మురుగునీటి కాలువలు శుభ్రం | - | Sakshi
Sakshi News home page

మురుగునీటి కాలువలు శుభ్రం

May 22 2025 12:07 AM | Updated on May 22 2025 12:07 AM

మురుగ

మురుగునీటి కాలువలు శుభ్రం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్‌ 19వ డివిజన్‌ న్యూమారేడుపాకలో డ్రెయి నేజీల్లోని పూడికను బుధవా రం బల్దియా సిబ్బంది తొలగించారు. సైడ్‌ డ్రెయినేజీలు లేక, బురద, వర్షపు, మురుగునీరు నిలిచి దు ర్వాసన వస్తోందనే స్థానికుల ఆవేదనపై ‘కంపుకొడుతున్న కాలువలు’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో బల్దియా అధికారులు స్పందించారు. సూపర్‌వైజర్‌ సార య్య ఆధ్వర్యంలో సిబ్బంది కాలువలు శుభ్రం చేశారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

కాట్నపల్లి గ్రామంలో సర్వే

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): జాతీయ గు ణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌వో) ఆధ్వ ర్యంలోని కరీంనగర్‌ సర్వే బృందం కాట్నపల్లిలో బుధవారం సర్వే చేసింది. ఆరోగ్యం, అక్షరాస్యత, సాంఘిక, ఆర్థిక అంశాలపై సభ్యులు ఇంటింటా తిరిగి వివరాలు సేకరించారు. గ్రా మాలు, పట్టణాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య సా మజిక, ఆర్థిక పరిస్థితులను తెలుకోవడమే సర్వే ముఖ్య ఉద్దేశమని సభ్యులు తెలిపారు. బృందంలోని సభ్యులు బ్రిజేందరసింగ్‌, శ్రీని వాసరావు, సుధాకర్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

బడుల బలోపేతానికి కృషి

జ్యోతినగర్‌(రామగుండం): ప్రభుత్వ పాఠశాల ల బలోపేతానికి కృషి చేయాలని జిల్లా విద్యాధికారి మాధవి సూచించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో జిల్లాలోని 14 మండలాల ఉన్న త పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేకాధికారులు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపా ల్స్‌తో ‘పాఠశాలల నిర్వహణ, నాయకత్వ లక్ష ణాలు’ అంశంపై చేపట్టిన శిక్షణకు బుధవారం ఆమె హాజరై మాట్లాడారు. పాఠశాలల నిర్వహణ, నైపుణ్యాలను అలవార్చుకోవాలని సూ చించారు. విద్యార్థులు సబ్జెక్టుల్లో అభ్యాసన ఫ లితాలు సాధించేలా, విద్యావ్యవస్థలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా బోధన జరిగేలా ప్రధానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. కోర్సు డైరెక్టర్‌ జి.జయరాజు, రిసోర్స్‌ పర్సన్లు ఆగయ్య, రాగమయి, భవాని, పురుషోత్తం, టెక్నికల్‌ పర్సన్‌ దినేశ్‌, సీఆర్‌పీ వెంకటేశ్‌, రామ్‌కుమార్‌, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

బొడ్రాయి వార్షికోత్సవం

కమాన్‌పూర్‌: భూదేవి, శ్రీదేవి సహిత బోడ్రా యి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రత్యక పూజలు చేశారు.

23న తిరంగా యాత్ర

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 23న జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి కడారి అశోక్‌రావు తెలిపారు. హిందువులనే టార్గెట్‌గా చేసి ఉగ్రవాదులు కిరాతక చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

వసతులు మెరుగుపర్చాలి

పెద్దపల్లిరూర ల్‌: ప్రభుత్వ పా ఠశాలల్లో వసతులు మె రుగు పర్చే లా చర్యలు తీసుకోవాలని జార్జిరెడ్డి పీడీఎస్‌యూ జిల్లా అ ధ్యక్షుడు నరేశ్‌ కోరారు. బుధవారం డీఈవో ఆ ఫీసులో వినతిపత్రం అందజేశారు. శివ, రాకేశ్‌, సాయికుమార్‌, విష్ణు, సంజయ్‌ పాల్గొన్నారు.

మురుగునీటి కాలువలు శుభ్రం 1
1/3

మురుగునీటి కాలువలు శుభ్రం

మురుగునీటి కాలువలు శుభ్రం 2
2/3

మురుగునీటి కాలువలు శుభ్రం

మురుగునీటి కాలువలు శుభ్రం 3
3/3

మురుగునీటి కాలువలు శుభ్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement