులో 100 మార్కులు, ఇంగ్లిష్‌లో 98మార్కులు, హిందీలో 97మార్కులు, సైన్స్, సోషల్‌లో 96మార్కులు, గణితంలో 95 మార్కులు సాధించారని అన్నారు. 500 మార్కులకు పాఠశాలకు చెందిన ఏ.ఆత్రేయ 471మార్కులు, మస్రా మహావీన్ 461, ఏ.అరవింద్‌రెడ్డి 458, ఏ.శరత్ చంద్ర 456మార్కులు సాధించి టాపర్లుగా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతరెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డి అభినందించారు. పది, పన్నెండో తరగతి విద్యార్థుల సత్తా -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
లగ్గం.. షరతుల పగ్గం!
హుజూరాబాద్: గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండుమూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. 30ఏళ్లు దాటినా పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది. గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి స్వేచ్ఛగా ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు.. వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. పట్టింపులతో సమస్య.. అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. తర్వాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. భిన్నమైన పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయికి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే కట్నం ఎంతయినా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. దీంతో చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటినా సంబంధాలు దొరకడం లేదు. మానసిక సమస్యలు పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. -
5 లోగా దరఖాస్తు చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫస్టియర్ డిప్లొమా కోర్సులో చేరేందుకు ఆసక్తి, అర్హత గలవారు జూన్ 5లోగా దరఖాస్తు చేసు కోవాలని చేనేత, జౌళిశాఖ డెప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 17 నుంచి 25 ఏళ్లలోపు వ యసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు కరీంనగర్‌లోని చేనేత, జౌళిశాఖ ఆఫీసులో దరఖాస్తు సమర్పించాలని కోరారు. సరస్వతీ పుష్కరాల ఉత్సవ కమిటీ నియామకంమంథని: త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు దేవాదాయ శాఖ 14 మంది స భ్యులతో ఉత్సవ కమిటీని మంగళవారం నియమించింది. కమిటీలో మంథనికి చెందిన మో హన్శర్మ అవధాని, సీతారాంశర్మతోపాటు 14 మందిని నియమించింది. కాగా ఉత్సవ కమిటీ చైర్మన్‌గా మోహన్‌శర్మ పేరు దాదాపుగా ఖరా రైంది. సభ్యులంతా మోహన్‌శర్మను ప్రకటించడమే మిగిలింది. కాగా 2015లో జరిగిన గోదా వరి పుష్కరాల్లో సైతం మోహన్‌శర్మ ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. గోదావరి పుష్కరాల సమయంలో సమర్థవంతంగా సేవలందించినందుకు గాను మరోమారు సరస్వతీ పుష్కరాలకు ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ మృతి గోదావరిఖని: ఒంటిపై పెట్రోల్పోసుకొని సోమవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముత్తునూరి శ్రీనివాస్(38) మంగళవారం మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి 60శాతం కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈక్రమంలో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. పేపర్‌ప్లేట్ల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం పెద్దపల్లిరూరల్: పట్టణంలోని ఎన్ఎస్ పేపర్‌ప్లేట్ల తయారీ కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు వ్యా పించడంతో అప్రమత్తమై స్థానికులతో కలిసి మంటలను అదుపు చేస్తూనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ల క్ష్మణ్రావుతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలుధర్మపురి: ప్రమాదవశాత్తు లారీ బోల్తాపడి డ్రై వర్, క్లీనర్‌కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం జరి గింది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. -
ప్రాణాలు కాపాడేదెలా?
సాక్షి, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉద్దేశించిన ట్రామాకేర్ కేంద్రాలు ప్రతిపాదనదశ వీడడం లేదు. కేంద్రప్రభుత్వం 2012లో ట్రామాకేర్ వైద్యసేవలు ప్రారంభించినా.. జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించి ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉండడంతో గాయపడినవారిని సమీపంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చాలా సందర్భాల్లో సత్వర వైద్య సేవలు అందక గాయపడినవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన తొలిగంట(గోల్డెన్ అవర్)లో సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తి బతికే అవకాశాలు ఉన్నాయి. తాజా గా రాష్ట్రప్రభుత్వం 90 వరకు ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ట్రామా వస్తే.. ఎంతోమేలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, రహదారులపై ప్రమాదాలు జరిగినా, ఇంట్లో జారీపడినా, భవనాలు కూలీ తీవ్రంగా గాయపడినా బాధితులకు సత్వరమే అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి ట్రామాకేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాధితుల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా రహదారుల చెంతనే వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్దేశించింది. ట్రామాకేర్ సెంటర్ల ద్వారా ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, అనెస్తీషియా, ఎంబీబీఎస్, ఎక్స్‌రే, అంబులెన్స్, డ్రైవర్, సహాయకులు మందులు, అత్యవసర ఆపరేషన్ ఽథియేటర్, ఐసీయూ తదితర అన్నిరకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా రెఫరల్ కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది. చొరవ తీసుకుంటే జిల్లాలో ట్రాామా సెంటర్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా డిమాండ్ వస్తోంది. జిల్లాలో ట్రామా సెంటర్ ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ చూపితే స్థానికంగా ఎంతోమందికి అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చి ప్రాణాలు దక్కుతాయి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు ప్రతిపాదనలు దాటని ట్రామాకేర్ సెంటర్ సత్వర వైద్యం అందక పోతున్న ప్రాణాలు స్థానిక నేతలు చొరవ చూపాలని డిమాండ్ ప్రతిపాదన దశల్లోనే.. జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే అంశం ప్రతిపాదన దశలోనే ఉంది. ఇప్పటివరకు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదు. ప్రభత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. సెంటర్ ఏర్పాటు అయితే, రహదారి ప్రమాద బాధితులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్రీధర్, డీసీహెచ్‌వో -
సమస్యలు సత్వరం పరిష్కరించండి
● ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ‘పెద్దపల్లి శివారు చందపల్లిలో ప్రభుత్వం కేటాయించిన వందగజాల స్థలంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించాలని శాంతినగర్‌కు చెందిన రాజమణి కలెక్టర్‌ను వేడుకుంది..’ ఇలా.. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ వేణుకు వినతులు అందించి పరిష్కారం చూపాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలపై స్వీకరించిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్‌లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్‌కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్‌హెచ్‌వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్‌లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్‌కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
బుద్ధుని బోధనలు అనుసరణీయం
ఎలిగేడు/జూలపల్లి: గౌతమ బుద్ధుని బోధనలు మానవాళికి అనుసరణీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఎలిగేడు మండలం ధూళికట్ట, జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామాల పరిధిలోని బౌద్ధ స్తూపం వద్ద బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పంచశీల జెండా ఎగురవేసి మాట్లాడారు. మనిషి తన కోరికలను తగ్గిస్తేనే శాంతి, సౌభ్రాతృత్వం, ప్రకృతి, మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. బుద్ధుని పంచశీలాలు, అష్టాంగామార్గాలు, దశపారమితలు ఆచరిస్తేనే ప్రపంచశాంతి ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. ధూళికట్ట, వడుకాపూర్ నుంచి బౌద్ధ స్తూపం వద్దకు వచ్చేందుకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, బుద్ధ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేవ శ్రీనివాస్ తన మరణానంతరం సదాశయ ఫౌండేషన్ ద్వారా అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాన్ని ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బాలుసాని పరుశరాములుగౌడ్, మొగురం రమేశ్, నాగభూమి బుద్ధ విహార్ గౌరవ సలహాదారు పుల్లయ్య కాంబ్లే, విండో డైరెక్టర్ పోల్సాని పుల్లారావు, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు భీష్మాచారి, ఆకుల మహేందర్, కోండ్ర సంతూ, పాటకుల భూమయ్య, మానుమండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే విజయరమణారావు -
నర్సింగ్ సేవలు వెలకట్టలేనివి
కోల్‌సిటీ(రామగుండం): నర్సింగ్ ఆఫీసర్లు అందించే సేవలు వెలకట్టలేనివని రామగుండం సిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబింద్‌సింగ్ కొనియాడారు. సోమవారం గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో అంతర్జాతీయ నర్సింగ్ ఆఫీసర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ స్ఫూర్తితో సేవలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఆఫీసర్లను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కేక్‌ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కాగా, గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ ఆఫీసర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల ఆ టాపాటలు ఆకట్టుకున్నాయి. ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి వైస్ ప్రిన్సిపాల్ సుశీల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడా పోటీలు, ఉపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. -
సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలి
జూలపల్లి(పెద్దపల్లి): సమాజంలో శాంతి, స్నేహభావం పెంచేందుకు మనకు వారసత్వంగా వస్తున్న సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని చిన్మయ మిషన్ స్వామిజీ శ్రీ సాక్షిరూపానందస్వామి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుమ్మరికుంట శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అనంతరం జూలపల్లిలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి భక్తులకు భగవద్గీత ప్రవచనాలు వినిపించారు. భగవద్గీత ప్రవచనం వారం రోజులు సాయంత్రం వేళ ఉంటుందని ఆలయ పునర్నిర్మాణ దాత నల్ల మనోహర్‌రెడ్డి వివరించారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు పోట్టాల మల్లేశం, కొప్పుల మహేశ్, వెంకటరమణ, ప్రదీప్‌కుమార్, మెండె మల్లేశం, నొముల గోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, అర్చకులు ఉద్దండ నవీన్, భక్తులు పాల్గొన్నారు. -
ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు నైటింగేల్
జ్యోతినగర్(రామగుండం): ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ అని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైటింగేల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సులు ఏ ఆసుపత్రికై నా వెన్నెముక అని, వైద్యులు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు రోగిని పరిశీలిస్తారని, కానీ నర్సులు రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు శ్రద్ధ తీసుకుంటారని వారి సేవలను కొనియాడారు. అనంతరం నర్సులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. -
ఎల్ఐజీ క్వార్టర్లు స్వాధీనం చేసుకోవాలి
పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్‌లో మున్సిపాలిటీకి చెందిన ఎల్ఐజీ 9 క్వార్టర్లు ప్రభుత్వానివే అని లోకాయుక్త నిర్ధారించింది. వాటిని స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినా ముందుకు రావడం లేదు. చొరవచూపి ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి. – ఠాకూర్ హన్మాన్‌సింగ్, న్యాయవాది, పెద్దపల్లిరైతులను ఆదుకోవాలి అకాల వర్షాలతో నష్టపోయి న రైతులకు ప్రభుత్వం పరి హారం అందించి ఆదుకోవాలి. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – సీపీఎం నాయకులు, పెద్దపల్లి మండలం -
ఇంకెప్పుడు మారును
మా బతుకులుగోదావరిఖని(రామగుండం): ‘మారుపేర్ల వారసుల నియామకాలకు ఓకే.. దీనిపై కమిటీ వేసి వాస్తవాలు పరిశీలించి సమస్యను పరిష్కరించుకుందాం. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేద్దాం’ అని స్వయంగా సింగరేణి సీఎండీ హామీ ఇచ్చారు. కాగా, హామీ ఇచ్చి రెండునెలలు గడిచింది. ఉద్యోగాల కోసం పోరాడిన వారిలో ఇద్దరు యువకులు జీవితానికి దూరమయ్యారు. ఇంకా ఎంత మంది పోయాక ఉద్యోగాలొస్తాయని మారుపేర్ల వారసులు ఆవేదన చెందుతున్నారు. విజిలెన్స్ విచారణ, వయస్సు సరిగా లేదని తదితర కారణాలతో పెండింగ్‌లో పెట్టిన మారుపేర్ల వారసులకు ఇప్పటికీ ఉద్యోగాలు లభించలేదు. సంస్థ వ్యాప్తంగా సుమారు 1,200 మంది బాధితులు ఉన్నారు. యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సమస్యను పరిష్కరించాల్సి ఉండగా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. సంస్థ సీఎండీ ఈఅంశంపై దృష్టి సారించి త్వరగా ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నారు. విజిలెన్స్ విచారణ పేరిట.. నాలుగు దశాబ్దాల పాటు సింగరేణిలో పని చేయించుకున్న యాజమాన్యం అప్పుడు లేని సమస్యను వారి పిల్లలకు ఉద్యోగాలివ్వడంలో మాత్రం చూపిస్తోందని బాధితులు వాపోతున్నారు. ఊర్లో ఒకపేరు, పని వద్ద మరో పేరు ఉందనే సాకుతో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో చాలామంది కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు, యూనియన్ల నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేసి వేడుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. విజిలెన్స్ విచారణ పేరుతో చాలా మంది డిపెండెంట్ల ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం, గుర్తింపు, ప్రాతినిధ్య, జాతీయ సంఘాలు సానుకూల ధోరణితో వ్యవహరించి తమ సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. డిపెండెంట్లకు వయోపరిమితి 40 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో అందరికీ అవకాశం కల్పించాలంటున్నారు. ఈనెల 16న ధర్నా మారుపేర్ల వారసుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ ఈనెల 16న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు మారుపేర్ల డిపెండెంట్ల సంఘం నాయకుడు శ్రావణ్ పేర్కొన్నారు. ధర్నా తర్వాత యాజమాన్యం తీరులో మార్పు రాకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. సింగరేణిలో కార్యరూపం దాల్చని మారుపేర్ల వారసుల సమస్య కమిటీల పేరుతో కాలయాపన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకుసాగని వైనంఫొటోలోని వ్యక్తి వేముల ప్రదీప్. ఊరు హుజూరాబాద్ మండలం ఆముదాలపల్లి. ఇతడి తండ్రి వేముల మల్లయ్య రామగుండం రీజియన్ జీడీకే 10ఏ గనిలో పనిచేసి 2016లో మెడికల్ అన్‌ఫిట్ అయ్యాడు. దీంతో ప్రదీప్ పదేళ్లుగా తండ్రి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. ప్రస్తుతం గోదావరిఖనిలో కూలీ పనులకు వెళ్తున్నాడు. యాజమాన్యం స్పందించి ఇప్పటికై నా ఉద్యోగం ఇచ్చి తన బతుకును నిలబెట్టాలని కోరుతున్నాడుశ్రీ.. ఇలా ఇతనొక్కడే కాదు.. సింగరేణి వ్యాప్తంగా చాలా మంది కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. -
డిప్యూటీ సీఎంను కలుస్తాం
విజిలెన్స్ అధికారులను కలిశాం. సంస్థ సీఎండీతో చర్చించాం. యాజమాన్యం సానుకూలంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా డిప్యూటీ సీఎంను కలిసి విజిలెన్స్ పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేసేలా చూస్తాం. నెలరోజుల్లో పరిష్కారం లభించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. – జనక్‌ప్రసాద్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ అడ్వకేట్ జనరల్‌కు పంపాం మారుపేర్ల సమస్యపై న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్‌కు పంపాం. న్యాయ ప్రక్రియ క్లియరెన్స్ తర్వాత మారుపేర్ల ఉద్యోగాలకు ముందుకెళ్తాం. ఈనెల 20న సమ్మె తర్వాత మారుపేర్ల ఉద్యోగ ప్రక్రియ వేగవంతం చేసేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. – కొరివి రాజ్‌కుమార్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి దశలవారీగా పరిష్కారం మార్చి చివరి వారంలో జరిగిన సమావేశంలో విజిలెన్స్ పెండింగ్ కేసులపై కమిటీ వేసి పరిష్కరించుకునేందుకు నిర్ణయానికి వచ్చాం. దశలవారీగా సమస్యలను బట్టి ఉద్యోగాలిచ్చే ప్రక్రియ ప్రారంభిస్తాం. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో భేటి అయి సమస్యను పరిష్కరిస్తాం. – ఎన్.బలరాం, సంస్థ సీఎండీ -
ఏఎన్ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు
సేవామూర్తులుఅనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో దేవదూతల్లా నర్సింగ్ ఆఫీసర్లు సకల సేవలందిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – కరీంనగర్‌టౌన్/కోల్‌సిటీ మదర్ థెరిసాను రోల్డ్ మోడల్‌గా తీసుకున్నా. వైద్య సేవలపై ఆసక్తితో ఏఎన్ఎం స్థాయి నుంచి నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ హోదా వరకు చేరుకున్నాను. ఇంటర్ చదివే వయసులోనే ఏఎన్ఎమ్గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్ఫూర్తితో జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ తోపాటు సైకాలజీ, పీడియాట్రిక్, ఏంఎస్డబ్ల్యూ కోర్సులు చదివాను. పేషెంట్లకు ఎదురుపడిన నర్సింగ్ ఆఫీసర్లు చక్కని చిరునవ్వుతో పలకరించి వైద్యం అందించాలని దృక్పథం నాలో బలంగా నాటుకుంది. అందుకే 2013 నుంచి 2022 వరకు స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నకాలంలో డిప్యూటేషన్‌పై కరీంనగర్ నర్సింగ్ స్కూల్లో ట్యూటర్‌గా పాఠాలు బోధించాను. 2022లో పదోన్నతిపై సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశా. గతేడాది అక్టోబర్ 30న రామగుండం నర్సింగ్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రోగులకు వైద్యం అందించడంలో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కీలకమైనవి. – సుశీల, వైస్ ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, గోదావరిఖని – వివరాలు 8లో -
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన బార్ అసోసియేషన్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం జ్యోతిభవన్‌లో బస చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్‌ను ఆదివారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శారదానగర్‌లో నిర్మిస్తున్న నూతన కోర్టు భవనాలకు నిధులు కేటాయించి త్వరగా పూర్తయ్యేలా చొరవచూపాలని విన్నవించారు. చీఫ్ జస్టిస్ సానుకూలంగా స్పందించారు. చీఫ్ జస్టిస్‌ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, జాయింట్ సెక్రటరీ ముచ్చకుర్తి కుమార్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రేరేపిత సమ్మెను వ్యతిరేకించాలి గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికులు ఈనెల 20న జరిగే రాజకీయ ప్రేరేపిత సమ్మెను వ్యతిరేకించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో మాట్లాడారు. కార్మిక సంఘాలు రాజకీయ ఎజెండాను అమలు చేసేందుకు, తమ ఉనికి చాటుకోవడానికి సమ్మెకు పిలుపునిచ్చాయని, దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రజలకు, ప్రభుత్వాలకు, రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన రాజకీయ పార్టీలు సమ్మె చేయడం సరికాదన్నారు. కార్మికుల సంక్షేమం, రక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనం లేని సమ్మెలో పాల్గొని నష్టపోవద్దన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభ సమయంలో సమ్మెకు పిలుపునివ్వడం దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందన్నారు. సమావేశంలో నాయకులు సారంగాపాణి, కర్రావుల మహేశ్, ఆకుల హరిణ్, సాయవేణి సతీశ్, మేడ రామ్మూర్తి, పెంచాల వెంకటస్వామి, తుమ్మ గట్టయ్య, పుప్పాల నాగేంద్రప్రసాద్, సల్ల వేణు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీఓదెల(పెద్దపల్లి): కాజీపేట్– బల్లార్షా సెక్షన్ల మధ్యలోని కొలనూర్, ఓదెల, పొత్కపల్లి రైల్వేస్టేషన్లలో ఆదివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం సీసీ అంబర్‌కిషోర్ జా, డీసీసీ కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పొత్కపల్లి ఎస్సై రమేశ్, బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, రైల్వేస్టేషన్లో, రోడ్లపైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
ప్రతి గింజను కొంటాం
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను కొంటామని ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో ధాన్యం కొట్టుకుపోయిందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం మార్కెట్‌యార్డును చైర్పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ చైర్మన్ జడల సురేందర్, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి తదితర నేతలతో సదర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం రంగుమారకుండా, గింజ విరగకుండా ఉండేందుకు వీలుగా ఉప్పు నీరు చల్లాలని రైతులకు సూచించారు. ఉప్పు తెప్పించి నీళ్లలో కలిపి చల్లించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో గింజ కోత లేకుండా కొనుగోలు చేస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రైతుల కోట్లాది రూపాయల శ్రమను దోచుకున్నారని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నరకం ధాన్యానికి రూ.500బోనస్ చెల్లించి అండగా నిలిచిందన్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, ఎడ్ల మహేందర్, ఉప్పురాజు, మసూద్ తదితరులున్నారు. -
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి భా రీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షం కష్టాలను తెచ్చి పెట్టింది. మార్కెట్ యార్డు ఆవరణ, పలు ప్రాంతాల్లో చెట్లు నేలవాలాయి. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోనే దాదాపు 20 చెట్లు నేల వాలాయని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తెలిపారు. కాగా, నేలవాలిన చెట్లను తొలగించే పనులు ఆదివారం చేపట్టారు. నీడపట్టున ఉంటుందనుకుంటే.. పెద్దపల్లి మార్కెట్ యార్డులో పత్తి వ్యాపారి బంధువుకు చెందిన కారును నీడ పట్టున ఉంటుందని భావించి శనివారం మధ్యాహ్నం పార్కింగ్ చేశాడు. రాత్రి ఈదురుగాలులకు చెట్టు కారుపై పడగా, ధ్వంసమైంది. పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోనూ కారుపై చెట్టు పడి కారు దెబ్బ తింది. భారీ వానకు మార్కెట్లో ధాన్యం తడిసింది. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు తంటాలుపడ్డారు. గాలివాన వచ్చి.. కష్టాలను తెచ్చి.. -
అమ్మే అన్నీ తానై..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన తల్లి నూర్జహాన్. ఐదుగురు కుమారుల్లో గౌష్ ఆలం చిన్నవాడు. ఆయన సోదరుల్లో ఇద్దరు మర్చంట్ నేవీలో, ఒకరు పరిశోధనా శాస్త్రవేత్తగా, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్‌గా స్థిరపడ్డారు. తండ్రి సయ్యద్ ఆలం భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. 1993లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించినప్పుడు గౌస్ ఆలం ఏడాది పిల్లవాడు. ఆ సమయంలో వారి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సమాజం ఒంటరి మహిళ ఉద్యోగం చేయడాన్ని అంగీకరించని రోజుల్లో, ఐదుగురు పిల్లల బాధ్యతను తనపై వేసుకుని నూర్జహాన్ ధైర్యంగా ముందుకు సాగారు. భర్త మరణించిన మూడేళ్ల తర్వాత, ఆమె ఢిల్లీ ఆర్డినెన్స్ డిఫెన్స్‌లో క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో గౌస్ ఆలం పాఠశాల విద్య సాగింది. తల్లి కోరిక మేరకు యూనిఫాం సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ కలను నిజం చేయడానికి నూర్జహాన్ ఎంతో కష్టపడ్డారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ తమ పిల్లలకు మంచి చదువు చెప్పించారు. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు తాము ఈస్థాయిలో ఉన్నామని గౌస్ ఆలం గర్వంగా చెబుతున్నారు. తల్లి సంపాదనతో పాటు, తండ్రి పెన్షన్, ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్‌షిప్‌ల ద్వారా చదువుకోగలిగామని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి ఒక్కరే మోశారని ఆయన గుర్తుచేసుకున్నారు. తనతల్లి చూపిన ధైర్యానికి, చేసిన త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ.. రెండక్షరాలు కాదు.. సృష్టికి మూలం.. మానవ పుట్టుకకు సాక్ష్యం.. తన రక్తాన్ని పంచి బిడ్డకు ప్రాణం పోస్తుంది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అక్షరాలు నేర్పి లక్షణంగా పెంచుతుంది. బుడిబుడి అడుగులు వేయించి సమాజం వైపు నడిపిస్తుంది. పిల్లలకు చిన్న ప్రమాదం ఏర్పడినా.. తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ.. జీవితానికి దారి చూపుతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది గొప్పగా భావిస్తుంది. 50 ఏళ్లు వచ్చినా.. తన బిడ్డలు ఇంకా చిన్నారులే అంటూ.. ప్రేమను చాటుతుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాతృమూర్తులు తమ బిడ్డలకోసం అష్టకష్టాలు పడి జీవితంలో స్థిరపడేలా చేశారు. భర్త దూరమైనా అధైర్య పడకుండా బిడ్డలను జీవితంలో నిలబెట్టిన వారు కొందరైతే.. ఆపదలో ఉన్న పిల్లలకు అవయవాలు దానం చేసినవారు మరికొందరు ఉన్నారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ మాతృమూర్తులపై ప్రత్యేక కథనం!! -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
అమ్మ ప్రేమకు జై.. సాక్షి, పెద్దపల్లి: మన జీవితంలో అన్నిదశల్లో వెంటుండే అమ్మను ప్రేమించేందుకు ఒక్కరోజు తప్పనిసరని యువత భావిస్తోంది. మదర్స్ డే రోజు అమ్మకు గ్రీటింగ్ కార్డు, కేకులు, పూలు కానుకలుగా ఇస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతిక్షణాన్ని అమ్మకు అంకితం చేసినా తక్కువేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మదర్స్‌డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై 100 మందిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానాలు ఇవీ.. ఫోన్లో/వీడియోకాల్‌లో మాట్లాడుతాంఅవసరం లేదుబహుమతులు ఇస్తాం చాలా ముఖ్యం053123 తల్లుల పాత్రను గౌరవించడానికి మదర్స్‌డే ముఖ్యమా?58మదర్స్ డే రోజు మీ తల్లిని ఎలా విష్ చేస్తారు? 37అమ్మతో గడుపుతాంకొంత ముఖ్యం 46 -
రైతులు ఆందోళన చెందవద్దు.. కొనుగోలు చేస్తాం
ధర్మారం: తడిసిన ప్రతీ గింజా కొంటామని ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధర్మారం, మేడారం కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచే ఫోన్లో అధికారులతో మాట్లాడి తూకంలో ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు. తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, డైరెక్టర్ కాంపెల్లి రాజేశం, నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, పొనవేని స్వామి రైతులు పాల్గొన్నారు. -
జాప్యం చేయడంతోనే ఇబ్బంది
ధాన్యం కొనుగోళ్లలో తీవ్రజాప్యం జరుగుతోంది. 15 రోజులక్రితం కేంద్రంలో ధాన్యంపోశా. శుక్రవారం తూకం వేశారు. ఇంకా కొన్ని బస్తాల ధాన్యం తూకం వేయాల్సి ఉంది. అకాల వర్షంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. – వేముల రమేశ్, పెద్దబొంకూర్ 20 రోజులుగా నిరీక్షణే.. ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకుందామనే ఆశతో వస్తే తూకం వేయడంలో జాప్యం చేశారు. తేమశాతం నిబంధనలకు లోబడే వచ్చినా.. బార్దాన్ ఇవ్వకండా ఇబ్బంది పెట్టారు. ఇపుడు ఇలా కురిసిన వానకు ధాన్యం తడిసింది. – సంటి నంబయ్య, బొంపల్లి కవర్లు ఇవ్వలేదు.. ధాన్యం మార్కెట్‌కు తెచ్చి నాలుగు రోజులకంటే ఎక్కువే అయ్యింది. ఎక్కడపడితే అక్కడే ఆరబోసుకుంటున్న టార్పాలిన్ కవర్లు ఇవ్వాలని అడిగితే ఇస్తలేరు. అకాల వర్షంతో ధాన్యం తడిసింది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి. – శంకర్, శాస్త్రినగర్ 20 ట్రాక్టర్ల ధాన్యం తడిసింది ధాన్యం అమ్మేందుకు కదంబాపూర్ గ్రామం నుంచి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన. యార్డులో ఆరబోసినా. కాంటా పెట్టడంలో ఆలస్యం చేసిన్రు. ఇప్పుడు వడ్లన్నీ తడిసినయ్. ప్రభుత్వం ఆదుకోవాలి. – గోస్కుల కవిత కదంబాపూర్ -
భూ నిర్వాసితులకు పరిహారం అందించాలి
మంథని: జాతీయ రహదారి నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న నిర్వాసితులకు అర్హతల ఆ ధారంగా పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం మండలంలో ని పు ట్టపాక గ్రామంలో భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. వరంగల్– మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారాన్ని అర్హతల ఆధారంగా అందించాలన్నారు. నిర్వాసితులు అందించిన ప్రతి దరఖా స్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి పాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీవో సురేశ్, జిల్లా అటవీశాఖ అధికారి శివ య్య, ఆర్అండ్బీ ఈఈ భావ్ సింగ్, హార్టికల్చర్ జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ కు మారస్వామి, అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీ హర్ష -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
పెద్దపల్లిరూరల్/సుల్తనాబాద్/ధర్మారం/పాలకుర్తి: గాలివాన అన్నదాతను అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం కష్టం నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం జిల్లా కేంద్రం పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి పట్టణంతో పాటు మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం తదితరగ్రామాల్లో అక్కడక్కడ రాళ్లవాన కురిసింది. పట్టణంలో రోడ్లపక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో చెట్లకింద నిలిపి ఉంచిన కారుపై చెట్టు విరిగిపడింది. పట్టణమంతా చిమ్మచీకట్లు అలుముకున్నాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది శ్రమించి సరఫరా పునరుద్ధరించారు. సుల్తానాబాద్, శాస్త్రినగర్, పూసల సుగ్లాలంపల్లి, పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్, కొత్తపల్లి, పాలకుర్తి, కురుమపల్లి తదితర ప్రాంతాల్లో వర్షంతో అన్నదాత ఇబ్బందిపడ్డారు. కేంద్రాల్లో ధాన్యం.. అన్నదాత దైన్యం ధాన్యం అమ్ముకుందామని తెచ్చిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పల వద్దే నిరీక్షించాల్సివస్తోందని వాపోయారు. శనివారం అకస్మాతుగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్ మండలాల్లో 17.0 మి.మీ, ధర్మారం, పాలకుర్తిలో 3.0 మి.మీ వర్షపాతం కురిసిందని అధికారులు తెలిపారు. రైతన్న క‘న్నీరు’ భారీగా వీచిన గాలులు కూలిన చెట్లు, తెగిన కరెంట్ తీగలు జిల్లాలో పలుచోట్ల చిమ్మచీకట్లు పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తిలో తడిసిన ధాన్యం -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి● గోదావరిఖని ఏసీపీ రమేశ్
గోదావరిఖని: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జనసమ్మర్థంలోని ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతంలోని ముఖ్య ప్రాంతాల్లో బాంబ్‌స్క్వాడ్, డాడ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆదేశాలతో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్ నేతృత్వంలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ , మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, కోర్ట్ పరిసరాలు, ఎక్కువ జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి ఏసీపీ మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రత చర్యల్లో భాగంగా డాగ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టామన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో ఎస్సైలు భూమేశ్, రమేశ్, శ్రీనివాసులు, కోటేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. 18న మెగా జాబ్‌మేళా గోదావరిఖని: ఈనెల 18 మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్‌మేళాకు హైదరాబాద్‌కు చెందిన 80 నుంచి 100 ప్రైవేటు కంపెనీలు వస్తాయన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతను ఎంపికచేసి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు, సాంకేతిక విద్య, పైచదువులు చదివిన వారు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఆర్జీ–1 జీవీటీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్‌నంబర్ 9491144252 నెంబరులో సంప్రదించాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు ఆంజనేయులు, శివనారాయణ, కర్ణ, వరప్రసాద్, డాక్టర్ అంబిక, రవీందర్‌రెడ్డి, లక్ష్మీరాజం, ధనలక్ష్మిబాయి, శ్రావణ్‌కుమార్, అశోక్‌రావు, రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..
ముస్తాబాద్(సిరిసిల్ల): తన జీవితం ఉన్నంత కాలం పేగు తెంచుకుని పుట్టిన సంతానం కోసం ఎంతటి త్యాగానికై న సిద్ధపడుతుంది అమ్మ. అందుకు నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన అరుట్ల భాగ్యమ్మ. అరుట్ల రాజిరెడ్డి– భాగ్యమ్మ దంపతుల కుమారుడు అరుట్ల మహేశ్‌రెడ్డి వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో చేరగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణపాయం నుంచి బయటపడుతాడని వైద్యులు తెలిపారు. మరో ఆలోచన లేకుండా తల్లి భాగ్యమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు 15నెలల క్రితం సర్జరీ చేసి భాగ్యమ్మ ఒక కిడ్నీని మహేశ్‌రెడ్డి వేశారు. అప్పుడు భాగ్యమ్మ కొడుకును కాపాడుకునేందుకు చేసి న త్యాగంతో ఇప్పుడు మహేశ్‌రెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అమ్మ తనకు మరోసారి పునర్జన్మనిచ్చిందని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని మహేశ్‌రెడ్డి అంటున్నారు. – మరిన్ని కథనాలు 10లోu తెలియదుఅవును12 48పేరెంట్స్‌ను పట్టించుకోకుంటే కఠిన చర్యలు అవసరమేనా?40వద్దు -
మా ఆయన చనిపోయిండు
మా ఆయన బూస జగ్గయ్య చనిపోయి 13 నెలలు అయింది. గుంట భూమి లేదు. నా ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లోనే ఉంటున్న. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. ఇంకా ఇస్తలేరు. ప్రభుత్వం స్పందించాలె. – బూస శంకరమ్మ, వితంతువు, కల్వచర్ల ఉత్తర్వులు రాలేదు ప్రజాపాలన గ్రామసభల్లో చాలామంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడి నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. – కాళిందిని, డీఆర్డీవో -
నాణ్యమైన ధాన్యం కొనాలి
ఓదెల(పెద్దపల్లి): రైతులు తీసుకొచ్చిన నాణ్యమైన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు సూచించారు. స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు. టార్పాలిన్ కవర్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచుకోవాల ని సూచించారు. అనంతరం స్థానిక తహసీల్దా ర్ కార్యాలయాన్ని సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఫౌర సరఫరా ల అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల చర్చలు సఫలం పెద్దపల్లిరూరల్: తమ సమస్యలు, పరిష్కరించాలని, బకాయి వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో వారం రోజులుగా రైల్వే కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం విరమించారు. సమస్యలను పరిష్కరించి, బకాయి వేతనాలను ఈనెల 12న చెల్లించేందుకు అంగీకరించడంతో కార్మికులు సమ్మె విరమించారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు తెలిపా రు. రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ అసిస్టెంట్ కమిషనర్ పాల్వాయి రవి, కృష్ణమోహన్, రామగుండం కమర్షియల్ ఇన్స్పెక్టర్ కార్తీక్ తదితర అధికారులతో యూనియన్ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయన్నారు. కార్మిక సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సీపెల్లి రవీందర్, లక్ష్మి, రాజలింగం, అమృత, అరుణ, మల్లయ్య, కళావతి తదితరులు పాల్గొన్నారు. మూడు గ్రామాల్లో సదస్సులు ఎలిగేడు(పెద్దపల్లి): భూభారతి చట్టం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఎలిగేడు మండలంలోని ధూళికట్ట, నారాయణపల్లి, సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ధూళికట్టలో 55, సుల్తాన్‌పూర్‌లో 53, నారాయణపల్లిలో 46 దరఖాస్తులు స్వీకరించారు. తహసీల్దార్ బషీరొద్దీన్, అధికారులు, జయలక్ష్మి, చంధ్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కలెక్టర్ కోయ శ్రీహర్ష తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు. మహిళా రెస్యూ సభ్యుల ఎంపికకు పరీక్ష గోదావరిఖణి: సింగరేణి మెయిన్ రెస్క్యూ స్టేషన్లో శుక్రవారం మహిళా రెస్క్యూ సభ్యుల ఎంపిక పరీక్ష నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్, జనరల్, బదిలీ అసిస్టెంట్లకు చెందిన 18 మంది హాజరయ్యారు. నైపుణ్యం పెంపు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన తీరు, రిస్క్ మేనేజ్మెంట్, జ్ఞాపకశక్తి, శారీరక ఫిట్నెస్, ప్రథమ చికిత్స, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితర అంశాలపై పరీక్ష నిర్వహించారు. మందమర్రి, కొత్తగూడెం ఏరియాలో ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 13న భూపాలపల్లిలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 48మంది భూగర్భగనుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏడుగురు ఉపరితల గనుల్లోని ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నా రు. రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావ్, డీవైఎస్ఈ మూర్తి, అడిషనల్ మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పిల్లలపై దృష్టి సారించాలి పెద్దపల్లిరూరల్: గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని నశాముక్త భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల అన్నారు. గుర్రాంపల్లిలో శుక్రవారం ఉపాధిహా మీ కూలీలకు అవగాహన కల్పించారు. చాక్లె ట్లు, కూల్‌డ్రింక్స్, పౌడర్ రూపాల్లో డ్రగ్స్ పల్లెలదాకా చేరుతోందని తెలిపారు. పిల్లల అలవాట్లను పరిశీలించాలన్నారు. డ్రగ్స్ అమ్మకాల గురించి తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 14446కు సమాచారం అందించాలని కోరారు. -
యాసంగి ‘పంట పండింది’
● సమృద్ధిగా సాగునీరు ● అనుకూలించిన వాతావరణం ● ఫలితమిచ్చిన బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల రామగుండం: అంతర్గాం మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగుచేశారు. ఇదేస్థాయిలో అధిక దిగుబడి సాధించారు. ఇందుకు ప్రధాన కారణం బ్రాహ్మణపల్లి ఎత్తిపోతల అందుబాటులోకి రావడమే. దీనిద్వారా ఎస్సారెస్పీ కాలువల చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా సాగునీరు అందింది. పంటకు అవసరమైన నీరు ఎల్లవేళలా అందుబాటులో ఉంది. చీడపీడలు, తెగుళ్లు ఆశించలేదు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాయి. ఏడు వేల క్వింటాళ్లు అదనం.. రైతులు ప్రతీ యాసంగిలో సాధించే ధాన్యం దిగుబడితో పోల్చితే ఈసారి సుమారు ఏడువేల క్వింటాళ్లు అదనంగా దిగుబడి సాధించారని అధికారులు అంచనా వేశారు. భారీగా తరలివచ్చిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల్లో స్థలం సరిపోలేదు. ప్రధాన రహదారికి ఇరువైపులా వడ్లు ఆరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. మండలవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 97 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సొసైటీ చైర్మన్ ప్రభాకర్ తెలిపారు. గతేడాది ఇదే సీజన్తోలో 90వేల క్వింటాళ్లు సేకరించామని ఆయన పేర్కొన్నారు. -
మట్టిదందా.. కాసులపంట
సాక్షి, పెద్దపల్లి: నాణ్యమైన ఇటుక తయారీకి చెరువు మట్టి అవసరం. దీంతోనే పంట చేలకు చేరాల్సిన మట్టి ఇటుకబట్టీలకు వెళ్తోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా కలెక్టర్ కొత్తమట్టి పాలసీ తీసుకొచ్చినా.. కొందరు అధికారులు, మట్టి నిర్వాహకులతో కలిసి దందాకు తెరతీశారు. సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. ఏటా వేసవిలో చెరువులు వట్టిపోయాక ఇటుక బట్టీ వ్యాపారులు మాఫియా అవతారం ఎత్తి, మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను మామూళ్ల మత్తులో ముంచుతున్నారు. పెద్దఎత్తున మట్టి అక్రమంగా తరలించుకుపోతున్నారనే ఆరోపణలున్నాయి. సీజ్ చేసినా.. కాసులు కురిస్తున్నాయి.. నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి తీసేందుకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. అనుమతి పొందాక మట్టి తీయాలి. కానీ చాలామంది ఇటుకబట్టీ నిర్వాహకులు అనుమతి గోరంత తీసుకొని.. కొండంత తవ్వుకుపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఏదోఓచోట మట్టికుప్పలు అధికారులు సీజ్ చేయడం, జరిమానా పేరిట పెనాల్టీ తీసుకుని మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వడం జిల్లాలో పరిపాటిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. మట్టితీతకు చెరువుల గుర్తింపు పెద్దపల్లి, రాఘవాపూర్, రంగంపల్లి, రామగిరి, కమాన్‌పూర్, రామగుండం, ధర్మారం, సుల్తానాబాద్, కాట్నపల్లి తదితర ప్రాంతాల్లో 160కిపైగా ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటిద్వారా ఏటా రూ.కోట్ల వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఇటుక సరఫరా అవుతూ ఉంటుంది. ఇటుక తయారీకి అవసరమయ్యే నల్లరేగడి మట్టి చెరువుల్లో లభిస్తుంది. దీనిని ఏటా వేసవిలో రాజకీయ పార్టీల అండతో అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. ఇటుకబట్టీల యజమానులు, ఇతరుల పేరిట అనుమతి తీసుకుని కొంతమొత్తంలో రాయల్టీ, సీనరేజీ చెల్లించి పెద్దఎత్తున మట్టి తరలిస్తున్నారు. ఇటుకబట్టీ యజమానులు కొందరు తమకు అవసరమయ్యే మట్టిని తీసుకోవడంతోపాటు ఇతరులరులకూ విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈనేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈఏడాది జిల్లాలోని 14 చెరువుల్లో 3.8లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేందుకు అవకాశం ఉందని గుర్తించారు. నీటిమట్టం తగ్గిన తర్వాత తవ్వకానికి అనుమతి ఇస్తారు. మట్టి కావాలా? సర్‌ను కలవండి జిల్లాలో సుమారు 160 ఇటుకబట్టీలున్నాయి. జిల్లాలో తయారీ చేసిన ఇటుకలకు రాష్టవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో ఆయా బట్టీల నిర్వాహకులు ఇటుకల తయారీ కోసం చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుంటారు. ఇదేఅదనుగా ఓ అధికారి తన కార్యాలయంలోని ఒక వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకుని ఇటుకబట్టీ నిర్వాహకులకు ఫోన్ చేయిస్తున్నట్లు సమాచారం. ‘మీకు మట్టి కావాలంటే సర్‌ను కలవండి’అంటూ ఫోన్లు చేయిస్తుండడం, దీంతో వచ్చి కలిసిన వారికి అనుమతి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు కలెక్టర్ కొత్తగా మట్టి పాలసీని తీసుకురాగా.. దానికి సంబంధం లేకుండానే సీజ్చేసిన మట్టికుప్పలకు అనుమతి పేరిట అక్రమంగా తరలించేందుకు తెరతీశారు. దీంతో ప్రభుత్వా ఆదాయానికి రూ.కోటికి పైగా గండిపడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారులను సంప్రదిస్తే.. నిబంధనలు అతిక్రమించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెరువు మట్టిపై అక్రమార్కుల కన్ను కాసులు కురిపిస్తున్న సీజ్చేసిన మట్టి పర్యవేక్షణ కరువు.. అడ్డగోలు తరలింపు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఇది కొత్తపల్లి చెరువు మట్టికుప్ప. 2023లో అధికారులు సీజ్ చేశారు. దీని విలువ దాదాపు రూ.18లక్షల వరకు ఉంటుంది. అధికారులు అనుమతి ఇవ్వకుండానే అక్రమార్కులు తరలిస్తున్నారు. దీనిపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. మట్టి తరలింపును అడ్డుకుని తూకం వేయించారు. వారంరోజుల తర్వాత చూస్తే అక్కడ మట్టికుప్పే కనిపించలేదు. నిబంధనలు అతిక్రమించి రాఘవాపూర్ చెరువులోంచి తీసిన మట్టికుప్పలు ఇవి. 2023లో అధికారులు సీజ్ చేశారు. ఒకటి దాదాపు 20వేల మెట్రిక్ టన్నులు, మరోటి 19,361 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని నిర్ధారించారు. ఇక్కడే అక్రమార్కులు, అధికారులు ఒక్కటయ్యారు. రెండింటిలో ఒకమట్టి కుప్పకు అనుమతి తీసుకోని రెండింటినీ తరలిస్తున్నారు. అనుమతి తీసుకోకుండా ఇప్పటికే దాదాపు 20 వేల మెట్రిక్ టన్నులు తీసుకెళ్లారు. అధికారులు చెబుతున్న 19వేల మెట్రిక్ టన్నుల ఇంకో మట్టి కుప్పను తరలించేందుకు సిద్ధమయ్యారు. వాస్తవంగా ఇది 30వేల మెట్రిక్ టన్నులు ఉండాలి. కానీ, నామ్‌కే వాస్తేగా రూ.7,74,440 జరిమానా విదించి తరలించేందుకు అనుమతి ఇచ్చారు. ఈతతంగంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈఒక్కఘటనలో ప్రభుత్వానికి సుమారు రూ.25లక్షలు నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
పాతది పెంచరు.. కొత్తది ఇవ్వరు
● లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ ● కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? ● దరఖాస్తుదారుల్లో తీరని ఆవేదన రామగిరి(మంథని): తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.2వేలు ఉన్న పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని, దివ్యాంగుల పింఛన్ రూ.6వేలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిపోయినా ఆ ఊసే ఎత్తడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయడం లేదంటున్నారు. గతేడాది నిర్వహించిన ప్రజాపాలనలో జిల్లావ్యాప్తంగా 6,979 మంది దివ్యాంగులు, ఇతరులు 49,552 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేశారు. అంతకుముందున్న ప్రభుత్వం 2022లో ఒకసారి మా త్రమే కొత్తగా పింఛన్లు మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదని వారు అంటున్నారు. 16 నెలలుగా పాత పింఛనే.. జిల్లాలోని పింఛన్‌దారులకు పాతపింఛన్ సొమ్మే విడుదలవుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా కొత్త పింఛన్ల గురించి పట్టించుకోవడం లేదని వారు దుయ్యబడుతున్నారు. మూడేళ్లుగా ఎదురుచూపులే.. జిల్లాలో కొత్త పింఛన్ కోసం మూడేళ్లుగా అర్హులు ఎదురుచూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం 2022లో కొత్త పింఛన్ మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడి చేసినా దరఖాస్తుల స్వీకరణకే పరిమితం అయిందనే విమర్శిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ విషయంలో మాత్రం ఒకరు మరణిస్తే మరొకరికి ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇలా 6,606 మంది మరణించగా బదాలయింపు పింఛన్లు 2,249 మందికి మంజూరు చేశారు. జిల్లాలో పింఛన్లు వృద్ధాప్య 40,884 వితంతు 32,903 దివ్యాంగ 13,068 చేనేత 806 గీతకార్మిక 2,187 బీడీకార్మిక 695 ఒంటరి మహిళ 2,613 టేకేదార్ 5 పైలేరియా బాధిత 338 డయాలసిస్ బాధిత 83 ఇతరులు 1,253 -
అభివృద్ధి పనులు పూర్తిచేయండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు కోల్‌సిటీ/రామగుండం: అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కమిషనర్ అరుణశ్రీ తో కలిసి రామగుండం బల్దియా పరిధిలో కలెక్టర్ పర్యటించారు. వీధివ్యాపారుల కో సం రైల్వేస్టేషన్ ఎదుట చేపట్టిన భవన ని ర్మాణం, యువతకు ఉపాధి కల్పించే ఏటీసీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లో స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలని ఆదేశించారు. ఏటీసీల తో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పీకే రామయ్యకాలనీలో చేపట్టిన రోడ్డు, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో చేపట్టిన డ్రైనేజీ పనులు పరిశీ లించారు. జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని సీఎస్ఆర్ క్లబ్లో 126 మంది అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్న అగ్నివీర్ యువశక్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులకు నాణ్యమైన భోజనం, విద్య, శిక్షణ అందించాలని సూచించారు. జీజీహెచ్‌లో చే పట్టిన భవన నిర్మాణ ప్రగతిపై ఆరా తీశా రు. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తిపన్ను వసూలు చేసి, రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఇన్చార్జి ఆర్డీవో సురేశ్, ఈఈ రామన్, తహసీల్దార్ ఈశ్వర్, ఐటీఐ ప్రిన్సిపాల్ సురేందర్ తదితరులు ఉన్నారు. -
మెరుగైన సేవలకు వందరోజుల కార్యాచరణ
● అధికారులూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి ● రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశంకోల్సిటీ(రామగుండం): పారిశుధ్య నిర్వహణతోపాటు మిగతా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు వందరోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో వార్డు అధికారులు, రెవెన్యూ, పారిశుధ్య, ఇంజినీరింగ్ సిబ్బందితో శుక్రవారం వివిధ అంశాలపై కమిషనర్ సమీక్షించారు. వచ్చే వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులు ప్రబలకుండా నాలాల్లో పూడిక తొలగించాలన్నారు. ఇంటింటా చెత్తసేకరణ, తరలింపు, దోమల నియంత్రణపై దృష్టి సారించాలని అన్నారు. ఇందులో ఉత్తమ సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందికి ప్రతీనెల నగదు అవార్డు ఇవ్వాలని స్పెషలాఫీసర్ ఆదేశించారని వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తమ సేవలు అందించిన కొందరిని గుర్తించి, రూ.2,000 నగదు బహుమతి అందజేస్తున్నామని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి ముందే సమస్యను వార్డు అధికారులు గుర్తించి పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డుల అర్హుల జాబితాను వెంటనే సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఎర్లీబర్డ్ ఆఫర్ 5శాతం రాయితీతో ఆస్తిపన్ను వసూళ్లలో రామగుండం బల్దియా ముందంజలో ఉండడానికి వార్డు అధికారులు, సహాయకులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి కారణమంటూ అభినందించారు. ఉత్తమ సేవలు అందించిన వారికి జ్ఞాపికలు అందజేసి ప్రశంసించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, డీఈఈ హన్మంతరావు నాయక్, ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐలు శంకర్రావు, ఖాజా, శానిటరీ ఇన్స్పెక్టర్లు కిరణ్, కుమారస్వామి పాల్గొన్నారు. -
భద్రతా బలగాల హైఅలర్ట్
గోదావరిఖని: పాక్ దాడులు, మనదేశం ప్రతిదా డుల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అ ప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది. ప్రాజెక్టులు, పరిశ్రమల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాలపై నిఘా.. సివిల్ పోలీస్, ఎన్టీపీసీలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తమైయ్యా యి. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం పరిశ్రమల్లో భద్రతత కట్టుదిట్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆయా పరిశ్రమ లు, ప్రాజెక్టులకు అధికారులు ఆదేశాలు జారీ అ య్యాయి. కీలక ప్రాంతాలపై నిఘా పెంచాలని, సమస్యలు తలెత్తితే వెంటనే తమకు సమాచారం అందించాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఈమేరకు పె ద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారుల తో పాటు ఎన్టీపీసీకి భద్రత కల్పిస్తున్న సీఐఎస్ ఎఫ్ అఽధికారులతోనూ శాంతిభద్రతల పరిరక్షణ పై సీపీ సమీక్షించారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా కొనసాగిండంతోపాటు అవసరమైతే ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో డేగకళ్లతో నిఘా ఉంచాలన్నారు. సమన్వయం – అప్రమత్తం ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీపీ అంబర్ కిశోర్ ఝా తన కార్యాలయంలో గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ప్రధానమైన పారిశ్రామిక సంస్థల అధికారులు, భద్రతా అధికా రులు, పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించిన సీపీ.. దాడులు, ప్రతిదాడుల నేప థ్యంలో భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రధానమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షణ, భద్రతా వ్యవస్థలను కట్టదిట్టం చేయాలని ఆదేశించారు. రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఇందుకోసం అన్నిశాఖలను సమన్వయం చేసుకోవాలని అన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగులు, శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లకుండా, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ( అడ్మిన్) రాజు, సీఐఎస్ఎఫ్ అధికారులు సుధేశ్ జంకర్, సర్వర్, రాజు, ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్, ఆర్జీ–1, 2, 3, శ్రీరాంపూర్ సింగరేణి జీఎంలు లలిత్ కుమార్, రాముడు, సుధాకరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాక్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం శాంతిభద్రతలపై పరిరక్షణపై సమీక్షించిన రామగుండం సీపీ నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసు బలగాలకు దిశానిర్దేశం ఎన్టీపీసీ ప్రాజెక్టు వద్ద భారీగా మోహరించిన సీఐఎస్ఎఫ్ బలగాలు -
తాగునీటికి సమస్యలు రావొద్దు
కాల్వశ్రీరాంపూర్/ఓదెల(పెద్దపల్లి): వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీపీవో వీరబుచ్చయ్య సూచించారు. కాల్వశ్రీరాంపూర్, ఓదె ల ఎంపీడీవో కార్యాలయాల్లో గురువారం ఆ యన మాట్లాడారు. పారిశుధ్యం మెరుగుపర్చాలన్నారు. సిగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, వర్మీకంపోస్టు తయారీ, పీఎం విశ్వకర్మ, తడి, పొడి చెత్త విక్రయాలు తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఆర్ఎఫ్సీఎల్కు సమ్మె నోటీస్ ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారంలో ఈనెల 20న చేపట్టే సమ్మైపె కార్మిక సంఘాల జేఏసీ నాయకులు యాజమాన్యానికి నోటీసు అందజేశారు. సార్వ త్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ గురువారం ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి కార్మిక సమ్మె నోటీసు అందజేసింది. ఆర్ఎఫ్సీ ఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయు నాయకులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి జూలపల్లి(పెద్దపల్లి): అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకోవాలని హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య సూచించా రు. హౌసింగ్ఽ అధికారులతో కలిసి గురువారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ లబ్ధిదారుల ను కలిశారు. వారిని అడిగి వివరాలు సేకరించారు. నిబంధనలకు లోబడి ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. ఎంపీవో అనిల్‌రెడ్డి, హౌసీంగ్ డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. కవయిత్రికి పురస్కారం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రానికి చెందిన సహజ కవయిత్రి బొమ్మిదేని రాజేశ్వరికి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో గురువారం తెలుగు భాషా చైతన్య సమితి 12వ వార్షికోత్సవం సందర్భంగా కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ సదస్సులో ‘తెలుగు వెలుగు.. తెలుగు నామాట’ కవితను ఆలపించిన రాజేశ్వరి.. సభికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను నిర్వాహకులు తదితరులు సత్కరించారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎలిగేడు(పెద్దపల్లి): భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టం అమలులోకి వచ్చిందని అడిషనల్ కలెక్టర్ వేణు తెలిపారు. లాలపల్లి, నర్సాపూర్‌లో చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను ఆయన గురువారం తనిఖీ చేశా రు. లాలపల్లి 69, నర్సాపూర్‌లో 50 దరఖా స్తులు వచ్చాయని తహసీల్దార్ బషీరొద్దీన్ తెలిపారు. ఆర్ఐ జయలక్ష్మి పాల్గొన్నారు. 25న ఈతపోటీలు గోదావరిఖనిటౌన్: తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్–2025 కమ్ సెలక్షన్ ట్రయల్స్ స్విమ్మింగ్ పోటీలు ఈనెల 25న నిర్వహిస్తారని అసోసియేషన్ కోశాధికారి టి.కృష్ణమూర్తి తెలిపారు. ఇందులో ప్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, సీతాకోకచిలుక, వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లు ఉంటాయన్నారు. స్విమ్మర్స్ గరిష్టంగా 5 ఈవెంట్లలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎస్ఎఫ్ఐ యూఐ డీ ని కలిగి ఉండాలని, ఈనెల 20వ తేదీలోగా త మ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200, ఎంట్రీ ఫీజు రూ.100 చెల్లించాలని ఆయన వివరించారు. -
‘ఎర్లీబర్డ్’కు స్పందన
● బల్దియాకు రూ.9.7కోట్ల ఆదాయం ● వెనుకబడిన మూడు మున్సిపాలిటీలు ● రామగుండం కార్పొరేషనే అగ్రస్థానం కోల్‌సిటీ(రామగుండం): ఎర్లీబర్డ్ ఆఫర్‌కు రామగుండం బల్దియాలో అనూహ్య స్పందన లభించింది. ఇదేసమయంలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ముందస్తు ఆస్తిపన్ను వసూలు కాలేదు. ఈనెల 7వ తేదీతో ఐదు శాతం రాయితీ ఆఫర్ గడువు మగిసింది. ఎర్లీబర్డ్ ఆఫర్‌తో రామగుండం బల్దియాకు రూ.9.7కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు. ఏటా ఎర్లీబర్డ్ ఆఫర్‌తో బల్దియా లక్ష్యం నిర్దేశించుకుంటోంది. ఈ ఏడాది కూడా సుమారు రూ.4కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందని భావించినా.. అంతకుమించి వసూలైంది. ప్రతీఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎర్లీబర్డ్ ఆఫర్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఆఫర్ కింద ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబెట్ వర్తింపజేస్తోంది. ప్రథమ స్థానంలో రామగుండం.. ఎర్లీబర్డ్ ఆఫర్ కింద ఆస్తిపన్ను వసూలు చేయడంలో రామగుండం నగరపాలక సంస్థ ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోల్చితే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఆస్తిపన్ను మొత్తంలో 5శాతం రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం గత ఏప్రిల్ మొదటి వారంలో ఎర్లీబర్డ్ ఆఫర్ ప్రకటించింది. దీని గడువు తొలుత ఏప్రిల్ 30తో ముగిసినా.. ప్రజల అభ్యర్థన మేరకు ఈనెల 7వ తేదీ వరకు పొడిగించింది. గడువు ముగిసిసే సమయానికి రామగుండం బల్దియా 47.91 శాతం ఆస్తిపన్ను వసూలు చేసింది. రాష్ట్రంలోని 151 పట్టణ స్థానిక సంస్థల్లో 4వ స్థానంలో నిలిచింది. రూ.9.7కోట్ల ఆస్తిపన్ను వసూలు.. రామగుండం నగరంలో 51,033 అసెస్మెంట్లు ఉండగా, మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.14 కోట్ల వరకు ఉంది. ఇందులో 13,915 అసెస్మెంట్ల నుంచి రూ.9.7 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైంది. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష, కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అరుణశ్రీ ఎప్పటికప్పుడు పన్ను వసూళ్ల పురోగతి సమీక్షిస్తూ, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే బల్దియా ఈ ఘనత సాధించిందని రెవెన్యూ విభాగం అధికారులు వెల్లడిస్తున్నారు. మూడు మున్సిపాలిటీల్లో పూర్.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఆశించినస్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేయలేకపోయాయి. పెద్దపల్లిలో 12,451 అసెస్మెంట్లు ఉండగా, రూ.8.02కోట్ల డిమాండ్ ఉంది. ఇందులో రూ.1.70 కోట్ల వరకు వసూలు కాగా 21.20 శాతం నమోదైంది. సుల్తానాబాద్‌లో 5,511 అసెస్మెంట్లు ఉంటే.. రూ.3.06కోట్ల డిమాండ్ ఉండగా, రూ.57లక్షల వరకు వసూలు చేసి 18.63 శాతం, మంథనిలో 5,203 అసెసెస్మెంట్లకు రూ.2.3కోట్ల డిమాండ్ ంటే.. రూ.58 లక్షలు వసూలు చేసి 25.37 శాతం నమోదు చేశాయి. సకాలంలో చెల్లించండి జిల్లా ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి బల్దియాల అభివృద్ధికి సహకరించండి. జూన్ ఆఖరులోగా ఆస్తిపన్ను చెల్లించకపోతే జూలై నుంచి వడ్డీ పెరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తిపన్ను చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగానే ఎర్లీబర్డ్ ఆఫర్లో రామగుండం బల్దియా మంచి ఫలితం సాధించింది. – అరుణశ్రీ, కమిషనర్, అదనపు కలెక్టర్ ఎర్లీబర్డ్ ఆఫర్ వసూళ్ల తీరు బల్దియా అసెస్మెంట్లు డిమాండ్ కలెక్షన్ శాతం (రూ.కోట్లలో)రామగుండం 51,033 19.14 9.7 47.91 పెద్దపల్లి 12,451 8.02 1.70 21.20 సుల్తానాబాద్ 5,511 3.06 0.57 18.63 మంథని 5,203 2.3 0.58 25.37 -
భవన నిర్మాణానికి భూమిపూజ
గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో రూ.10కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్, ఓఎస్డీ టు వీసీ డాక్టర్ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్, చీఫ్ వార్డెన్ మనోహర్, ఇంజినీర్ ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్ రమాకాంత్, అధ్యాపకులు రమేశ్‌రెడ్డి, రవి, ప్రసాద్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఉద్యానవన శాఖ అధికారులతో సాగు విస్తీర్ణం పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. సాగుతో కలిగే లాభాలు, మొక్కలు, డ్రిప్, అంతర పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ, ఆదాయం వివరాలను రైతులకు సులువుగా అర్ధమయ్యేలా వివరించి వారు సాగుపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. పిల్లల సమస్యలుంటే 1098కు కాల్చేయండి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన వారికి ప్ర భుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ శ్రీహర్ష అ న్నారు. సీ్త్రశిశు సంక్షేమశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పిల్లలు అందరూ చదువుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా ఆర్థి కసాయం అందిస్తుందని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే సత్వరమే 1098 నంబరుకు కాల్చేసి స మాచారం అందించాలని, తక్షణమే స్పందించి సా యమందిస్తారన్నారు. జిల్లా సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్, అధికారులు జితేందర్, కనకరాజు, రజిత, అనిల్ తదితరులు ఉన్నారు. 17లోగా దరఖాస్తు చేసుకోండి జిల్లాలోని లైసెన్స్ సర్వేయర్లు శిక్షణ పొందేందుకు ఈనెల 17లోగా దరఖాస్తు సమర్పించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులు స్వీకరిస్తోందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నా రు. వివరాలకు 98490 81489, 70326 34404, 94419 47339 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ శివారులోని డంపుల నుంచి లారీలు, టిప్పర్లలో యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో రాకపోకలు సాగించడంతో గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగారు. రాఘవాపూర్‌లో కొద్దిరోజుల క్రితం నిర్మించిన బీటీ రోడ్డు, దేవునిపల్లి మార్గంలోని లోలెవ
● మట్టిటిప్పర్లతో రోడ్లు ధ్వంసం చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా రోడ్డు సేఫ్టీ నియమ, నిబంధనలు ఉల్లంఘించొద్దు. ఓవర్‌లోడ్ వాహనాలను కట్టడి చేసేందుకు తనిఖీలు చేస్తాం. రోడ్ల విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటాం. – మసూద్, ఎంవీఐఓవర్లోడ్ను అరికట్టాలి ఇటుక బట్టీలకు చెరువు మట్టి తరలిస్తున్న లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తూ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రేయింబవళ్లు లారీలు నడుస్తున్నాయి. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఓవర్‌లోడ్‌ను కట్టడి చేయాలి. – సంజీవ్, రాఘవాపూర్ మరమ్మతు చేయాలి దేవునిపల్లి– రాఘవాపూర్ మధ్య కల్వర్టుతోపాటు ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డు ధ్వంసమైంది. ఉన్నతాధికారులు పగుళ్లు చూపిన కల్వర్టును పరిశీలించాలి. మరమ్మతు చేయించి, రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలి. – ఆడెపు వెంకటేశం, మాజీసర్పంచ్ అతివేగం వద్దు మట్టి టిప్పర్లు అతివేగంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఎస్సారెస్పీ కాలువ నుంచి మెయిన్ రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు వెంటనే స్పందించాలి. – శంకర్, మాజీ సర్పంచ్, సబ్బితం -
సర్కార్ ఆస్పత్రిలో సకల సౌకర్యాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో ఆధునిక వసతులతో కూడిన ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న 50 పడకలను 100 పడకలకు పెంచుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.51 కోట్ల వ్యయంతో నిర్మించే ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. వచ్చే 15 నెలల్లో భవన నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. ప్రతీరోజు సుమారు 800 మంది ఔట్ పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారని, పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే టిఫా స్కానింగ్ యంత్రం సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. గర్భిణులకు ఇది ఎంతోమేలు చేస్తుందని వివరించారు. ఏఎంసీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక మంథని: జపాన్ షిటోరియా కరాటేకు చెందిన వి ద్యార్థిని మెట్టు హాసిని ఈనెల 9 నుంచి 12వ తేదీ వ రకు మలేషియాలో జరిగే కరాటే పోటీలకు ఎంపికై నట్లు ఇన్స్ట్రక్టర్ కె.సమ్మయ్య తెలిపారు. 19ఏళ్ల 61 కేజీల కుమితే విభాగంలో హాసిన ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఆమెను పలువురు అభినందించారు. -
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్(పెద్దపల్లి): భూభారతితో భూ స మస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. మండల కేంద్రంలో బు ధవారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కలెక్టర్ మాట్లాడా రు. ప్రతీరైతుకు భూభద్రత కల్పించడమే చట్టం లక్ష్యమన్నారు. ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, తహసీల్దార్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రావొద్దు కాల్వశ్రీరాంపూర్/ముత్తారం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష నిర్వాహకులను ఆదేశించారు. కాల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రం నుంచి రోజూ 8 వరకు లారీలు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్‌రావు, ఐకేపీ ఏపీఎం కనుకయ్య, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ దేశించారు. పలుఅభివృద్ధి పనులపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఇంటింటికీ తాగునీరు అందించాలన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఆస్తిపన్నును సమీక్షించాలన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణంప్రారంభించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు డబుల్బెడ్రూమ్ ఇళ్లను ఈనెలాఖరులోగా లబ్దిదారులకు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లు, రాజీవ్‌యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సుల్తానాబాద్ కు చెందిన నిట్టూరి మానసకు శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిలో గడ్డలు తొలగించిన వైద్యులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. -
సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
● ఎమ్మెల్యే విజయరమణారావుఎలిగేడు(పెద్దపల్లి): భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. నర్సాపూర్‌లో బుధవారం చేపట్టిన భూభారతి రెవన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా సామాన్యులకు సాదాబైనామా ద్వారా రిజిస్ట్రేషన్ హక్కులు పొందేవీలు కల్పించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ యాకన్న, డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి, ఎంపీడీవో భాస్కర్‌రావు, సీనియర్ అసిస్టెంట్ స్వాతి, ఆర్ఐ చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ గోపు విజభాస్కర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేత దుగ్యాల సంతోష్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాటమయ్య మోకులతో ప్రమాదాలు దూరం సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కాటమయ్య మోకులు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన గీతకార్మికులకు ఆయన కాటమయ్య మోకులు పంపిణీ చేసి మాట్లాడారు. నాయకులు ప్రకాశ్‌రావు, దామోదర్‌రావు, గోపగాని సారయ్యగౌడ్, బైరి రవీందర్‌గౌడ్, పొన్నం చంద్రయ్యగౌడ్, చిలుకసతీశ్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 52మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, నాయబ్ తహసీల్దార్ రాకేశ్, ఆర్ఐ వినోద్, సమ్మయ్య ఉన్నారు. -
ఇళ్లపట్టాలు అందిస్తాం
రామగుండం: పాములపేట బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ సలహాదా రు హర్కర వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. తన స్వగ్రా మం ఆబాది రామగుండంతోపాటు పాములపేటలో బుధవారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేశారు. తాను ఏస్థాయిలో ఉన్నా తన చివరి శ్వాస వరకు తన సొంత ప్రాంతంతోనే ముడిపడి ఉంటుందని హర్కర అన్నారు. బల్దియా కమిషనర్ అరుణశ్రీ, నాయకులు ఈదునూరి హరిప్రసాద్, వాజిద్‌అలీ, పల్లికొండ శ్యాం తదితరులు ఉన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలి గోదావరిఖని: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సూచించారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో యోనోఎస్బీఐ, ప్రైవేట్ స్కూళ్ల సహకారంతో నిర్వహించిన ఉచిత హెల్మెట్ల పంపిణీకి ఆయన హాజరై మాట్లాడారు. డీసీపీ(అడ్మిన్) రాజు, ఏసీపీలు రమేశ్, జాన్ నర్సింహులు, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై హరిశేఖర్, సంతోష్‌కుమార్, రామరాజు పాల్గొన్నారు. వివరాలు నమోదు చేయాలి పెద్దపల్లిరూరల్: ఆస్పత్రుల్లోని మందుల వివరాలను ఈ ఔషధిలో నమోదు చేయాలని డీ ఎంహెచ్వో అన్న ప్రసన్నకుమారి సూచించా రు. కలెక్టరేట్లో బుధవారం వైద్యాధికారులు, ఫార్మసీ అధికారులతో సమావేశమై పలు సూచనలిచ్చారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, వడదెబ్బ తగలకుండా పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్, కీటకజనిత వ్యాధుల నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే 108 వా హన సిబ్బందికి ఫోన్‌చేయాలని కోరారు. మూ డు నెలల్లోపు గర్భం వద్దు అనుకునే వారికి ఉచితంగా ఆపరేషన్ చేసేందుకు అబార్షన్ కేర్ ఉందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల ని ఆమె సూచించారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, వాణిశ్రీ, శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. 16న ‘చలో ఇందిరా పార్క్’ గోదావరిఖని: మారుపేర్ల కార్మికుల సమస్య లు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 16న చ లో ఇందిరాపార్క్ చేపట్టామని బాధితుల సంఘం నాయకుడు లక్క శ్రవణ్ తెలిపారు. స్థాని క ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలన్నారు. సింగరేణి చేస్తున్న కాలయాపనతో ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు పోయాయన్నారు. ఈ క్రమంలో చేపట్టిన నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని ఆయన కోరా రు. నాయకులు శ్రీనివాస్, వంగ సంతోష్, పార్థపల్లి హరీశ్, ఈర్ల రాజయ్య, బాబు, బొద్దు ల రంజిత్, ఓంప్రకాశ్, రామిండ్ల సందీప్, గు ర్రం సుధాకర్, జిల్లాల శ్రావణ్, మోతుకూరి రవికుమార్, రవి, రాజకుమార్ పాల్గొన్నారు. ప్రమాదాలపై అప్రమత్తం సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వి ద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో వరంగల్ హెచ్ఆర్– డీ సెక్షన్ అధికా రి అశోక్‌కుమార్ సూచించారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్‌లో బుధవారం విద్యుత్ అధికారులు, సిబ్బందితో కలిసి వారోత్సవాల ప్ర చార పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు వినియోగదారులు వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. వేసవిలో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. ఎస్ ఈమాధవ్రావు, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు కిశోర్, సంపత్, సైఫుద్దీన్, దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏడాది ఎక్కువైనా ఉద్యోగం
వయో పరిమితి అధికంగా ఉండడంతో అసలు ఉద్యోగం రాదనే అనుకున్నా. యాజమాన్యం వయో పరిమితి పెంచడంతో నా వయసు 36 ఏళ్లు అయినా ఉద్యోగం వచ్చింది. సీఎండీ బలరాంకు కృతజ్ఞతలు. వయోపరిమితి పెంచడంతో ఉద్యోగం లభించింది. మా నాన్న జీడీకే–11గనిలో రామ్కార్ ఆపరేటర్‌గా పనిచేసి మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యాడు. – తడికెల పవన్, డిపెండెంట్, గోదావరిఖని వెలుగులు నింపారు వయో పరిమితి పెరగడంతో ఉద్యోగం రాదనుకున్నాం. యాజమాన్యం వయసు 40 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగ అవకాశం దక్కింది. మా నాన్న సత్తయ్య ఓసీపీ–3 సీహెచ్‌పీలో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేశాడు. వయో పరిమితి పెరగడంతో కుటుంబంలో వెలుగులు నిండాయి. పోరాటం చేసిన కార్మిక సంఘాల నాయకులు, అమలు చేసిన సీఎండీకి కృతజ్ఞతలు. – ఎతిరాజు రాజేశ్వరి, పూట్నూర్ -
ఫలించిన నిరీక్షణ
● ఎట్టకేలకు 200 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ● 35–40 ఏళ్ల వయసుగల కార్మిక వారసులకు ప్రయోజనాలు ● నియామకపత్రాలు అందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగోదావరిఖని: సుదీర్ఘకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సింగరేణి కార్మిక వారసుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 35 ఏళ్ల – 40ఏళ్ల వరకు వయోపరిమితి పెంచడంతో సుమారు 200 మందికి సింగరేణి సంస్థలో ఉద్యోగావకాశాలు లభించాయి. దీంతో డిపెండెంట్లతోపాటు వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. యూనియన్ల పోరాట ఫలితం.. కారుణ్య నియామకాల ద్వారా నియమితులయ్యే కార్మిక వారసులకు వయోపరిమితి ఇంతకాలం ఉద్యోగాలు రాకుండా అడ్డుపడింది. 35 ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసు ఉండడంతో నిబంధనలు అంగీకరించవని ఇన్నాళ్లూ యాజమాన్యం కారుణ్య నియామకాలకు ససేమిరా అంది. అయితే, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల పోరాటం.. రాష్ట్రప్రభుత్వ జోక్యంతో డిపెండెంట్ల వయో పరిమితి పెంచుతూ సింగరేణి సీఎండీ బలరాం ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత శనివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేతుల మీదుగా డిపెండెంట్లకు హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఉ ద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సుమా రు 130 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో డిపెండెంట్ల వయసు పెంచడంతో చాలామంది వారసులకు ఉద్యోగావకాశాలు దరిచేరాయి. కోవిడ్ మహమ్మారితో వయోపరిమితి సమస్య.. కోవిడ్ మహమ్మారితో రెండేళ్లపాటు కారుణ్య నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో చాలామంది డిపెండెంట్ల వయసు 35ఏళ్లు దాటిపోయింది. ఫలితంగా ఇలాంటివారు ఉద్యోగానికి అనర్హులుగా మారారు. కోవిడ్ మహమ్మూరితో ఉద్యోగాలు నష్టపోయే దుస్థితి ఏర్పడిందని డిపెండెంట్ల కుటుంబాలు ఆవేదన చెందాయి. సమస్యను గుర్తించిన సింగరేణిలోని కార్మిక గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాయి. ఇదేవిషయంపై రాష్ట్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. 35–40ఏళ్ల వయసు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంలో కీలకంగా వ్యవహరించింది. 200 మందికి ప్రయోజనం.. కారుణ్య ఉద్యోగాల్లో గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడంతో సంస్థవ్యాప్తంగా 200 మంది కార్మిక వారసులకు ప్రయోజనం చేకూరుతోంది. వయోపరిమితి పెరిగి ఉద్యోగాలు రావనే బెంగతో ఉన్న డిపెండెంట్ల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. సంతోషంగా ఉంది వయోపరిమితి 40ఏళ్లకు పెంచడం సంతోషంగా ఉంది. మా నాన్న జీడీకే–11గనిలో సపోర్ట్‌మెన్‌గా పనిచేసి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా దిగిపోయారు. ఆ తర్వాత డిపెండెంట్‌గా జాబ్‌కు ఓకే అయినా.. అప్పటికే నాకు 35ఏళ్లు దాటిపోయాయి. దీంతో ఉ ద్యోగం ఇక రాదని ఆందోళనగా ఉన్నాం. ఈ లోగా సర్క్యులర్జారీ చేసి ఉద్యోగ నియామ కపత్రం అందుకోవడం సంతోషంగా ఉంది. – ఇగుర్ల రజిత, డిపెండెంట్ -
కోర్టు భవనాలకు ముహూర్తం
● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్‌లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్ అండ్ బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు కేటాయింపు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయ నిర్మాణ ప్రణా ళిక కింద మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, యాదాద్రి సర్కిల్ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టెండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలు భవన నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖరారు కానున్నాయి. ఇందులో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల కోసం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు. 24 నెలల్లో పూర్తి.. ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్మెంట్ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ లాట్), గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భవన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలు మొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.691.18 కోట్లతో.. మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్‌తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజసం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్‌తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్ కాలేజీ తరహాలో భవనం స్కెచ్ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్, ఎలక్ట్రిక్, శానిటరీ– వాటర్ వర్క్స్ కోసం దాదాపు రూ.53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్‌కు రూ.59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాలకు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ.563 కోట్లు సివిల్ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్ వర్క్స్ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు. -
పనిచేయని ఆర్వో ప్లాంట్
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని సింగరేణి యజమా న్యం చెబుతున్నా.. తాగునీటి విషయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్జీ–2 ఏరి యా యైటింక్లయిన్‌కాలనీలో నివాసం ఉంటున్న కా ర్మిక కుటుంబాలకు మినరల్ వాటర్ అందించేందు కు ఏడాది క్రితం దాదాపు రూ.16.50 లక్షల వ్య యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అది ఎప్పుడూ పనిచేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు. పనిచేయని బోరు స్థానిక తెలంగాణ చౌరస్తా వాటర్ ట్యాంక్ వద్ద ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన అధికారులు.. దాని సమీపంలోనే బోరు వేశారు. అయితే, కొద్దిరోజులకే బోరు పనిచేయకుండా పోయింది. దీంతో గోదావరి నది నుంచి వచ్చే నీటిని వాటర్ ట్యాంక్‌కు అనుసంధానించి.. ఆ నీటినే కార్మిక కాలనీలకు అందిస్తున్నారు. గోదావరిలో ప్రస్తుతం నీరు ఆశించినంత లేదు. ఫలితంగా బొగ్గు గనుల్లోని వృథా నీరు, మరికొంత గోదావరి నీటిని కలిపి శుద్ధి చేసి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. నిర్వహణ సరిగా లేక నీటిని శుద్ధిచేసే ఎంఎంవోఆర్ యంత్రం పనిచేయడంలేదు. ఫలితంగా కలుషిత నీరే దిక్కవుతోందని కార్మిక కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. మరమ్మతుల విస్మరణ.. ఎంఎంవోఆర్ యంత్రాన్ని మరమ్మతు చేయడం లే దు. ఫలితంగా కొన్నినెలలుగా ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే శుద్ధికాని నీటిని నేరుగా కార్మిక కాలనీలకు సరఫరా చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ నీరు తాగడంతో గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం, జలుబు వంటి వ్యాధులకు గురవుతున్నామని వా పోతున్నారు. ఈవిషయంపై చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కార్మిక కాలనీలకు కలుషిత నీరే దిక్కు పట్టించుకోని సింగరేణి అధికారులు -
కమల వికాసానికి ‘ఆధిపత్యమే’ అవరోధం
● నియామకానికి నోచని మండల, జిల్లా కమిటీలు ● గ్రూపు రాజకీయాలతో బీజేపీ కార్యకర్తల్లో నైరాశ్యం ● పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌పై కేంద్రమంత్రి సంజయ్ ప్రభావం..! ● ‘బండి’కి దుగ్యాలతో విభేదాలే ‘గుజ్జుల’ దోస్తీకి కారణమా? పెద్దపల్లిరూరల్: బీజేపీలో ఆధిపత్యపోరు ఆగడం లేదు. ఇప్పటివరకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ మధ్య ఉన్న విభేదాలు కొత్తమలుపు తిరిగాయి. కేంద్రమంత్రి బండి సంజయ్, ప్రదీప్‌కుమార్ మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు పెద్దపల్లి నియోజవర్గంపై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయని కమలం నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ‘గుజ్జుల’ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక.. టీడీపీతో పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో బీజేపీ కి చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా ఎ మ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీ ఏ నాడూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. మరోవైపు.. పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, బండి సంజయ్‌కు మధ్య ఉన్న విభేదాలు.. అప్పటికే బీజేపీలో కొనసాగుతున్న బండి సంజయ్‌కుమార్, గుజ్జుల రామకృష్ణారెడ్డికి మధ్య ఉన్న వై రం.. ఇప్పుడు దోస్తీకి దారితీయడం గమనార్హం. బీజేపీలో ‘అధ్యక్ష’ పాలన దాదాపు ఆరేళ్లుగా బీజేపీలో అధ్యక్షులు మినహా పూ ర్తిస్థాయి కార్యవర్గం నియమించిన దాఖలాలులేవు. ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా.. గ్రూపు రా జకీయాలు, ఇతర కారణాలతో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్ప ట్నుంచి రెండున్నరేళ్లలో ముగ్గురు అధ్యక్షులు మారి నా.. కార్యవర్గ నియామకం లేకుండాపోయింది. ఆ తర్వాత రామగుండం నియోజకవర్గానికి చెందిన రావుల రాజేందర్, మంథనికి చెందిన సునీల్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కమిటీ వేయలేక పోయారు. ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కర్రె సంజీవరెడ్డి కేంద్రమంత్రి బండి సంజయ్ ఆశీస్సులతో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత జిల్లాకమిటీని కూడా ఖరారు చేశారు.. కానీ, గంటల వ్యవధిలోనే దానిని రద్దు చేశారు. పోటాపోటీ కార్యక్రమాలు.. పెద్దపల్లిలో గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన వారెవరూ ఎ మ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. స్థానిక సంస్థల్లో కొన్నిచోట్ల గెలిచినా ప్రభావం అంతంత మాత్రమే చూపించింది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పెద్లపల్లి శివారు బందంప ల్లికి చెందిన మల్క కొమురయ్య బీజేపీ నుంచి అనూహ్యంగా విజయం సాధించి పార్టీలో నూతనోత్తేజం నింపారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ కూడా కమలం జాబితాలో చేరింది. గ్రూపు రాజకీయాలు ఆగేదెలా.. ప్రదీప్‌కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీచేశారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయులు తనకు సహకరించలేదని ఆరోపణలు చేశా రు. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నిౖకైన గుజ్జులకు గత ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. అయితే, వచ్చేఎన్నికల నాటికి ప్రదీప్‌ను నియోజకవర్గం వైపు రా కుండా ఎలా చేయాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఏకాభిప్రాయం కుదిరేనా..? జిల్లాలోని మండల కమిటీలను ఈనెల 15లోగా ఖ రారు చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఇందుకో సం మండలానికో ప్రభారిని నియమించి పేర్లను ఖ రారు చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో పెద్దపల్లి సెగ్మెంట్లో గుజ్జుల వర్గానికి చెందిన పార్టీ జిల్లా అ ధ్యక్షుడు సంజీవరెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ వర్గీయులు వేర్వేరు జాబితాలు అందించినట్లు సమాచారం. అదేవిధంగా పాక్ జాతీయులను ఇక్కడి నుంచి పంపించి వేయాలనే డిమాండ్‌తో ఆ పార్టీలోని రెండు వర్గాలు వేర్వేరుగా అధికారులకు మంగళవారం వినతిపత్రాలు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకం, బీజేపీకి మంచి ఆదరణ ఉన్నా స్థాని కంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో తామేమీ చేయా లోననే మీమాంస క్రియాశీల కార్యకర్తలు, ముఖ్యనేతల్లో నె లకొంది. పార్టీ అధిష్టానం స్పందించి ఆధిపత్యపోరుకు చెక్‌పెట్టి పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్దపల్లిపై ‘బండి’ మార్క్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్, ప్రధాన కార్యదర్శిగా దుగ్యాల ప్రదీప్‌కుమార్ పనిచేసిన సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు పార్టీవర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో రామకృష్ణారెడ్డి.. బండి సంజయ్‌ను వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టినా.. ప్రస్తుత సమీకరణలను బట్టి దుగ్యాల ప్రదీప్‌ను ఒంటరిని చేస్తే రాష్ట్ర కమిటీలో సంజయ్‌కు, పెద్దపల్లి సెగ్మెంట్లో గుజ్జులకు ఎదురు ఉండదనే ఆలోచనతో కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్‌తో గుజ్జుల దోస్తీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గుజ్జులకు సన్నిహితుడైన కర్రె సంజీవరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. -
చట్టాలపై అవగాహన ఉండాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా జడ్జి స్వ ప్నరాణి అన్నారు. చిన్నకల్వలలో మంగళవా రం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. చట్టాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తున్నామని, ఉచిత న్యాయ సేవలు అందిస్తామని అన్నారు. పంచాయతీ కార్యదర్శి రణధీర్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి చర్యలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ తెలంగా ణ యాష్‌పాండ్ సమీపంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత తెలిపారు. ప్లాంటులోని 33 ఎకరాల్లో 33 వేల రకాల మొ క్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ఈడీ ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్టీపీసీ కృషి చేస్తోందన్నారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిండచమే లక్ష్యమన్నా రు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ సహకా రంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. జనరల్ మేనేజర్లు త్రిపాఠి, ముకుల్ రాయ్, సింఘా రాయ్, ఏజీఎం బిజయ్‌కుమార్ సిక్దర్, అధికారులు, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో సదస్సులు ఎలిగేడు: భూభారతి చట్టం ద్వారా భూసంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు పైలెట్ ప్రా జెక్టుగా ఎంపికచేసిన ఎలిగేడు మండలంలోని ఎలిగేడు, బుర్హాన్‌మియాపేటలో రెండోరోజు మంగళవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఎలిగేడులో 115, బుర్హాన్‌మియాపేటలో 60 దరఖాస్తులు అందాయని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. తహషీల్దార్ బషీరొద్దీన్, కలెక్టరేట్ సూరింటెండెంట్ యక్కన్న, డెప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్ఐలు చంద్రశేఖర్, జయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే అప్పులుపాలకుర్తి(పెద్దపల్లి): పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరా వు అన్నారు. కుక్కలగూడూరులో మంగళవా రం నిర్వహించిన జైబాపు..జైభీమ్.. జైసంవి ధాన్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, నాయకులు జంగ రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై సీఎం శ్రద్ధ పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని హర్కర వేణుగోపాలరావు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో స్థానిక నాయకులు రమేశ్‌గౌడ్, అనిల్, శ్రీనివాస్ తదితరులు ఆయనను కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం పెద్దపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చిన ఆర్టీసీ బస్‌డిపో, బైపాస్‌రోడ్డు, జిల్లా కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రి భవన ఆధునికీకరణ తదితర పనులు జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో సాగుతున్నాయని హర్కర తెలిపారు. సమ్మెకు ఆశ వర్కర్లు సైపెద్దపల్లిరూరల్: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెలో ఆశ వ ర్కర్లు పాల్గొంటారని ఆశ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి తెలిపారు. మంగళవారం మెడికల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అదజేశారు. ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌక ర్యం కల్పించాలని ఆమె కోరారు. నాయకులు శోభారాణి, రేణుక, అనురాధ, కవిత, నిర్మల, సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ బాహుబలి
● వాహనాల ఫిట్నెస్ ఇక పక్కా.. ● అందుబాటులోకి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ● ఏఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌తో సామర్థ్య పరీక్షలు ● త్వరలో రూ.8 కోట్ల యంత్రసముదాయం ఇన్స్టాలేషన్ ● కేంద్రం ఆదేశాలతో తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణం ● ఫిట్నెస్ వివరాలు నేరుగా ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకప్పుడు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో ఏదోలా నెట్టుకొచ్చేవారు. ఇందులో అక్రమాలకు పుష్కలంగా ఆస్కారం ఉండేది. ఫలితంగా ఫిట్‌నెస్‌లేని వాహనాలు రోడ్ల మీద అమాయకులను బలిగొన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై అలాంటి రోడ్డు ప్రమాదాలేవీ జరగకుండా రోడ్డు భద్రతలో భాగంగా.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) అనే భారీ యంత్ర సముదాయాన్ని ఇన్స్టాల్ చేయనున్నారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈ యంత్ర సముదాయం.. ఆటోమేటెడ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (ఏఎఫ్ఎంఎస్) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేయనుండటం గమనార్హం. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్ బాధ్యతలను ఆర్అండ్బీ అధికారులు తీసుకున్నారు. పూర్తి అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఈ భారీ యంత్రాల సముదాయం ఇకపై ఉమ్మడి జిల్లాలోని అన్ని లైట్ మోటార్ వెహికిల్స్ నుంచి భారీ యంత్రాల వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయనుంది. ఏటీఎస్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ఒక యంత్రం కాదు. ఇది వాహనాల ముఖ్యమైన విడిభాగాల సామర్థ్యాన్ని కచ్చితంగా మదించి రిపోర్ట్ ఇచ్చే బహుళ యంత్ర సముదాయం. ఎందుకంటే వాహనంలో ఏ భాగం సరిగా పనిచేయకున్నా.. అది ప్రమాదాలకు దారితీస్తుంది. పైగా ప్రస్తుతం మాన్యువల్‌గా జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికెట్లలో అనేక లోపాలు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అలాంటి లోపాలు నివారించేందుకు ఏకరూపకంగా, దోషరహితంగా, పూర్తి కంప్యూటీకరణ చేసిన ఏటీఎస్ యంత్రాలతో కచ్చితమైన ఫిట్నెస్ రిపోర్టు ఇవ్వడం దీని ప్రత్యేకత. హెడ్‌లైట్, స్టీరింగ్, టైర్ కోసం స్లిప్‌టెస్ట్, సస్పెన్షన్, ఇంజిన్, నాయిస్, ఎయిర్పొల్యుషన్.. ఇలా ప్రతీ విడిభాగం పనితీరును పకడ్బందీగా తనిఖీ చేసి ఆటోమేటెడ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (ఏఎఫ్ఎంఎస్) రిపోర్ట్ ఇస్తుంది. ఆ వెంటనే.. ఆ రిపోర్ట్‌ను కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ‘వాహన్–పరివాహన్’ పోర్టల్‌కు చేరవేస్తుంది. ఇలా ప్రతీ బండి సామర్థ్యం, దాని వివరాలు అన్నీ దేశంలో ఎక్కడ నుంచైనా అధికారులు చూసే వీలుంటుంది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని గ్రానైట్, ఇసుక, మైనింగ్, బొగ్గు, రైస్‌మిల్లుల కోసం నడిచే భారీ వాహనాలు ఇకపై ఈ యంత్రాలతో ఫిట్నెస్ తీసుకోవాల్సిందే. పాత వాహనాలకు ఫిట్నెస్ లేకపోతే ఒకటి రెండు సార్లు అవకాశం ఇస్తారు. అయినా మార్పు రాకపోతే ఎండ్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేసి ఆ వాహనాలను స్క్రాప్‌కు పంపిస్తారు. రెండెకరాల స్థలంలో.. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు ఒక ఏటీఎస్ యంత్ర సముదాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ యంత్ర సముదాయాన్ని ఇన్స్టాల్ చేయనున్నారు. ఇది ఉమ్మడి జిల్లా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించనుంది. భారీ వాహనాలకు 1500 చదరపు మీటర్ల స్థలం కావాల్సి వస్తుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని హెవీ, లైట్ మోటార్ వెహికిల్స్‌ను బట్టి.. ఇక్కడ నాలుగు లేన్లు అవసరమవుతాయని ఇందుకోసం ఎకరంన్నర నుంచి రెండెకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ షెడ్లు, వచ్చే వాహనాల పార్కింగ్, డ్రైవర్ల కోసం వెయిటింగ్ రూం, సీటింగ్ ఏర్పాటు, టాయిలెట్లు, జనరేటర్లు తదితరాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్, షెడ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన అంతా కేంద్రం మార్గదర్శకాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేయనుంది.15ఏళ్లు నిండిన వాహనాల వివరాలుజిల్లా వాహనాలు కరీంనగర్ 1,58,129 జగిత్యాల 4,283 పెద్దపల్లి 9,660 రాజన్నసిరిసిల్ల 2,039 మొత్తం 1,74,111 నోట్: ఆటోరిక్షా, కాంట్రాక్ట్ క్యారేజ్, విద్యాసంస్థల బస్సులు, గూడ్స్క్యారేజ్, మ్యాక్సీ క్యాబ్, మోటర్ క్యాబ్, కారు, ద్విచక్రవాహనం, ప్రైవేట్ సర్వీస్ వెహికిల్, స్టేజీ క్యారేజ్, ట్రాక్టర్, ట్రైలర్‌తో కలిపి. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఆరోగ్య ఉపకేంద్రాలు, పాఠశాలలు, ప్రహరీలు, వసతి గృహ భవన మ రమ్మతులపై ఆరా తీశారు. ఈఈ గిరీశ్‌బాబు, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారంలోగా కూల్చివేతలు పూర్తిచేయాలి కొత్త భవన నిర్మాణం కోసంన ఆస్పత్రి పాతభవనా న్ని కూల్చివేతలు వారంరోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో చేపట్టిన కూల్చివేత పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. సూపరింటెండెంట్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు. రోడ్డు పనులు వేగవంతం మంథని/రామగిరి: వరంగల్–మంచిర్యాల మధ్య చేపట్టిన జాతీయ రహదారి సీఎన్జీ పనులను పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంథని మండలం వేంపాడు, పుట్టపాక, రామగిరి మండ లం ఆదివారంపేట వద్ద చేపట్టిన జాతీయ రహదా రి పనులను కలెక్టర్ పరిశీలించారు. మంథని మా ర్కెట్ యార్డు, ఎగ్లాస్పూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పాత పాలకేంద్రంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్లు కుమారస్వామి, సుమన్, గిర్దావర్లు మహేశ్, రవిశంకర్ తదితరులు ఉన్నారు. -
పైసలిస్తేనే ‘అన్‌ఫిట్’
● సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ దందా ● దృష్టి సారించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు ● కొత్తగూడెంలో ఏసీబీ వలకు చిక్కిన పెద్దచేప ● లోతుగా కూపీలాగుతున్న అఽధికారులు ● అప్రమత్తమైన సింగరేణి యాజమాన్యం గోదావరిఖని: సింగరేణిలో కార్మికుల మెడికల్ అన్‌ఫిట్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. దళారులు రంగ ప్రవేశం చేసి ఒక్కో కార్మికుడి నుంచి రూ.6 లక్షల నుంచి రూ. 8లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తూ రూ.కోట్లు కూడబెడుతున్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు, మెడికల్ బోర్డులో దందాను అరికట్టేందుకు సింగరేణి సీఎండీ బలరాం కొత్తగూడెంలో ఏసీబీ డీఎస్పీస్థాయి అధికారిని నియమించారు. అవినీతిని అరికట్టేందుకు నిఘా పెట్టాలని ఏసీబీ ఐజీకి సీఎండీ విజ్ఞప్తి చేశారు. మొదట్లో దళారీ వ్యవవస్థ వెనుకడుగు వేసినా.. ప్రస్తుతం మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారసులను ఉద్యోగంలోకి తీసుకునేలా కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇలా కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ములో పైరవీదారుకు రూ.లక్ష, మిగతా సొమ్ము అధికారులకు తలాకొంత పంచుతున్నారని అంటున్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కాకుంటే ఖర్చుల కోసం రూ.లక్ష ఉంచుకుని, మిగతా సొమ్ము వాపస్ ఇస్తున్నారు. కొందరైతే వాపస్ ఇవ్వకపోవడంతో చాలాచోట్ల పంచాయితీలు ఠాణా వరకూ వెళ్తున్నాయి. పట్టుబడిన అవినీతి తిమింగళం మెడికల్ ఇన్వాలిడేషన్ పేరిట దందాకు పాల్పడుతున్న ఓ నాయకుడిని కొత్తగూడెం ఏసీబీ డీఎస్పీ మంగళవారం అదుపులోకి తీసుకోవడం, బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి వరకు లావాదేవీలు సాగినట్లు గుర్తించడంతో దందా మళ్లీ ఊపందుకున్నదానికి బలం చేకూర్చినట్లయ్యింది. దందాలో అన్ని ఏరియాల్లో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ దందాలోని సదరు నేతకు అన్ని ఏరియాలతో లింక్‌లు ఉన్నట్లుగా సమాచారం. యా జమాన్యం ఈవిషయంలో లోతుగా ఆరా తీస్తోంది. గతంలో కొత్తగూడెం ప్రాంతంలో పనిచేసిన ఓ అధికారి విషయంలో కూడా సీరియస్ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దందా ఎందుకు సాగుతోంది? సింగరేణి కార్మికుల వారుసులకు మెడికల్ ఇన్వాలిడేషన్తో కారుణ్య నియామాల ద్వారా ఉద్యో గం ఇస్తున్నారు. ఇందుకోసం కొత్తగూడెం ప్రధా న కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీనెల సుమారు 200 మంది వరకు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేస్తున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు ఉండి, కచ్చితమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అర్హులు. వీటిని ఆసరాగా చేసుకుంటున్న పైరవీకారులు.. తాము చెప్పిన వారికే మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ అవుతుందని, లేకుంటే అదే ఉద్యోగం చేయాల్సి వస్తుందని, ఈలోగా రెండేళ్ల గడువు తీరిపోతుందని కార్మికులను బెదిరిస్తూ దరఖాస్తుదారులతో బేరసారాలకు దిగుతున్నారు. వీరిలో 80 శాతం మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ సక్సెస్‌కావడంతో సహజంగానే లంచం ఇచ్చుకుంటున్నారు. అయితే, సింగరేణి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా అవినీతి ఆగడంలేదు. యాజమాన్యం తీరుతోనే.. కొందరు కార్మికులకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినా, మరికొందరిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లినా మెడికల్ అన్‌ఫిట్ చేసేందుకు డాక్టర్లు నిరాకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ముట్టజెప్పి, దర్జాగా నడుచుకుంటూ వెళ్లేవారిని అన్‌ఫిట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా బోర్డు అనుసరిస్తున్న తీరుపై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈక్రమంలోనే తాము మెడికల్ ఇన్వాలిడేషన్ అయి తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలనే ఆశతో కార్మికులు తప్పుదారి ఎంచుకుంటున్నారు. రెండేళ్ల నిబంధన తొలగిస్తే.. మెడికల్ ఇన్వాలిడేషన్కు సర్వీసు కనీసం రెండేళ్లు ఉండాలనేది కంపెనీ నిబంధన. దీనిని తొలగిస్తే దందా నిలిచపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలోనే కాకుండా రామగుండం, బెల్లంపల్లి రీజియన్లలోనూ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలంటున్నారు. తద్వారా కార్మికుల్లో భయం తొలగిపోతుందంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో దందా రామగుండంప్రాంతంలో మెడికల్ దందా జోరు గా సాగుతోంది. దళారులు ఏజెంట్లను నియమించుకుని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పెద్దమొత్తంలో వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఎవరినీ నమ్మొద్దు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మవద్దు. ఇలాంటి వారి సమాచారాన్ని విజిలెన్స్‌కు చేరవేయాలి. మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోంది. దళారులు ఎంతటివారైనా వదిలేది లేదు. ఏసీబీ, సింగరేణి విజిలెన్స్‌తో నిఘా కొనసాగుతోంది. – బలరాం, సీఎంఈ, సింగరేణి -
‘ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారు?’
పెద్దపల్లి: మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదనే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటని సంజయ్ ప్రశ్నించారు. ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారంటూ బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు.‘కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. మావోయిస్టులు దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా?, మావోయిస్టుల సానుభూతి పరులు సాధించిందేంటి?, మావోయిస్టులు ఎవరున్నా తుపాకీ వీడి లొంగిపావాల్సిందే.. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. పౌర హక్కుల సంఘం నేతలారా.. నక్సల్స్ నచ్చజెప్పండి’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు బండి సంజయ్. కేవలం సర్వే మాత్రమే జరిగిందన్నారు. ఇక్కడ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు. ప్రతి ఇంటికి కచ్చితంగా వెళ్లి నిర్వహించేది కులగణన అని అన్నారు. జనగణన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కులగణన చేస్తుందన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు బండి సంజయ్. -
బీజేపీని బలోపేతం చేద్దాం
● నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి పెద్దపల్లిరూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీజేపీ సంస్థాగత సంరచన జిల్లాస్థాయి వర్క్‌షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జిల్లా సంస్థాగత సంరచన ప్రభారీ ఎర్రవెల్లి రఘునాథ్‌తో కలిసి సమావేశంలో మాట్లాడారు. ఓటర్లకు బీజేపీతో అనుబంధం పెంచేలా వ్యూహాత్మకంగా వ్యవహరించేలా కార్యకర్తలకు శిక్షణ ఇస్తోందన్నారు. సంస్థాగత పరిపక్వతను పెంచి ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, పర్శ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
లేబర్కోడ్లు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్‌కోడ్‌లతో మా హక్కులన్నీ పోతాయి. కార్మిక చట్టాలను యథాధావిధిగా ఉంచాలి. కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్య, వైద్యం అందజేయాలి. ఒకరోజు సమ్మెతో కేంద్రం దిగివస్తుంది. – రత్న శ్రీనివాస్, మెకానిక్, ఆర్ఎఫ్సీఎల్ కొత్త గనులు రావాలి కొత్త బొగ్గుగనులు రావాలి. కొత్త ఉద్యోగాలు ఇవ్వావాలి. టెండర్లను రద్దు చేయాలి. కోల్‌బ్లాక్‌లను సింగరేణి సంస్థకే కేటాయించాలి. కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి. ఇందుకోసం ఈనెల 20న సమ్మె చేసుడే. – బోగె సతీశ్‌బాబు, జనరల్ అసిస్టెంట్, జీడీకే–5 ఓసీపీ సమ్మెతోనే హక్కులు సమ్మెతోనే కార్మికుల హక్కులు సాధ్యం. కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలి. లేబర్కోడ్లు రద్దు చేయాలి. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా కేంద్రప్రభుత్వం ఆదేశించాలి. సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తాం. – చింతల అంజి, ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు -
పేదలకే ఇందిరమ్మ ఇళ్లు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అర్హులైన పేదలకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెగడపల్లిలో ఆదివారం ఇందిరమ్మ గ్రామ క మిటీలతో సమీక్షించారు. ఇళ్లకు ముగ్గు పోయడం, బిల్లులు మంజూరు చేయించడం కోసం కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులకు తగ్గినా 600 చదరపు అడుగులకు పెరిగినా బిల్లు రాదనే విషయాన్ని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఓ పెట్రోల్ పంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. నాయకులు సారయ్యగౌడ్, లంక సదయ్య, రామిడి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్యాణ మండపం ప్రారంభం ఎలిగేడు: ధూళికట్టలోని పద్మనాయక వెలమ సంఘం నిర్మించిన పద్మనాయక కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు ప్రారంభించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. మండే ఎండల్లో బారులు ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ లెవల్ క్రాసింగ్ గే ట్ వద్ద ఆదివారం వాహనాలు సుమారు అర్ధగంటపాటు బారులు తీరాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు రామగుండం నుంచి కాజీపేట వైపు వెళ్లే గూడ్స్ రైలు నెమ్మదిగా వెళ్లడం, గేట్‌వేసి ఉండడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. మండే ఎండల్లో వా హనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దా దాపు అర్ధకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. గూడ్స్ రైలు వెళ్లాక గేట్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆటోవాలాలను ఆదుకోవాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): ఆటోవాలాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ కో రారు. గతనెల 25న మెదక్‌లో ప్రారంభించిన ఆటోయాత్ర ఆదివారం పట్టణానికి చేరుకుంది. రవికుమార్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక తాము ఉపాధి కోల్పోయామన్నారు. సుల్తానాబాద్ ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల నాంపల్లి, ఆటోడ్రైవర్లు కోటగిరి స్వామి, ఐలయ్య, తిరుపతి, రాజ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పాక్ జాతీయులు వెళ్లిపోవాలిపెద్దపల్లిరూరల్: పాక్ జాతీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చే శారు. ఇందుకోసం పోలీసులు తనిఖీలు విస్తృతం చేసి పాక్ జాతీయులను గుర్తించాలన్నారు. జిల్లాకేంద్రంలోని కమాన్ వద్ద ఆదివారం పాకిస్తాన్ దిష్టిబొమ్మను బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు రాకేశ్, రమేశ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. జమ్ముకశ్మీర్ పహల్గాంలో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన మారణకాండ శోచనీయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, ఈర్ల శంకర్, రాజం మహంతకృష్ణ, ఎర్రోళ్ల శ్రీకాంత్, పడాల శ్రీధర్, సతీశ్, పడాల శ్రీనివాస్, ఉమేశ్, అంజి, సతీశ్, వేణు, మధుకర్, శివ, సాయి, సురేందర్, మహేశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. భూములు పంపిణీ చేయాలి ఓదెల(పెద్దపల్లి): మడకలోని ప్రభుత్వ భూ ములను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని హైదరాబాద్ సీసీఎల్ కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆదేశించింది. ప్రభుత్వ భూమిని కొందరు భూ స్వాములు ఆక్రమించి సాగు చేసుకుంటున్నార ని సీనియర్ కాంగ్రెస్ నేత గొస్కె రాజేశం ఇటీ వల సీసీఎల్తోపాటు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే నంబరు 510, 506, 492 లోని సుమారు 10 ఎకరాలను పేదలను గుర్తించి పంపిణీ చేయాలని సీసీఎల్ ఆదేశాలు జారీచేసింది. స్పందించిన కలెక్టర్.. ఓదెల తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. -
‘మరుగు’నపడుతున్నాయి..
సంపూర్ణ పారిశుధ్య సాధన, మల, మూత్రరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది. పల్లెవాసుల అవసరాల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగు దొడ్లు వినియోగించేవారు లేక నిరుపయోగంగా మారాయి. సర్పంచుల పదవీకాలం ముగియడం, ప్రత్యేకాధికారుల పాలన రావడంతో పల్లెలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానంగా సామూహిక మరుగుదొడ్లు ఎందుకూ పనికిరాకుండాపోతున్నాయి. వాటిని వినియోగంలోకి తేవాలని జిల్లావాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సమ్మె చేసుడే..
● సై అంటున్న సింగరేణి కార్మికులు ● వెనుకాడబోమంటున్న ఎన్టీపీసీ ఉద్యోగులు ● ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సిబ్బంది సైతం ● బ్యాంకులు, ఎల్ఐసీ ప్రతినిధులు కూడా ● 20న సార్వత్రిక సమ్మె ● ఆందోళనలు ఉధృతం చేసిన కార్మిక సంఘాల నాయకులుపారిశ్రామిక ప్రాంతంలో ఉద్యోగులు(కాంట్రాక్టు కార్మికులతో కలిపి) గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికు లు, ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికులు ఈనెల 20న సమ్మె చేసేందు కు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం వివిధ యూనియన్లు కార్యాచరణను అమలు చేస్తున్నా యి. ఒకరోజు సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ పరిశ్రమలతోపాటు ప్రై వేట్ సంస్థలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కోల్‌బెల్ట్‌లోని సింగ రేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం పరిశ్రమ ల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు. బ్యాంక్‌లు, ఎల్ఐసీ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు స్తంభించే అవకాశం ఉందంటు న్నారు. బీజేపీ అనుబంధ బీఎంఎస్ సమ్మెకు దూ రంగా ఉండగా.. జాతీయ కార్మిక సంఘాలైన ఏ ఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంస్ సమ్మె విజయవంతానికి వ్యూహాత్మకంగా ముందుకు సా గు తున్నాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబ ర్ కోడ్లుగా సవరించేందుకు కేంద్రప్రభుత్వం చే స్తున్న కుట్రలను వ్యతిరేకించాలనే తదితర డి మాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చాయి. గేట్మీటింగ్ల ద్వారా ప్రచారం.. ఉద్యోగులు, కార్మికులు టోకెన్ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. దీనికోసం ఆయా ప్రాంతాల్లో గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేస్తున్నాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్, విప్లవ కార్మిక సంఘాలు ప్రచారం ముమ్మరం చేశాయి. బొగ్గుగనుల్లో కార్మిక చట్టాలు రద్దు.. బొగ్గు గనుల్లో కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లను ప్రవేశ పెట్టారని, దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్మినెంట్ కార్మికులతోనే బొగ్గు వెలికితీతలు పనులు చేపట్టాలని ఆ సంఘాలు కోరుతున్నాయి. సింగరేణిలో ప్రధాన డిమాండ్లు ఇవే.. ● రద్దు చేసిన కార్మిక చట్టాలను కొనసాగించాలి. ● వాటిస్థానంలోని కోడ్ల విధానం రద్దు చేయాలి. ● సింగరేణి సంస్థ యంత్రాలు, కార్మికులతోనే బొగ్గు వెలికి తీత పనులు చేపట్టాలి. ● సత్తుపల్లి ఓసీపీలో ప్రైవేట్ సంస్థ వెలికి తీస్తున్న ఓబీ(మట్టి)ని సింగరేణి స్థలంలో పోయడానికి అవకాశం ఇవ్వవద్దు. ● తాడిచర్ల–2, వెంకటాపూర్ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే ఇవ్వాలి. ● సింగరేణికి రావాల్సిన రూ.40వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ● కొత్త బొగ్గు గనులు తవ్వించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.(బ్యాంక్‌లు, ఎల్ఐసీ, రైల్వే, సంఘటిత, అసంఘటిత రంగంలోని ఉద్యోగులు అదనం) సింగరేణి 77,000 ఎన్టీపీసీ 5,290 ఆర్ఎఫ్సీఎల్ 1,480 అల్ట్రాటెక్(కేశోరాం) 1,325 -
రేపు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం
గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావే శం ఈనెల 6న జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని మున్సిపల్, మూడు మండలాల నాయకుల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు. సమావేశానికి పెద్దసంఖ్యలో కాంగ్రెస్నాయకు లు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తదితరులు హాజరవుతారని ఠాకూర్ వివరించారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రె స్ పన్నిన కుట్రలను పటాపంచలు చే సి ప్రజలకు వాస్తవాలను వివరించడానికి నియోజకవర్గంలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గోదావరి తీరంలో సోమవారం ఉదయం 11 గంటలకు చర్చా కార్యక్రమం ఏర్పా టు చేసినట్లు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తెలిపారు. బీఆర్ఎస్ మండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, దావ వసంతతోపాటు సాగనీటి నిపుణుడు వీరమల్ల ప్రకాశ్ హాజరవుతారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్ర లపై ఇందులో కూలంకశంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గానికి చెందిన ప్రజలు, మేధావులు, తెలంగాణవాదులు హాజరై కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, వాస్తవ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. -
వీహెచ్‌పీ నేతల నిరసన
గోదావరిఖనిటౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడంతోపాటు పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట ఆదివారం ధర్నా చేశారు. డీఎం నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. వీహెచ్‌పీ విభాగ కార్యదర్శి అయోధ్య ర వి మాట్లాడుతూ, బస్టాండ్‌లో హిందూ దేవతలను దూషిస్తూ మతప్రచారం చేయడం సరికాదన్నారు. మతమార్పిడిలను అడ్డుకోవాలని డి మాండ్ చేశారు. మ్యాడగోని రవీందర్, సంపత్‌యాదవ్, రాజు, సంపత్, లింగన్న, రాజు, శ్రీధ ర్‌కుమార్, దిగంబర్, అంజయ్య, అరవింద్, వెంకటేశ్, రమేశ్‌యాదవ్, అనిరుధ్ ఉన్నారు. -
బెట్టింగ్‌కు బానిసై..
బలిరామగిరి(మంథని): ఆన్లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ చంద్రకుమార్ కథనం ప్రకారం.. సెంటినరీ కాలనీ టీ2– 185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల విజయ, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయ గృహిణి కాగా, రవిశంకర్ ఓసీపీ–2 షావెల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. చిన్న కుమారుడు వేముల వసంత్ కుమార్ (27) ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2 పరిధిలోని సీ–5 కంపెనీలో వోల్వో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ యాప్‌లో నష్టాలు రావడంతో.. ఇకనుంచి వాటి జోలికి వెళ్లవద్దని గతేడాది డిసెంబర్లో తండ్రి రవిశంకర్ మందలించాడు. రూ. 4 లక్షల వరకు అప్పు తీర్చాడు. కానీ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడిన వసంత్ కుమార్.. నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల పైప్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బంధువుల ఇంట్లో ఒకరు మృతి చెందడంతో.. వారిని పరామర్శించేందుకు వెళ్లి వచ్చిన దంపతులు.. కుమారుడి ఆత్మహత్యతో నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని సమీప డిస్పెన్సరీకి తరలించగా అప్పటికే వసంత్ కుమార్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ వివరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు.ఇరవై ఏళ్ల క్రితం వివాహంకరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.ఇరవై రోజుల క్రితం పంచాయితీతరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. -
ప్రమాదకర కల్వర్టు.. స్పందించిన కమిషనర్
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలోని ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొ త్త కల్వర్టు ప్రమాదకరంగా ఉండడం, ఇరువైపులా సైడ్‌వాల్ నిర్మించకపోవడంతోపాటు కనీ స ం రోడ్డుకు సమానంగా మట్టి కూడా పోయలేదు. దీంతో ప్రమాదాలు చో టు చేసుకుంటాయి. ఈ సమస్యపై మా ర్చి 21న ‘సాక్షి’లో కథ నం ప్రచురించగా, బల్దియా కమి షనర్ జె.అరుణశ్రీ స్పందించారు. మార్చి 25న కల్వర్టును పరిశీలించి యుద్ధప్రాతిదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. కృతజ్ఞతలు ఫైవింక్లయిన్ చౌరస్తా సమీపంలో కొత్తగా నిర్మించిన కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకున్నందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. ము న్సిపల్ కమిషనర్, అధికారులు వెంటనే స్పందించారు. పనులు ప్రారంభించారు. 33వ డివిజన్ పరిధిలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. – మద్దెల దినేశ్, ఫైవింక్లయిన్ ఏరియా, గోదావరిఖని -
వాహనాలు పార్కింగ్ వీడాయి
జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో చేపల మార్కెట్ లోపల వాహనాలు పార్క్ చేస్తుండటంతో కొనుగోలుదారులు నిలబడటానికి స్థలం లేకుండాపోయింది. ఈ సమస్యపై మార్చి 19న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందన స్పందించారు. చేపల మార్కెట్ నుంచి వాహనాలు తొలగించాలని తమ సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి వాహనాలను తొలగింపజేశారు. కాగా, వాహనాల తొలగింపుతో మార్కెట్లో సౌకర్యవంతంగా ఉందని, తక్షణమే స్పందించిన బల్దియా సిబ్బందితో పాటు వార్త ప్రచురించిన ‘సాక్షి’కి కొనుగోలుదారులు ధన్యవాదాలు తెలిపారు. -
బాగైన చేతిపంపు.. తీరిన నీటి కొరత
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రంలోని ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో ఉన్న చేతిపంపు పని చేయడం లేదని, ఆప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారని మార్చి 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఎంపీడీవో జయశీల చేతిపంపును బాగు చేయించారు. అధికారులు త్వరగా స్పందించారు బోయినపల్లి ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో బోరు చేడిపోయింది. మా సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, అధికారులు వెంటనే స్పందించారు. ఎంపీడీవో ఆదేశాలతో బోరుకు మరమ్మతు చేశారు. మా ఏరియా ప్రజలకు నీటి కొరత తీర్చిన ‘సాక్షి’కి సలాం. – మాడిచెట్టి శ్రీనివాస్, బోయినపల్లి -
ప్రాణం మీదికి తెచ్చిన మామిడికాయ వక్క
● ఊపిరాడక తల్లడిల్లిన బాలుడు పాలకుర్తి(రామగుండం): మామిడికాయ వక్క గొంతులో ఇరుక్కుని బాలుడు ఊపిరాడక నరకయాతన అనుభవించిన ఘటన శనివారం పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ పదినెలల వయసు ఉన్న బాలుడు ఇంట్లో మామిడివక్క మింగాడు. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడలేదు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బైక్‌పై పెద్దపల్లికి తరలిస్తూ కన్నాల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఎదురుగా 108 వాహనం రావడంతో అందులో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ఎయిర్వేను కొంతమేర క్లియర్ చేస్తూ పెద్దపల్లికి చేరుకున్నారు. పెద్దపల్లిలో పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందంటూ కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో మరో అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ విషయమై సోషల్‌మీడియాలో విభిన్న కథనాలు వైరల్ అయ్యాయి. చికిత్స పొందుతూ యువకుడు మృతిసైదాపూర్(హుస్నాబాద్): నాలుగేళ్ల ప్రాయంలో ఊహ తెలియక ముందే తల్లిదండ్రులను కోల్పోయాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. నా అనే వారు ఎవరూ లేరు. ఒంటరి తనం, అనారోగ్యం భరించలేక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన అనగోని సంపత్–సుజాత దంపతుల కుమారుడు వికాస్(27). నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి తాత, నాన్నమ్మ లక్ష్మయ్య, లక్ష్మి వద్ద పెరిగాడు. హుస్నాబాద్‌లోని ఓ షాపులో పని చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. ఒంటరితనం, అనారోగ్యంతో ఐదురోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. -
అడ్డు తొలగింది.. రోడ్డు పడింది
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలకసంస్థ 9వ డివిజన్ పరిధిలోని అలకాపురికాలనీ నుంచి సిరిసిల్ల బైపాస్ (ఎన్టీఆర్ చౌరస్తా) వైపు వచ్చే రోడ్డు ముగింపు వద్ద పనులు అసంపూర్తిగా వదిలేశారు. విద్యుత్ పోల్, లైన్లు అడ్డుగా ఉండడంతో పూర్తి చేయలేదు. సీసీ రోడ్ ఎత్తుగా, ఆర్అండ్బీ మెయిన్ రోడ్ దిగువన ఉండడం, కిందినుంచి నాలా వెళ్తుండడంతో, రెండింటికీ కనెక్టివిటీ లేక సీసీ రోడ్డు చివరలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో రాత్రివేళ వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యేవారు. ఓ వ్యక్తి అందులో శవమై తేలాడు కూడా. ఏళ్ల తరబడి సమస్య అలానే ఉండడంతో అలకాపురికాలనీకి చెందిన దుంపేటి రాము మార్చి 12న ‘సాక్షి’ ద్వారా వెలుగులోకి తీసుకురాగా, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ స్పందించారు. ట్రాన్స్‌కో అధికారులతో పలు మార్లు చర్చలు జరపడంతో, రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్చి 27న తొలగించారు. దీంతో సీసీ, మెయిన్‌రోడ్డులను కలుపుతూ కల్వర్ట్ నిర్మించి, రోడ్డు వేయడంతో సమస్య పరిష్కారమైంది. ధన్యవాదాలు మా కాలనీవాసులు నిత్యం ఎదుర్కొనే సమస్యను పరి ష్కరింపచేసిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. సీసీ రోడ్డు ను ఆర్అండ్బీ రోడ్డుకు కలపకపోవడం, కింద నాలా ఉండడంతో ఆ గొయ్యిలో చాలా మంది పడి గాయపడ్డారు. ‘సాక్షి’ ‘వాట్సప్ చేయండి’ శీర్షికలో మా కాలనీ వ్యక్తి రాము సమస్యను తెలియచేయడంతో అధికారులు స్పందించి వైర్లు, పోల్‌ను తొలగించి రోడ్డు వేశారు. – లోకేందర్రావు, అలకాపురికాలనీ, కరీంనగర్ -
కలిసుంటామని కడతేర్చాడు
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. ఇరవై ఏళ్ల క్రితం వివాహం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చే స్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇరవై రోజుల క్రితం పంచాయితీ తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. పిల్లలు పుట్టడం లేదని భార్యను చంపిన భర్త ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురిపై కేసు -
ప్రాణం తీసిన మామిడికాయలు
● చెట్టు పైనుంచి పడి వృద్ధుడు మృతి గోదావరిఖని: మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌లో నివాసముంటూ వండ్రంగి పనులు చేస్తున్న నాగవెల్లి బాలయ్య(70).. శనివారం ఉదయం తన ఇంటి వెనకాల ఉన్న మామిడి కాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. కర్రతో కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టు పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా బాలయ్య మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలయ్యకు భార్య నాగవెల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పింఛన్ డబ్బు కోసం బ్యాంక్‌కు వస్తే, వాహనం ఢీకొని ఓ వృద్ధుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు. స్థానికుల వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు రమావత్ బాల్య పింఛన్ డబ్బుల కోసం గొల్లపల్లిలోని బ్యాంక్‌కు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాల్య అపస్మారక స్థితికి వెళ్లాడు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లో చీమల తిరుపతిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమేశ్ తెలిపిన వివరాలు.. 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో చీమల తిరుపతి, రాగుల రాజశేఖర్, బోనగిరి రాకేశ్ నిందితులు. బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తుందని రాజీ పడదామని ప్రధాన నిందితుడు తిరుపతిని రాజశేఖర్, రాకేశ్ కోరారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. తిరుపతిని హత్య చేస్తే గతంలోని హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఈనెల 2న తిరుపతి నడుపుతున్న ఆన్లైన్ సెంటర్‌కు రాజశేఖర్, రాకేశ్ వెళ్లి అతడిపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. శనివారం నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
వ్యాధుల నియంత్రణకు చర్యలు
జ్యోతినగర్(రామగుండం): కీటకజనిత, సీజన ల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాల ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) అన్న ప్రసన్నకుమారి సూచించారు. వ్యాధు ల నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై మ ల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్), ల్యాబ్ టెక్నీషియన్లతో తన కార్యాలయంలో డీఎంహెచ్‌వో శనివారం సమీక్షించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెలలోనే అన్నిగ్రామాల్లోగల పబ్లిక్ వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయించాలన్నారు. ప్రతీరోజు సరఫరా చేసే తాగునీటిని క్లోరినేషన్ చేయాలని, ఆ తర్వాత పరీక్ష నిర్వహించి రికార్డు ల్లో నమోదు చేయాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తరలించాలని ఆదేశించారు. నీటిని ల్వ గుంతలను గుర్తించి పూడ్చి వేయాలని అ న్నారు. హోటళ్లల్లో పనిచేసే వారు, ఫుడ్ సప్లయర్స్‌కు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. హైపటైటిస్ – బి, టైఫాయిడ్ లాంటి లక్షణాలతో బాధపడేవారి నుంచి బ్లడ్ శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపించాలని అన్నా రు. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయంచేసుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాంపిల్ కలెక్షన్లు పెంచాలని, రిజెక్టెడ్ శాతం తగ్గించాలని అ న్నారు. కార్యక్రమములో డాక్టర్లు శ్రీరాములు, సుధాకర్‌రెడ్డి, రాజమౌళి పాల్గొన్నారు. ● డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి -
తాగునీటి కష్టాలకు చెక్
● సింగరేణి కార్మికవాడలకు ఇక సాఫీగా నీటి సరఫరా ● చివరిదశలో ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్ పనులు ● 60శాతం పూర్తయిన వాటర్ ఫిల్టర్ నిర్మాణం ● మూడునెలల్లో అందుబాటలోకి వచ్చే అవకాశం ● మిషన్ భగీరధ తరహాలో తాగునీటి సరఫరా గోదావరిఖని: సింగరేణి కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు యాజమాన్యం ముందుకు సాగుతోంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక కుటుంబాలకు మిషన్ భగీరథ తరహాలో తాగునీరు అందించాలనేది యాజమాన్య లక్ష్యం. ఈమేరకు గోదావరినది నుంచి నీటిని తీసుకుని ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ద్వారా శుభ్రం చేసి నల్లాల ద్వారా కాలనీలకు అందిస్తుంది. వేగంగా గ్రావిటీ ఫిల్టర్ పనులు.. ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని సింగరేణి కార్మిక కుటుంబాలకు గోదావరినది నుంచి పంపింగ్ ద్వారా రోజూ 35 ఎంఎల్డీ నీటిని అందించేందుకు రూ.20 కోట్లతో చేపట్టిన ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలకు ప్రస్తుతం పైపులైన్ల ద్వారా నీటిని అందిస్తోంది. గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో ఏర్పాటు చేసిన ఫిల్టర్ల ద్వారా ఫిల్టర్‌బెడ్ నుంచి భారీ విద్యుత్ మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తారు. ‘కాళేశ్వరం’తో తిప్పలు మూడేళ్ల క్రితం వరకు కార్మికవాడలకు నీటిసరఫరా సాఫీగానే సాగింది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తిప్పలు మొదలయ్యాయి. ప్రాజెక్టులోని బ్యాక్ వాటర్‌తో నదిలో నీటి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో నగరంలోని డ్రైనేజీ, ఆర్ఎఫ్సీఎల్ రసాయనాలు నేరుగా గోదావరినదిలో చేరి నీరు కలుషితమవుతోంది. ఈ నీటిని తాగిన కార్మిక కు టుంబాలు డయేరియా, మలేరియా బారిన పడుతున్నాయి. వర్షాకాలంలో సుమారు నెలరోజుల పాటు కలుషిత నీరే సరఫరా అవుతోంది. నదిలో, ఏరియాల వారీగా సింగరేణి యాజమాన్యం ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసినా కార్మిక కుటుంబాలకు కలుషిత నీరే దిక్కయ్యింది. రెండేళ్ల క్రితం మిషన్ భగీరథ తరహాలో.. తమకు మినరల్ వాటర్ అందించాలని సింగరేణి కార్మిక కుటుంబాల నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో మిషన్‌భగీరథ తరహాలో తాగునీరు అందించేందుకు రెండేళ్ల క్రితం అప్పటి సీఎండీ శ్రీధర్ నిధులు మంజూరు చేశారు. సాంకేతిక కారణాలతో ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ కోసం కేటాయించిన నిధులు నిలిచిపోయాయి. దీంతో ప్లాంట్ పనులు ఆగిపోయాయి. ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ఫిల్టర్ సమాచారం నీటి సామర్థ్యం (రోజూ ఎంఎల్డీ) 35 అంచనా వ్యయం (రూ.కోట్లలో) 20 రోజూ నీటి సరఫరా ఇలా ఏరియా నీటి సామర్థ్యం(ఎంఎల్డీ) ఆర్జీ–1 20 ఆర్జీ–2 10 ఆర్జీ–3 05సకాలంలో పూర్తిచేస్తాం ర్యాపిడ్ గ్రావిటీ నిర్మాణం సకాలంలో పూర్తిచేస్తాం. వర్షాలతో అప్పట్లో పనుల్లో జాప్యమైంది. అయినా, ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో పనులు పూర్తిచేస్తాం. మూడు నెలల్లోగా ర్యాపిడ్గ్రావిటీ ప్లాంట్ ప్రారంభిస్తాం. – లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1 శరవేగంగా ప్లాంట్ నిర్మాణం ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ నిర్మాణం కోసం సింగరేణి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఆర్జీ–1 ఏరియా జీడీకే–1, 3గని ఫ్యాన్‌హౌస్ సమీపంలో 35 ఎంఎల్డీ సామర్థ్యంతో ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్‌కు గతేడాది మార్చి 16న డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ భూమిపూజ చేశారు. పనుల ప్రారంభంలో రెండునెలలు జాప్యం జరిగింది. ప్రస్తుతం సివిల్ పనులు 80 శాతం, మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు 20శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సగటున 60శాతం పనులు పూర్తయ్యాయని వారు వివరించారు. -
సింగరేణిలో సమ్మెను విజయవంతం చేయాలి
గోదావరిఖని: బొగ్గు గనుల పరిరక్షణ కోసం, సింగరేణి పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 20 న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చే యాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. శనివారం స్థానిక హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఐక్యవేదిక నాయకు ల సమావేశంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ అధ్యక్షు డు ఐ.కృష్ణ, టీఎస్‌యూఎస్ నాయకుడు ఏడుకొండలు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని ధ్వజమెత్తారు. నారాయణ, నరేశ్, సారయ్య, రాయమల్లు, కుమారస్వామి, రాజేశం, మల్లేశం, ప్ర సాద్‌రెడ్డి, రవీందర్, రాజిరెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు సాఫీగా తాగునీటి సరఫరా
రామగుండం: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇదేసమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. అయినా, హైదరాబాద్ మహానగరానికి అవసరమైన నీటి సరఫరాకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధి కారులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ప్రా జెక్టులో ఇప్పుడు రెండు టీఎంసీల నీటి నిల్వలు అదనంగా ఉండడమే ఇందుకు కారణం. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వలు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148.00 మీటర్లుకాగా, నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 142.71 మీటర్లు ఉందని, 8.50 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదేరోజు నీటిమట్టం 141.23 మీటర్లు, ఉండగా నీటి నిల్వలు 6.38 టీఎంసీలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 134 మీటర్లకు పడిపోతే డెడ్ స్టోరేజీగా భావిస్తారని అధికారులు తెలిపారు. ఆ దశలో ప్రా జెక్టులో 0.690 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. మరోనాలుగు మీటర్లు తగ్గితే ఎత్తిపోతలు.. ప్రాజెక్టులో మరో ఆరు మీటర్ల నీటిమట్టం తగ్గితే నే హైదరాబాద్ మహానగరానికి ప్రతీరోజు 6.6 కేవీ సామర్ధ్యం గల ఆరు విద్యుత్ మోటార్ల సా యంతో 56 క్యూసెక్కులు(0.03 టీఎంసీ) నీటిని పంపింగ్ చేస్తారు. ఈలెక్కన ప్రాజెక్టు నీటిమట్టం 138.3 మీటర్లకు పడిపోతే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లో మోటార్లతో పంపింగ్ చేసేందుకు సాధ్యం కాదు. ప్రస్తుతం నాలుగు టీఎంసీల వ్యత్యాసం ఉండడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. రెండు టీఎంసీల నీటినిల్వలు తగ్గేందుకు కనీసం నెలరోజులు పడుతుందని, ఆలోగా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. -
పని సులభం.. సమయం ఆదా
ఒకప్పుడు తారు రోడ్డు నిర్మించేందుకు వందలాది మంది కార్మికులు రోజుల తరబడి పనిచేసేవారు. రాత్రింబవళ్లు పనిచేసినా నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేందుకు చాలా ఇబ్బందులు తలెత్తేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. అత్యాధునిక యంత్రసామగ్రి అందుబాటులోకి వస్తోంది. దీంతో గంటల్లోనే రహదారులు నిర్మిస్తున్నారు. పని సులభం కావడంతోపాటు ఎంతోసమయం ఆదా అవుతోంది. ఈ నేపథ్యంలోనే హెచ్‌కేఆర్ సంస్థ హైదరాబాద్– కరీంనగర్ – రామగుండం మధ్యగల రాజీవ్ రహదారిని శరవేగంగా మరమ్మతు చేస్తోంది. ఆధునిక యంత్రసామగ్రితో పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై పనుల్లో పాలుపంచుకుంటున్న ఆధునిక యంత్రాలు, వాహనాలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
పాలకుర్తి(రామగుండం): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రైతులను ఇ బ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చచించారు. ‘తూకం .. ఆలస్యం’ శీర్షికన శనివారం ‘సాక్షి’ కథ నం ప్రచురించడంతో స్పందించిన కలెక్టర్.. పెద్దపల్లి మండలం కురుమపల్లి, పా లకుర్తి మండలం బసంత్‌నగర్, కొత్తపల్లిలోని ధా న్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లలో ఎందుకు జాప్యం జరుగుతుందనే విషయంపై నిర్వాహకులను అడి గి వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పగటిపూట హ మాలీలు ధాన్యం తూకం వేయడం లేదని, రాత్రి వేళల్లోనే తూకం వేస్తున్నారని, లారీల కొరతతో నూ జాప్యమవుతోందని నిర్వాహకులు సమాధానమిచ్చారు. స్పందించిన కలెక్టర్.. ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను రప్పించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. అకాల వర్షాల తో ధాన్యం తడిసి రైతులు నష్టపోతారని, అలా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్నరకం ధాన్యాన్ని కూడా కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ఎఫ్‌సీఐ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని 24 గంటల్లోగా కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, వెయింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుకోవాల ని సూచించారు. తహసీల్దార్ జ్యోతి, ఆర్ఐ సంతోష్, ఏఈవో శశిధర్, సింగిల్‌విండో సిబ్బంది సదయ్య, పుట్ట వంశీ, నిర్వాహకులు సామంతుల రమేశ్, బీటీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు కలెక్టర్ కోయ శ్రీహర్ష -
రైల్వే అధికారికి సమ్మె నోటీసు
రామగుండం: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఈమేరకు జాయింట్ ప్లాట్ ఫర్ ఆఫ్ ట్రేడ్ యూనిట్స్, వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, అఖితభారత ఫెడరేషన్, సంత్ కిసాన్ మోర్చా, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదికలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా రైల్వే డిపో ఏడీఎంఈ అధికారికి రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు బొంకూరి మహేశ్, కె.తిరుపతి, ప్రదీప్, లాలూనాయక్, సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.రామాచారి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఐఎన్టీయూసీ అండ జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ఉద్యో గులు, కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి, ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా అన్నారు. స్థానిక ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శనివారం యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సుమారు 78ఏళ్లుగా కార్మికుల హక్కుల సాధనలో రాజీలేని పోరాటాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ సమస్యలను సైతం పరిష్కరించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటినుంచి కేజీబీవీల్లో వేసవి శిబిరాలు రామగుండం: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఈనెల 4 నుంచి 20వ తేదీ వరకు వేసవి శిబిరాలు నిర్వహించనున్న ట్లు డీఈవో మాధవరి తెలిపారు. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, కంప్యూటర్ నైపుణ్యాలు, అకడమిక్ ఎన్రిచ్మెంట్, స్పోకెన్ ఇంగ్లిష్, గ ణితం, శారీరక అభివృద్ధి, యోగా వంటి అంశాలపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. విద్యార్థిను లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని కోరారు. యోగా, విద్యార్థినులకు శిక్షణ ఇ చ్చేందుకు ఆసక్తిగల యువతులు 76610 23766 నంబరులో సంప్రదించాలని కోరారు. ప్రతీ రైతుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: ఆధార్‌తో దే శంలోని ప్రతీపౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీరైతుకు 11 నంబర్లతో కూడిన విశిష్ట సంఖ్య(యూనిక్ కోడ్ ) కేటాయించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) ఆదిరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టారన్నారు. ప్రతీరైతు తన భూ ముల వివరాతో కూడిన సమాచారంతో ఈ ఫా ర్మర్ రిజిస్ట్రీ నిర్వహిస్తారన్నారు. రెవెన్యూ శాఖ సేకరించిన భూ యజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయిస్తారని ఆయన వివరించారు. ఇందుకోసం జిల్లాలో ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రతీ క్లస్టర్లో నిరర్వహిస్తామని ఆయన తెలిపారు. రైతులు తమ వివరాలను వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. అభిరామ్‌కు అభినందన ఎలిగేడు(పెద్దపల్లి): సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి అభిరామ్ అన్నమయ్య సంకీర్తన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించడంపై మండలవాసులు శనివారం అభినందించారు. కరీంనగర్ శ్రీకోదండ రామాలయంలో జరిగిన జూనియర్ పోటీల్లో అభిరామ్ ప్రతిభ చూపాడని గ్రామస్తులు తెలిపారు. ఆయనను గ్రామస్తులు, సన్నిహితులు తదితరులు అభినందించారు. -
క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రతిభగల క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. క్రీడలతో శారీరక అభివృద్ధితోపాటు, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూ నియర్ కళాశాల మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన ఖోఖో, వాలీబాల్ వేస వి శిక్షణ శిబిరాలను ఎ మ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, ప్రతినిధులు గాజుల రాజమల్లు, సాయిరిమహేందర్, ముస్త్యాల రవీందర్, అమీరిశెట్టి తిరుపతి, చిలుక సతీశ్, అబ్బయ్య, రాజయ్య, రాజలింగం, గెల్లు మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
లోడ్‌కు సరిపడా వస్తేనే..
నాకున్న మూడెకరాల్లో సన్నవడ్లు పండించిన. 15రోజుల క్రితం వరికోసి పెద్దపల్లి మండలం కురుమపల్లి కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన. లారీ లోడ్‌కు సరిపడా వస్తేనే కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. – కామెర రమేశ్, రైతు, రామారావుపల్లి మిల్లులకు అలాట్ చేయలేదని.. నాకున్న ఐదెకరాల్లో వరికోసి కురుమపల్లి కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసిన. నిబంధనలకు అనుగుణంగా తేమశాతం కూడా వచ్చింది. సన్నవడ్లకు ఇంకా మిల్లులు అలాట్ కాలేదంటూ కొనుగోలు చేయటం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. – వేల్పుల సది, రైతు, రాగినేడు -
ప్రమాదాలను నియంత్రించాలి
● ప్రధాన కూడళ్లను ఆధునికీకరించాలి ● పకడ్బందీగా కార్యాచరణ చేపట్టాలి ● ట్రాఫిక్, పోలీసు అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలుపెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ట్రాఫిక్, పోలీసు, ఆర్ అండ్ బీ, రవాణా శాఖ అధికారులతో ఆయ న శుక్రవారం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. డీసీపీ కరుణాకర్ హాజరయ్యారు. పెద్దపల్లిలోని ప్రధానమైన రాజీవ్ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో జంక్షన్ల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాల సమయాల్లో విద్యార్థులు రోడ్డు దాటే లా వాహనాలను నియంత్రించాలని సూచించా రు. ఇందుకోసం స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చీకురాయి రోడ్డు, కమాన్, కూనారం క్రాస్‌రోడ్డు, ప్రగతినగర్, బస్టాండ్, మంథని ఫ్లైఓవర్ వద్ద రోడ్లు విస్తరించాలని అన్నారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మె ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏసీపీలు కృష్ణ, రమేశ్, సూ పరింటెండెంట్ ప్రకాశ్, ట్రాఫిక్, సీఐ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతలే బెదిరిస్తున్నారు
గోదావరిఖని: రామగుండంలో పాలన గాడితప్పిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ జాఫర్ జమానా కానవస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరించి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీడియాకు కూడా రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల అంతర్గాం తహసీల్దార్‌పై కాంగ్రెస్ నేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, ఒక ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీకి వెళ్లిన డీఎంహెచ్‌వోను కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం సరైంది కాదని అన్నారు. తమ హయాంలో వైద్యులకు అండగా నిలిచామన్నారు. ఓ పిల్లల వైద్యుడిపై దాడి చేయించి ఇక్కడ నుంచి వెళ్లగొట్టిన చరిత్ర ఉన్న రాజ్‌ఠాకూర్.. ఎమ్మెల్యేగా గెలిచాక మెడికల్ హబ్ అంటూ, డాక్టర్లకు అండగా ఉంటానని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిండచమేనన్నారు. రామగుండంలో సింగరేణి ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించిన ఘనత తొలి సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఇప్పటికై నా పాలనపై దృష్టి సారించి, అధికారులను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, గాధం విజయ, నడిపెల్లి మురళీధర్‌రావు, ముద్దసాని సంధ్యారెడ్డి్, నూతి తిరుపతి, పిల్లి రమేశ్, జక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈదురుగాలుల బీభత్సం పాలకుర్తి(రామగుండం): గురువారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి వివిధ గ్రా మాల్లో వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరిపైరు నేలవాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బసంత్‌నగర్ స్టాఫ్కాలనీలో పెద్ద చెట్టు క్వార్టర్‌పై విరిగి పడటంతో గోడలు కూలింది. ఇంటిముందు రేకులషెడ్డు, కారు ధ్వంసమయ్యాయి. -
ప్రభుత్వం పట్టించుకోవాలి
ఉపాధిహామీ సిబ్బందికి వెంటనే పే స్కేల్ ప్రకటించాలి. క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. అనేక ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్ ప్రకటించి ఆదుకోవాలి. – వెంకటేశ్‌గౌడ్, జేఏసీ చైర్మన్, పెద్దపల్లి ఇంటి కిరాయికి ఇబ్బంది ఇంటి కిరాయి చెల్లించేందుకు చేతిలో పైసలు ఉంటలెవ్వు. ప్రభుత్వం మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వక ఈ పరిస్థితి ఎదురైంది. పే స్కేల్ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. హామీ అమలు చేయాలి. – మల్లేశ్వరి, ఏపీఎం, సుల్తానాబాద్ సమ్మెకు వెనుకాడేదిలేదు పే స్కేల్ ప్రకటన, పెండింగ్ వేతనా ల చెల్లింపుల్లో జాప్యం చేస్తే మేము సమ్మె చేసేందుకు వెనుకాడేదిలేదు. ఒకేశాఖలో పనిచేస్తున్న ఒకరికి పే స్కేల్ అమలు చేస్తూ, మరొకరికి అ మలు చేయకపోవడం సరికాదు.– జీవన్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్, సుల్తానాబాద్ -
ఈఎస్ఐ, బీమా కల్పించాలి
ధూప, దీప నైవేద్యం పథకం కింద పనిచేసే అర్చకులకు ప్రభుత్వం ఈఎస్ఐ, ఆరోగ్య బీమా పథకాలను వర్తింప జేయాలి. ఈఎస్ఐ కూడా మాకు అమలు చేస్తే.. అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. వీటితోపాటు పేద అర్చకులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మేం కోరుతున్నాం. – నాగరాజ్ శర్మ, డీడీఎన్ స్కీం అధికార ప్రతినిధి వేతనాలు పెంచాలి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్చకుల బాధలను తెలుసుకొని అర్చకులకు వేతనం కల్పించాలనే ఉద్దేశంతో డీడీఎన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అది ఇప్పటివరకు విజయవంతంగా సాగుతోంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్చకుల బాధని అర్థం చేసుకొని డీడీఎన్ అర్చకులకు వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – రామకృష్ణమాచార్యులు, జిల్లా అర్చక సంఘం అధికార ప్రతినిధి -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
పెద్దపల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారికే కేటాయించేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రెండు రోజుల్లోగా తుదిజాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం పాలకుర్తి, అంతర్గాం మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షించారు. కమిటీల ద్వారా సేకరించిన జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తుదిజాబితా ఖరారు చేయాలని అన్నా రు. పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ జ్యోతి, పంచా యతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే గోదావరిఖని: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ శుక్రవారం కలిశారు. సీఎస్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సివిల్స్‌లో ఉచిత శిక్షణ పెద్దపల్లిరూరల్: సివిల్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ పొందేందుకు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని జిల్లా ఇన్చార్జి మైనార్జీ సంక్షేమ అధికారి రంగారెడ్డి తెలిపారు. మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా 100మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తారన్నారు. ఇందులో 33.33శాతం మహిళలు, దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. జూన్ 5న ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ఫోన్ నంబ రు 040–23236112లో సంప్రదించాలన్నారు. 6న జాబ్ మేళా పెద్దపల్లిరూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు కేఎల్ గ్రూప్ సర్వీసెస్, మేడ్చల్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 6న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్లోని ఉపాధి కల్పనాధికారి కా ర్యాలయంలో జరిగే జాబ్ మేళాకు టెన్త్ పాసై, 18నుంచి 35ఏళ్లలోపు వయసు గలవారు హాజరు కావాలన్నారు. వివరాలకు 63095 18695, 70931 72221, 89853 36947 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 20న సార్వత్రిక సమ్మె చేస్తాం : సీఐటీయూపెద్దపల్లిరూరల్: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాసేలా రూపొందిస్తున్న చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఈనెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ వేణు, కార్మికశాఖ కార్యాలయంలో శ్రీనాథ్‌కు శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. కార్మిక శ్రేయస్సు ధ్యేయంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను అమలులోకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కార్మికహక్కులను హరించడమేనని అన్నారు. ఈ క్రమంలో చేపట్టిన సమ్మెలో సంఘటిత, అసంఘటిత, ప్రభుత్వ రంగసంస్థల కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. నా యకులు చందర్, సునీల్, వైకుంఠం, లక్ష్మణ్, సమ్మిరెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. పంపిణీకి సిద్ధంగా పెసర విత్తనాలు సుల్తానాబాద్(పెద్దపల్లి): రైతులకు పంపిణీ చేసేందుకు 30 క్వింటాళ్ల ఐపీఎల్– 410 –3 రకం పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. పెద్దపల్లి డీసీఎంఎస్‌లో 12 క్వింటాళ్లు, సుల్తానాబాద్ పీఏసీఎస్‌లో 5 క్వింటాళ్లు, రామగిరి ఏఆర్ఎస్కేలో 3 క్వింటాళ్లు, మంథని ఏఆర్ఎస్కేలో 6 క్వింటాళ్లు, కాల్వ శ్రీరాంపూర్ పీఏసీఎస్‌లో 2 క్వింటాళ్లు, ధర్మారం మండలం నందిమేడారం పీఏసీఎస్‌లో 2 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని ఆయన వివరించారు. అవసరమైన రైతులు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. క్వింటాల్ పత్తి రూ.7,125 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం పత్తి క్వింటాలు కు గరిష్టంగా రూ.7,125 ధర పలికిందని మా ర్కెట్ ఇన్చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్టంగా రూ.6,325గా, సగటు రూ.6,825గా ఉందని ఆయన పేర్కొన్నారు. సీఎస్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే ఠాకూర్ -
ధూప, దీపాలకు వేళాయె
● ఆలయాలకు ఆర్థిక సాయానికి కొత్త దరఖాస్తులు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 900 వరకు ఆలయాలు ● చిన్న ఆలయాలకు రెండు, మూడు నెలలకోసారి వేతనాలు ● గౌరవ భృతి పెంచాలని డిమాండ్ ● ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కావాలంటున్న అర్చకులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆలయాల్లో ధూప, దీపాలకు వేళయింది. దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల (డీడీఎన్స్కీమ్) పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పథకం కింద ఎంపికయిన ఆలయానికి ప్రతినెలా రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. ఇందులో రూ.4,000 ధూప, దీప నైవేద్యాలకు, మిగిలిన రూ.6,000 గౌరవ భృతి కింద చెల్లిస్తారు. ఈ పథకం కోసం ఈనెల 24వరకు దరఖాస్తులు కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం నిబంధనలు రూపొందించి, ఆ మేరకు అర్హత, ఆసక్తి కలిగిన ఆలయాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆలయం నిర్మాణమై కనీసం 15ఏళ్లు అయి ఉండాలని ప్రాథమిక నిబంధన విధించారు. వీటితోపాటు దరఖాస్తు ఫారంలో మిగిలిన నిబంధనలు పొందుపరిచారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవభృతి పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అర్చకులు కోరుతున్నారు. వైఎస్ హయాంలో మొదలై.. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈపథకం రూపుదిద్దుకుంది. అప్పట్లో ధూప, దీప నైవేద్యాల కోసం రూ.2,500 చొప్పున ఆనాటి ఖర్చులకు అనుగుణంగా చెల్లించేవారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల మాదిరిగానే ఈ పథకం కూడా రాష్ట్రం విడిపోయినా కొనసాగుతుండటం గమనార్హం. రూ.2,500 నుంచి క్రమంగా ఆర్థికసాయం రూ.10,000కు చేరుకుంది. ధూప, దీప నైవేద్యాల ఖర్చులకు 2018లో ఈ మొత్తం రూ.6,000గా నాటి సీఎం కేసీఆర్ పెంచారు. తరువాత రూ.10,000 పెంచుతూ జీవో విడుదల చేసినా.. ప్రస్తుత సీఎం రేవంత్ హయాంలో అమలవుతోంది. చూసేందుకు చిన్నమొత్తంగా కనిపించినా.. పూజారులకు ఇస్తున్న గౌరవ భృతిని అన్ని ప్రభుత్వాలు ఆదరిస్తున్నాయి. అదే సమయంలో పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని పలువురు పూజారులు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 2022లో.. ప్రతీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఈ పథకానికి ప్రాథమిక అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2022లో చివరిసారిగా నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత నోటిఫికేషన్ వచ్చింది. ధూప, దీప నైవేద్యాల కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 898 ఆలయాలు ఈ పథకం కింద నెలనెలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం పొందుతున్నాయి. మూడేళ్లలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆలయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మరో వంద వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ధూప, దీప నైవేద్యం పథకం కింద ఆలయాలు ఫేజ్–1 ఫేజ్–2 ఫేజ్–3 మొత్తం కరీంనగర్ 118 71 67 256జగిత్యాల 153 67 102 322పెద్దపల్లి 64 40 49 153రాజన్నసిరిసిల్ల 83 36 48 167 -
తూకం.. ఆలస్యం
● లారీ లోడ్‌కు సరిపడా వస్తేనే సేకరణ ● సన్నరకాల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ● బహిరంగ మార్కెట్లో మంచిడిమాండ్ ● కేంద్రాల్లో రైతులకు తప్పని పడిగాపులు సాక్షి, పెద్దపల్లి: సన్నరకం వడ్లకు బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా రైతుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో అటువైపే మొగ్గుచూపుతూ, కొనుగోలు కేంద్రాలకు దొడ్డువడ్లు తీసుకొస్తున్నారు. కొన్ని సెంటర్లకు తెచ్చి న సన్నవడ్లను తేమశాతం పేరిట కొనుగోలు చేయడం లేదు. లారీలోడ్‌కు సరిపడా వస్తేనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో సన్నవడ్లు తీసుకొస్తున్న కొందరు రైతులు తూకం కోసం ఎదురుచూస్తున్నారు. అకాలవర్షాల భయంతో కొందరు బహిరంగ మార్కెట్లోనే సన్నవడ్లు విక్రయిస్తున్నారు. సన్నాల్లో 33 రకాలు.. సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తోంది. దొడ్డు రకంలో గ్రేడ్–ఏ క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తోంది. 33 సన్న రకాలను గుర్తించిన ప్రభుత్వం.. ఆ రకాలకు బోనస్‌తో కలుపుకొని రూ.2,820 ధర చెల్లిస్తోంది. లారీ లోడ్ కాక.. మిల్లులకు అలాట్ చేయక ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఈసారి యాసంగిలో రైతులు ఎక్కువగా దొడ్డురకం సాగుచేశారు. సన్నరకాలను తక్కువగా సాగు చేయడమేకాదు.. కొనుగోలు కేంద్రాలకు కూడా సరిగా తేవడం లేదు. కొందరే తీసుకొస్తున్నా.. సన్నవడ్లను దొడ్డు రకంతో కలిపి రైస్‌మిల్లులకు తరలించే వీలు ఉండదు. సన్నాల తరలింపు కోసం ప్రత్యేకంగా లారీని కొనుగోలు కేంద్రానికి పంపించాల్సి ఉంది. అయితే, తక్కువగా సన్నవడ్లు రావడంతో నిర్వాహకులు సకాలంలో తూకం వేయడంలేదు. లారీ లోడ్‌కు సరిపడా వస్తేనే కొనుగోలు చేస్తామంటున్నారు. అంతేకాదు.. సన్నవడ్లకు రైస్‌మిల్లులు కేటాయించలేదు. దీనితోనూ కొనుగోళ్లలో ఆలస్యమవుతోంది. మరోపక్క సన్నాలకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంది. క్వింటాల్ బియ్యానికి రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ధర పలుకుతోంది. అందుకే వడ్లు మరాడించి విక్రయించాలని సన్నాలు పండించిన రైతులు ఆలోచిస్తున్నారు. దీంతోపాటు రైతులు తమతిండి కోసం సన్నాలే వినియోగిస్తున్నారు. కొన్నిసెంటర్లకు సన్నాలు వచ్చినా తేమశాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోలు చేయడం లేదు. ఇదేవిషయమై పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్‌ను సంప్రదించగా.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతీధాన్యపు గింజను కోనుగోలు చేస్తామన్నారు. సన్నవడ్లను రైస్ మిల్లులకు అలాట్ చేశామని, కొనుగోళ్లను వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో ధాన్యం వివరాలు కొనుగోలు కేంద్రాలు 333 ప్రారంభించినవి 315ధాన్యం సేకరణ లక్ష్యం(లక్షల మెట్రిక్ టన్నుల్లో) 3.50 కొనుగోలు చేసిన దొడ్డువడ్లు(మెట్రిక్ టన్నుల్లో) 81,308 కొనుగోలు చేసిన సన్నరకం వడ్లు(మెట్రిక్ టన్నుల్లో) 828 మిల్లులకు తరలించిన వడ్లు(మెట్రిక్ టన్నుల్లో) 81,799 యాసంగి సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు.. జిల్లాలో యాసంగిలో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో సన్నరకం 78,390 ఎకరాల్లో పండించారు. మొత్తంగా 4.20 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 50వేల టన్నుల సన్నరకం, 3 లక్షల టన్నుల దొడ్డురకం ఉంటుందని అంచనా వేశారు. రైతుల తిండికి, బయటి మార్కెట్లో విక్రయించగా పోను మిగిలిన సుమారు 3.50 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. కానీ, వరి కోతలు దాదాపు చివరిదశకు చేరినా సన్నరకం వడ్లు ఆశించిన స్థాయిలో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. -
పే స్కేల్ కోసం పోరుబాట
● మూడు నెలలుగా అందని వేతనాలు ● ఇబ్బందుల్లో ఉపాధిహామీ సిబ్బంది ● దశల వారీగా పోరాటాలకు కార్యాచరణ : జేఏసీ నేతలు సుల్తానాబాద్(పెద్దపల్లి): గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఉపాధిహామీ సిబ్బంది పే స్కేల్ సాధన కోసం పోరుబాట ఎంచుకున్నారు. ఇందుకోసం దశలవారీగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. గతనెల 29న అధికారులకు వినతిపత్రాలు అందిస్తూ వస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు.. శనివారం ఏకంగా మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులకూ విన్నవించేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా ఈనెల 5న ప్రజాభవన్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రణాళిక రూపొందించారు. పే స్కేల్, ఉద్యోగ భద్రత లేక ఈజీఎస్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. మూడు నెలలుగా ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లకు వేతనాలు కూడా విడుదల కావడంలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలల నుంచి జీతాలు రాక వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పనుల పర్యవేక్షణలో కీలకం.. ఈజీఎస్ ద్వారా చేపట్టే పనుల్లో సిబ్బంది కృషి కీలకంగా ఉంది. ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణం, భూ అభివృద్ధి పనులు, తెలంగాణకు హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లెవెల్ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు.. ఇలా అనేక పనులను ఈజీఎస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఈజీఎస్‌లో ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లకు, హెచ్ఆర్ మేనేజర్లు, డీబీటీలు ఇలా.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. అద్దెకు కూడా ఇబ్బందులే.. ఈజీఎస్ సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని పేదలే అధికంగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తేనే వీరికి వేతనాలు అందుతాయి. అయితే, చాలీచాలని వేతనాలతో సిబ్బంది తమ పిల్లలకు స్కూల్ ఫీజు చెల్లించలేకపోతున్నారు. వంటసామగ్రి, ఇంటి అద్దె, పాలబిల్లులు, ఈఎంఐలు చెల్లించలేక అవస్థ పడుతున్నారు. అదేవిధంగా కార్యాలయాలకు వెళ్లడానికి వాహనాలకు పెట్రోల్, ఆటో, బస్సుచార్జీలు కూడా ఉండడం లేదంటున్నారు. మరోవైపు.. గ్రామీణాభివృద్ధి(సెర్ప్)శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తున్న ప్రభుత్వం.. తమను ఎందుకు పట్టించుకోవడం లేదని ఈజీఎస్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఈజీఎస్ సిబ్బంది ఇలా ఏపీఎంలు 11 జేఈలు/ఈసీలు 09కంప్యూటర్ ఆపరేటర్లు 19 ఫీల్డ్ అసిస్టెంట్లు 250 -
బదిలీ అయినా కదలరు
రామగుండం: పుట్టింది.. పెరిగింది.. పెళ్లి చేసుకుని, పిల్లలను చదివించింది ఇక్కడే. స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. కొందరు వారసత్వ ఉద్యోగాలు కూడా చేశారు. మరికొందరు కాంట్రాక్టు కార్మికులుగా, ఆర్టిజన్లుగా పనిచేశాక పర్మనెంట్ అయ్యా రు. ఒక్కొక్కరు సుమారు ఇరవై ఏళ్లపాటు రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలోనే ఉద్యోగా లు చేశారు. ఈ ప్రాంతంతో బంధాలు పెనవేసుకున్నారు. అయితే, గతేడాది జూన్ 4న బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూతపడింది. జూలైలో 48 మంది ఇంజనీర్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతలో ఏమైందో, ఏమో.. కొద్దిగంటల్లోనే ఆ ఉత్తర్వులు రద్దయ్యాయి. అప్పటినుంచి సుమారు 10 నెలల పాటు వారికి రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. కాగా, గత ఏప్రిల్ 12న 85 మంది ఉద్యోగులను యాదాద్రికి బదిలీ చేస్తున్నట్లు విద్యుత్ సౌధ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. బదిలీ ఉత్తర్వుల జాబితాలో సూపరింటెండింగ్ ఇంజనీర్ విజేందర్‌తోపాటు ఓఅండ్ఎం నుంచి 72 మంది, ఇంజనీర్లు 11 మంది, ఏడీఈ నుంచి ఒకరి పేర్లు వచ్చాయి. వీరు వారంలోగా రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. భిన్న వాదనలు.. యాదాద్రికి 85 మందిని బదిలీ చేయడంపై ఉద్యోగుల్లో విమర్శలు వినిపించాయి. ముందస్తు సమాచారం లేకుండా, సాంకేతిక అంశాలను పరి గణనలోకి తీసుకోకుండా హఠాత్తుగా బదిలీ చేయ డం, వారం లోగా రిలీవ్ కావాలని ఆదేశించడం సరి కాదని, అన్ని విభాగాలకు బదిలీలు వర్తింపజేయా ల్సి ఉందంటూ.. ఉత్తర్వులను పెండింగ్‌లో ఉంచారు. అయితే, కొంతజాప్యమైనా బదిలీ తప్పదని భావించిన నలుగురు ఇంజనీర్లు, 11 మంది ఓఅండ్ఎం ఉద్యోగులు.. తమ పలుకుబడి ఉపయోగించి బదిలీలను నిలుపుదల చేస్తూ గురువారం ఉత్త ర్వులు తెప్పించుకున్నారు. ఫలితంగా బదిలీ అయి న ఉద్యోగులు, బదిలీ నిలిచిపోయిన ఉద్యోగుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. అక్కడ కొరత.. ఇక్కడ మిగులు యాదాద్రి విద్యుత్ కేంద్రంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై జరిపిన విచారణలో ఉద్యోగుల కొరత అంశం బహిర్గతమైంది. సిబ్బంది కొరతతోనే పర్యవేక్షణ లోపించిందని, ఫలితంగా ప్రమాదం జరిగిందని తేలింది. రామగుండంలో మూతపడిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 200 మంది ఇంజనీర్లను కూర్చోబెట్టి ప్రతినెలా రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారనే అంశంపై యాదాద్రిలోని ఉన్నతాధికారులు విద్యుత్ సౌధలో చర్చించారు. ఈ క్రమంలో గత నెల యాదాద్రికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడినా.. రిలీవ్ కాకపోవడంతోపాటు బదిలీలను రద్దు చేసుకునేందుకు ఎవరికి వారే పైరవీలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆదేశాలు అమలు చేస్తున్నాం గత ఏప్రిల్‌లో నాతోపాటు 85 మందిని యాదాద్రికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ ఉత్తర్వుల్లోని ఇంజనీర్లలో నలుగురు, 11 మంది ఓఅండ్ఎం ఉద్యోగుల బదిలీలను నిలిపివేస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వారిని మినహాయించి మిగతా వారు త్వరగా రిలీవ్ కావాలంటూ ఉత్తర్వులు అందజేశాం. – పి.విజేందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం -
గుర్తుకొస్తున్న ‘గాయం’
● ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన రైలు ● 62 మంది ప్రయాణికులు మృతి ● కొలనూర్ లెవల్ క్రాసింగ్ వద్ద ఘటన ● ప్రమాదం జరిగి 43 సంవత్సరాలు ప్రమాదాన్ని కళ్లారా చూశా కొలనూరు రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద అప్పట్లో గొలుసులను అడ్డుగా కట్టి రాకపోకలు నిలువరించేవారు. రైళ్లు వెళ్లాక వాటిని తొలగించేవారు. అయితే, 1982లో మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సు గొలుసు దాటి ట్రాక్‌పై వచ్చింది. అదేసమయంలో వేగంగా వచ్చిన జయంతి జనతా రైలు ఢీకొట్టింది. 62 మంది మృతిచెందారు. ఈ ప్రమాదాన్ని నేను కళ్లారా చూశా. – రామప్ప నారాయణస్వామి, రైల్వే రిటైర్డ్ ఉద్యోగి తప్పని ఇబ్బందులు కొలనూర్ లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద పది నిమిషాలకోసారి గేట్ వేస్తున్నారు. పేషెంట్లను తీసుకెళ్లే 108 అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలుగుతంది. వందల సంఖ్య లో రైళ్లరాకపోకలు ఉన్నాయి. వాహనదారులకూ తిప్పలు తప్పడంలేదు. ఎండకాలంలో ఇబ్బంది తీవ్రంగా ఉంది. – ఎండీ సలీం, గ్రామస్తుడు, కొలనూర్ ఓదెల(పెద్దపల్లి): కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య కొలనూర్ రైల్వేస్టేషన్ సమీప రైల్వే లెవల్ క్రాసింగ్గేట్ వద్ద సుమారు 43 ఏళ్లక్రితం దక్షిణ మధ్యరైల్వే చరిత్రలో తొలిసారి ఘొర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మంది ప్రయాణికులు ప్రాణాలు కో ల్పోయారు. అయినా, ఇప్పటివరకు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించలేదు. ఫలితంగా మూడు మండలాల ప్ర యాణికులు, వివిధ ప్రాంతాల నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు గేట్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1982లో ప్రమాదం.. 1982 మార్చి 20న ఓ ప్రైవేట్ బస్సు సర్వీసు ప్ర యాణికులతో సుల్తానాబాద్ నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్తోంది. మధ్యాహ్నం 1.15గంటలకు కొలనూర్ రైల్వేస్టేషన్ సమీప లెవల్ క్రాసింగ్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో గేట్ లేకపోవడంతో డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. అదేసమయంలో కాజీపేట వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన జయంతి జనతా ఎక్స్‌ప్రెస్ రైలు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 62మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు తునకాతునకలయ్యింది. ఈ ప్రమాదంతో దక్షిణ మధ్యరైల్వే చరిత్రలో నిలిచిపోయింది. ఆ సమయంలో గేట్ల వద్ద ఏర్పాటు చేసిన గొలుసు తొలగించి లెవల్ క్రాసింగ్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నిత్యం వందల కొద్దీ రైళ్లు.. ప్రస్తుతం కాజీపేట – బల్హార్షా మధ్య నిత్యం వంద ల కొద్దీ రైళ్లు నడుస్తున్నాయి. దీంతో కొలనూర్ లె వల్ క్రాసింగ్ వద్ద తరచూ గేట్ వేస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు, వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఈ మార్గం ద్వారా ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాలకు చెందిన వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మూడోట్రాక్ కూడా అందుబాటులోకి రావడంతో రైళ్ల రద్దీ బాగా పెరిగింది. దీంతో అర్ధగంటకోసారి, పావుగంటకోసారి గేట్ వేస్తూ గంటల కొద్దీ తీయడంలేదు. రాకపోకలు సాగించే ప్రజలకు నిరీక్షణ తప్పడంలేదు. ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు, అనారోగ్య సమస్యలు, అత్యవసరాల కోసం ఆస్పత్రులకు వెళ్లేవారి ప్రాణాలు ఈ గేట్‌తో ప్రమాదంలో పడిపోతున్నాయి. హడావుడికే పరిమితం.. కొలనూర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద రైల్వే ఫ్లై ఓవర్ నిర్మించాలని అప్పట్లో పలుసార్లు సర్వే చేశారు. వంతె నిర్మిస్తున్నామంటూ హడావుడి చేశారు. అంతేకాదు.. నిధులు మంజూరయ్యాయని కూడా ప్రకటించారు. కానీ, వంతెన నిర్మాణం ఇప్పటికీ కార్యరూపం దాల్చడంలేదు. గంటల కొద్దీ నిరీక్షిస్తున్నాం కొలనూర్ రైల్వేగేట్ ఎప్పుడూ వేసి ఉంటున్నది. రైళ్లు వెళ్లే వరకు తీయడంలేదు. గంటల కొద్దీ నిరీక్షిస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నా.. ఫ్లై ఓవర్ నిర్మించడంలేదు. సామాన్యులే కాదు.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకూ తిప్పలు తప్పడంలేదు. – కాశవేని చేరాలు, గ్రామస్తుడు, గోపరపల్లి -
విద్యార్థులకు జీఎం అభినందన
గోదావరిఖని: పదోతరగతి పరీక్షల్లో సింగరేణి పాఠశాల విద్యార్థులు సత్తా చాటడంతో ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ అభినందించారు. సెక్టార్–2 స్కూల్‌కు చెంది న విద్యార్థి అస్మిత అత్యధికంగా 559 మార్కులు సాధించింది. మొత్తం 59మంది విద్యార్థులు పరీక్ష రాయగా 52 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 8 మంది 500లకుపైగా మార్కులు సాధించి సత్తా చాటారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మంచి మార్కులు సాధించి సింగరేణి ఎ డ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పా ఠశాలలన్నింటిలోనూ సెక్టార్ –2 పాఠశాల ఉత్తమంగా నిలిచింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని అస్మితను జీఎం లలిత్‌కుమార్ అభినందించారు. అదేవిధంగా పాఠశాల కరస్పాడెంట్ కిరణ్‌బాబు, ఇన్చార్జి హెచ్ఎం స్వర్ణలత తదితరులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.