
రైతుకంట క‘న్నీళ్లు’
ఇతడు కౌలురైతు అల్లెపు సారయ్య. పెద్దపల్లిలోని జ్యోతినగర్ స్వస్థలం. పదెకరాల్లో వరి పండించాడు. ఇటీవల వరి కోసి వ్యవసాయ మార్కెట్‌కు వడ్లు తీసుకొచ్చాడు. తూకం వేయడంలో జాప్యమైంది. నాలుగు రోజు వ్యవధిలో రెండుసార్లు కురిసిన అకాలవర్షంలో వడ్లు కొట్టుకుపోయాయి.
ధాన్యం తడవకుండా కప్పిన కవర్‌పై వర్షపునీరు ఎత్తిపోస్తున్న పెద్దపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన తూముల కై లాసం ఇతడు. 15 రోజులుగా మార్కెట్‌లో ధాన్యం కుప్పగా పోసి బార్‌దాన్ కోసం నిరీక్షిస్తున్నాడు. అకాల వానకు ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది.

రైతుకంట క‘న్నీళ్లు’